ETV Bharat / politics

విశాఖ డెయిరీలో ఆడారి కుటుంబం అక్రమాలు - లోకేశ్​కు మూర్తియాదవ్‌ ఫిర్యాదు - JANASENA MURTHY YADAV COMPLAINT

విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరిన జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్

PEETHALA_MURTHY_YADAV
PEETHALA MURTHY YADAV (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 19, 2024, 9:21 PM IST

Updated : Oct 19, 2024, 9:52 PM IST

Murthy Yadav On Irregularities in Visakha Dairy: విశాఖ డెయిరీలో జరిగిన అక్రమాలు, అవినీతిపై మంత్రి నారా లోకేశ్​కు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఫిర్యాదు చేశారు. రెండు వేల కోట్ల టర్నవర్​తో ఉన్న విశాఖ డెయిరీ నేడు నష్టాలలో ఉందని, అప్పులు తీసుకునే పరిస్థితిలోకి దిగజారిందన్నారు. విశాఖ డెయిరీ సంస్థ ఛైర్మన్‌ ఆడారి ఆనంద్‌ కుటుంబం చిన్నగదిలి సర్వే నెంబర్ 13,21,26లో 7.96 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని అన్నారు. దీని విలువ 500 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు.

విశాఖ డెయిరీ నుంచి కోట్ల రూపాయల నిధులు దోచేశారని ఆరోపించారు. ఆడారి రాజకీయంగా చేసే ప్రతి పని కోసం విశాఖ డెయిరీ నుంచి కోట్ల రూపాయలు నిధులు దోచేశారన్నారు. చివరికి సిద్ధం సభలకు విశాఖ డెయిరీ మజ్జిగ ప్యాకెట్లు పంచి డెయిరీ సొమ్ము వైఎస్సార్సీపీ పాలు చేశారని అన్నారు. వైఎస్సార్సీపీ సిద్ధం సభలకూ విశాఖ డెయిరీ సొమ్మునే వాడారన్నారు. మెరకముడిదాం మండలం గర్భం గ్రామంలో విశాఖ డెయిరీ పేరుతో 50 ఎకరాల భూమిని కొన్నారని వెల్లడించారు. విశాఖ డెయిరీ ఎంప్లాయిస్​కి ఇల్లు కట్టిస్తామని ఒక్కొక్కరి దగ్గర నుంచి 86 వేల రూపాయలు వసూలు చేశారని తెలిపారు.

ఉదోగులు డబ్బులతో నరవ వద్ద మూడు ఎకరాల భూమిని కొని అందులో 90 సెంట్లు భూమిని ఆడారి కుటుంబ సభ్యులు ఉచితంగా రాయించుకున్నారని ఫిర్యాదు చేశారు. విశాఖ డెయిరీ ఆస్తులను డైరెక్టర్లకు దారాదత్తం చేశారని, ఆడారి కుటుంబం పాడి రైతుల కష్టాన్ని దోచుకుని విలాసాలకు ఖర్చు పెట్టారని చెప్పారు. విశాఖ డెయిరీ సంపదను, పాడి రైతుల కష్టాన్ని దోచుకున్న ఆడారి కుటుంబంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి అని మూర్తి యాదవ్ ఫిర్యాదు నారా లోకేశ్​కు ఫిర్యాదు చేశారు.

విశాఖ డెయిరీ నష్టాల్లోకి తెచ్చారు- బోర్డును రద్దు చేయాలి: మూర్తియాదవ్ - Murthy Yadav on Visakha Dairy

విశాఖలో రూ.500 కోట్ల ప్రభుత్వ భూమి కబ్జా - కలెక్టర్​కు జనసేన నేత పీతల మూర్తియాదవ్ ఫిర్యాదు

Last Updated : Oct 19, 2024, 9:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.