YSRCP Leaders Illegal Sand Mining : రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ - NGTలో విచారణ జరుగుతోంది. కలెక్టర్లు, అధికారుల బృందాలు తనిఖీల పేరిట హడావుడి చేస్తున్నాయి. అయినా సరే వైఎస్సార్సీపీ నేతలకు ఇసుకాసురులకు చీమ కుట్టినట్లైనా లేదు.
రాష్ట్రంలో ఇసుక దొంగలపై జగన్ సర్కారు సమాధానమేంటీ
'మనల్నెవరు ఆపేద'నే బరితెగింపుతో దర్జాగా ఇసుక తవ్వి, తరలిస్తూనే ఉన్నారు. ఆయా రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలకు పర్యావరణ అనుమతులు ఉన్నాయంటూ గనుల శాఖ అధికారులు ఇప్పటిదాకా చెప్పిన మాటల్లో నిజం లేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రం మొత్తం మీద కేవలం 5 జిల్లాల్లో 41 రీచ్‌ల్లోనే ఇసుక తవ్వకాలకు వారం కిందట అనుమతులు వచ్చినట్లు తెలిసింది. అది కూడా యంత్రాలు ఉపయోగించకుండా కేవలం కూలీలతో ఇసుక తవ్వించేందుకు మాత్రమే అనుమతించారు. గనుల శాఖ ఈ వివరాలేవీ వెల్లడించకుండా వైసీపీ నేతలు యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేసేలా సహకరిస్తున్నట్లు తేటతెల్లమైంది.
అంతా జగన్నాటకం - ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రభుత్వం అవే పాత అబద్ధాలు!
ఇసుక తవ్వకాలపై ఇటీవల ఎన్జీటీ చెన్నై బెంచ్‌లో విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి పర్యావరణ ప్రభావ మదింపు సంస్థ-C.U ఎన్జీటీకి ఈ నెల 12న నివేదిక అందజేసింది. రాష్ట్రంలో 183 రీచ్‌ల్లో మనుషులతో ఇసుక తవ్వకాలకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని ఏపీ గనులశాఖ గత నవంబరు, డిసెంబరు నెలల్లో దరఖాస్తు చేసిందని ఇందులో 113 దరఖాస్తులను స్టేట్ లెవెల్ ఎక్స్‌పర్ట్ అప్రైజల్ కమిటీ పరిశీలించి, 11 దరఖాస్తులను తిరస్కరించిందని సీయూ నివేదికలో వెల్లడించింది.
జగన్ పాలనలో రైతులకు అష్టకష్టాలు- నగరిలో మంత్రి రోజా గ్రావెల్, ఇసుక దోపిడి వైఎస్ షర్మిల
57 రీచ్‌లకు సంబంధించి గనులశాఖ మరిన్ని వివరాలు సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపింది. 45 రీచ్‌ల్లో తవ్వకాలకు ఈసీలు ఇచ్చేలా సిఫార్సు చేసిందని వీటిని సీయూ సమీక్షించి 41 రీచ్‌ల్లో మనుషులతో తవ్వకాలకు ఈసీలు జారీచేసిందని వెల్లడించింది. ఇందులో పల్నాడు జిల్లాలో 6, గుంటూరులో 4, బాపట్లలో 1, కృష్ణాలో 8, ఎన్టీఆర్‌లో 15, అల్లూరి జిల్లాలో 7 రీచ్‌లు ఉన్నాయని సీయూ కార్యదర్శి నివేదికలో పేర్కొన్నారు. గతంలో ఇసుక తవ్వకాలకు గుత్తేదారు సంస్థ జేపీ సంస్థ పేరిట సీయూ పర్యావరణ అనుమతులు ఇచ్చింది. ఇపుడు కొత్తగా జారీ చేసిన ఈసీలన్నీ ఆయా జిల్లాల గనులశాఖ అధికారులైన డీడీ, ఏడీల పేరిటే ఇచ్చింది.
ఇసుక తవ్వకాలు ఇప్పుడు యంత్రాలతో సాగుతున్నా గనులశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. రేపు ఇదే అంశం మీద సంబంధిత అధికారులు ఎన్జీటీ ముందు నిలబడాల్సిన పరిస్థితి రానుంది. అలాగే 41 రీచ్‌లకు ఈసీలు జారీచేసినా, వాటికి ఇంకా సీఎఫ్‌ఈ, సీఎఫ్‌వోలను పీసీబీ రావాల్సి ఉంది. అయినప్పటికీ వైఎస్సార్సీపీ నేతలు ఇసుక తవ్వుకుంటున్నారు.
రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు వాస్తవమే: కేంద్రం