India Alliance Parties Fire on BJP and Jagan : విజయవాడలోని బాలోత్సవ్ భవన్లో ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలు, రాజకీయ, కార్మిక, రైతు ప్రజా సంఘాల ఐక్య వేదిక సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు. దేశ సంపదను బీజేపీ అదానీ, అంబానీలకు దోచిపెడుతోందని షర్మిలారెడ్డి ఆరోపించారు. ఏపీలో గంగవరం పోర్టు భూములు ధారాదత్తం చేసి తక్కువ ధరకే అదానికి కట్టబెట్టారన్నారు. విశాఖ స్టీల్ ను కూడా వారికే ఇచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రత్యేక హోదా ఏపీకి ఊపిరి లాంటిదని అభివర్ణించారు. 10 ఏళ్లుగా రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని విమర్శించారు. బీజేపీ చేసిన మోసానికి జగన్ మౌనం వహించారని మండిపడ్డారు. అందరినీ కలుపుకొని ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించిందని తెలిపారు. ప్రజా సంఘాల ఉద్యమాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని షర్మిలారెడ్డి స్పష్టం చేశారు.
ప్రధాని వ్యాఖ్యలు ఖండించిన షర్మిల- వైసీపీతో తెరచాటు స్నేహం నడిపింది ఎవరంటూ నిలదీత
బీజేపీ చేస్తున్న మోసాలను ప్రజలంతా గుర్తించాలి. ఎన్నికల సమయంలో హిజాబ్, రామమందిరం తదితర అంశాలను తెరపైకి తీసుకొస్తోంది. ఎన్నికల సమయంలో ప్రజలంతా ఆలోచించి బీజేపీని గద్దె దించాలి. ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్న చంద్రబాబు, జగన్ పార్టీలను ఓడించాలి. ప్రజా పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది. - వైఎస్ షర్మిలా రెడ్డి, పీసీసీ అధ్యక్షురాలు
అన్నా అని పిలిపించుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారు: షర్మిల
అక్షర క్రమంలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవంలో ఆఖరు స్థానంలో నిలుస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా చంద్రబాబు, జగన్ వ్యవహరించారని ఆయన విమర్శించారు. ప్రజాగళం సభలో పాల్గొన్న ప్రధాని మోదీ చంద్రబాబుకు ఓటు వేయాలని చెప్పలేదు, జగన్‌ను ఓడించాలనీ చెప్పలేదని అన్నారు. ప్రత్యేక హోదా గురించి, విశాఖ గురించి అమరావతి గురించి ఎక్కడా ప్రధాని చెప్పలేదని అన్నారు. కేవలం ఎలక్టోరల్ బాండ్స్‌లో మాత్రమే రాజకీయ పార్టీలు ముందున్నాయని శ్రీనివాసరావు అన్నారు.
సిద్దం సభలకు రూ 600 కోట్లు- ఉద్యోగాలు ఇవ్వలేకపోయి, ప్రజాధనాన్ని దోచేస్తున్నారు: షర్మిల
దేశ వ్యాప్తంగా ఎక్కడకు ప్రచారానికి వెళ్లినా 400 సీట్లు అని ప్రధాని మోదీ వ్యాఖ్యానిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. మైండ్ గేమ్ తో సార్వత్రిక ఎన్నికల్లో గెలవాలని ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. ఏపీలో జగన్, చంద్రబాబు మోదీకి భయపడే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తుంటే, ఏపీలో సీఐడీ ద్వారా భయాందోళనలు సృష్టిస్తున్నారన్నారు. ఏపీలో మీడియాకు రాష్ట్ర అంశాలు మినహా జాతీయ అంశాలు పట్టటం లేదని రామకృష్ణ అన్నారు.
తల్లిలాంటి రాష్ట్రానికి జగన్ వెన్నుపోటు - ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ పోరాడాలి : షర్మిల