ETV Bharat / politics

చంద్రబాబు ఇంటిపై దాడి కేసు - మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌కు జోగి రమేశ్‌ - Jogi Ramesh to Mangalagiri PS - JOGI RAMESH TO MANGALAGIRI PS

Jogi Ramesh Came to Mangalagiri Police Station: చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు మంగళగిరి గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌కు ఆయన వచ్చారు. దాడి ఘటనపై జోగి రమేశ్‌ను పోలీసులు విచారించనున్నారు.

Jogi Ramesh
Jogi Ramesh (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 16, 2024, 1:16 PM IST

Updated : Aug 16, 2024, 2:09 PM IST

Jogi Ramesh came to Mangalagiri Police Station: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి జోగి రమేశ్‌ పోలీసులు విచారణకు హాజరయ్యారు. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో జరిగిన విచారణకు జోగి రమేశ్‌ తన న్యాయవాదితో కలిసి పాల్గొన్నారు. దాడి రోజు జోగి రమేశ్‌ వినియోగించిన సెల్​ఫోన్, వాహనాల వివరాలను పోలీసులకు అందజేశారు. తాను చంద్రబాబు నాయుడుకి నిరసన తెలియజేసేందుకు వెళ్లాను తప్ప ఎలాంటి దాడికి యత్నించలేదని జోగి రమేశ్‌ చెప్పారు.

ఆ సమయంలో అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబుకు తన నిరసనను తెలిపేందుకు అనుచరులతో అక్కడికి వెళ్లానన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని జోగి రమేశ్‌ తెలిపారు. అగ్రిగోల్డ్ భూములు తెలియక కొన్నామని అందులో, తమ కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని రమేశ్‌ వెనకేసుకొచ్చారు. త్వరలోనే అన్ని వివరాలను మీడియా ముందు ఉంచుతానని అన్నారు.

అగ్రిగోల్డ్ భూముల కేసులో ఏసీబీ కొరడా- మాజీ మంత్రి జోగి రమేష్‌ కుమారుడు అరెస్ట్! - ACB Raids in Jogi Ramesh House

కాగా వైఎస్సార్సీపీ పాలనలో ఆ పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో భయంతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులలో వరుసగా పిటిషన్లు వేస్తున్నారు. 2021వ సంవత్సరంలో ఉండవల్లిలోని నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై జోగి రమేశ్‌, ఆయన అనుచరులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ జోగి రమేశ్‌ హైకోర్టులో పిటిషన్ వేశారు.​

జోగి రమేశ్‌ పిటిషన్​పై హైకోర్టు విచారణ సైతం జరిగింది. ఇదిలా ఉండగా, మరోవైపు ఇదే కేసులో మంగళగిరి డీఎస్పీ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ తాడేపల్లి పోలీసులు జోగి రమేశ్‌​కి కొద్ది రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. 2021 సెప్టెంబర్ 17న ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు ఇంటిపైకి జోగి రమేశ్‌ తన అనుచరులతో కలిసి దాడికి వెళ్లారు. అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులపైనా దాడికి తెగబడ్డారు. అయితే ఈ ఘటనలో ఇరు వర్గాలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు పేర్కొన్నారు.

జోగి రమేష్ కుమారుడిపై ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేసిన ఏసీబీ - FIR on Jogi Rajeev

జోగి రమేశ్‌ డ్రైవర్ రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలుగుదేశం పార్టీ నేతలపై ఎస్సీ అట్రాసిటీ సెక్షన్లు నమోదు చేశారు. అదే విధంగా టీడీపీ నేత సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జోగి రమేశ్‌తో పాటు ఆయన అనుచరులపై మరో కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులకు సంబంధించి అప్పట్లో తెలుగుదేశం పార్టీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు, వైఎస్సార్సీపీ నేతల జోలికి మాత్రం వెళ్లలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంతో ఈ కేసు విచారణ తిరిగి ప్రారంభమైంది.

దీంతో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ జోగి రమేశ్‌ హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే ముందస్తు బెయిల్ గడువు జులైలోనే ముగిసింది. ఈ నేపథ్యంలో జోగి రమేశ్‌​ను సోమవారం నాడు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే తాను హైదరాబాద్​లో ఉన్నందున విచారణకు రాలేనని జోగి రమేశ్‌ అప్పుడు సమాధానమిచ్చారు. దీంతో మంగళవారం సాయంత్రం మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో జరిగే విచారణకు రావాలని సూచించారు.

అయితే జోగి రమేశ్​ కుమారుడిని ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం అరెస్టు చేశారు. దీని కారణంగా ఆయన మంగళవారం సాయంత్రం మంగళగిరిలో జరిగే విచారణకు హాజరుకాలేదు. తాజాగా ఈ రోజు మంగళగిరి గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన జోగి రమేశ్‌ విచారణకు హాజరయ్యారు.

అగ్రిగోల్డ్​ భూముల కబ్జా - మాజీ మంత్రి తనయుడు జోగి రాజీవ్‌ అరెస్ట్​ - Remand for Jogi Rajeev

Last Updated : Aug 16, 2024, 2:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.