ETV Bharat / politics

ఫ్యాన్​ ఇంట్లోనే ఉండాలి- సైకిల్ మాత్రమే ప్రజల్లో ఉండాలి : మాజీ మంత్రి గంటా - విశాఖలో సీఎం పర్యటన

Ganta Srinivasa Rao's comments : వైఎస్సార్సీపీలో ఒక్కో వికెట్ పడిపోతోందని టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కేశినేని నానికి టిక్కెట్ లేకపోవడం వల్లే రాజీనామా చేశారని తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు ఉత్తరాంధ్ర లో అయోమయంలో ఉన్నారని మంత్రి పేర్కొన్నారు.

ganta_comments_on_party_symbols
ganta_comments_on_party_symbols
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 22, 2024, 8:07 PM IST

Ganta Srinivasa Rao's comments : ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ప్రజల్లోనే ఉండాలి. గ్లాసు లో టీ తాగితే మళ్లీ శుభ్రం చేసుకుని తాగుతారు. జగన్ మూడు టీలు తాగితే మూడు గ్లాసులు సింక్ లో వదిలేస్తారా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. పార్టీ చీపురుపల్లి నుంచి పోటీ చేయమని కోరింది. నేను అన్నీ ఆలోచిస్తాను. క్యాడర్ తో పరిశీలిస్తున్నా అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం ఖాయమని తెలుగుదేశం నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. ఓటమి భయంతోనే జగన్ దొంగ ఓట్ల కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. చీపురుపల్లిలో పోటీ చేయాలన్న పార్టీ ప్రతిపాదనపై ఆలోచిస్తున్నట్లు గంటా వెల్లడించారు.

టీడీపీ - జనసేన మేనిఫెస్టోలో స్టీల్​ప్లాంట్ అంశాన్ని చేర్చుతాం: గంటా శ్రీనివాసరావు

విశాఖలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు గంటా శ్రీనివాసరావు. నారా లోకేశ్ శంఖారావం కార్యక్రమం విజయవంతమైందని, విజయవంతం చేసిన టీడీపీ- జనసేన శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్సీపీలో ఒక్కో వికెట్ పడిపోతోందని, వైఎస్సార్సీపీ (YSRCP)లో కీలక వ్యక్తి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారని గుర్తు చేశారు. టీడీపీకి కేశినేని (KESINENI)నాని రాజీనామా చేశారు అంటే అక్కడ వారికి టికెట్ లేదని తెలిసి రాజీనామా చేశారని అన్నారు. వైఎస్సార్సీపీ నేతలు ఉత్తరాంధ్ర లో అయోమయంలో ఉన్నారని తెలిపారు. రాప్తాడు లో జరిగిన సభలో పత్రిక ఫొటోగ్రాఫర్​పై దాడి హేయమైన చర్య అని గంటా తీవ్రంగా ఖండించారు.

వైఎస్సార్​సీపీని బంగాళాఖాతంలో కలిపేందుకు అన్ని వర్గాలు సిద్ధం : గంటా

విశాఖ లో సీఎం పర్యటన అంటే ప్రజలు భయపడుతున్నారని, దుకాణదారులు అల్లాడిపోతున్నారని తెలిపారు. మెగా డీఎస్సీ అని దగా డీఎస్సీ ప్రకటించిన ప్రభుత్వం, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు. తెలంగాణలో 12 వేల పోస్టులతో డీఎస్సీ (DSC Notification) ప్రకటించనున్నారని, కానీ, ఏపీలో ఐదేళ్లు కూడా డీఎస్సీ ఊసే ఎత్తలేదని గంటా మండిపడ్డారు. తీరా ఎన్నికల సమయంలో ఓటమి భయంతో ఆర్భాటంగా ప్రకటించారని విమర్శించారు. ఎస్​జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థుల అర్హత విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు.

జగన్మోహన్ రెడ్డి మద్యం షాపుల్లో నగదు మాత్రమే- నో డిజిటల్ పేమెంట్స్: గంటా

వైసీపీ అభ్యర్థులు, ఆశావహులంతా క్యారం బోర్డులో కాయిన్స్ మాదిరిగా చెల్లాచెదురయ్యారని, స్ట్రైకింగ్ కొట్టినట్లుగా వెళ్లగొట్టారని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు టీడీపీ - జనసేన కూటమి అభ్యర్థులను ప్రకటించలేదని చెప్తూ మరో వారం రోజుల్లో స్పష్టంత వచ్చే అవకాశం ఉందని గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఏది చేసైనా గెలవాలన్నదే వైఎస్సార్సీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. ఉత్తరాంధ్రకు చెందిన ఓ సీనియర్ మంత్రి వైసీపీకి ఓటు వేయని వారి పథకాలు నిలిపేస్తామని హెచ్చరించడం అధికార పార్టీ పతనానికి పరాకాష్టగా నిలుస్తోంది.

ఎన్నికల్లో అక్రమంగా గెలిచేందుకు వైఎస్సార్సీపీ కుట్రలు: గంటా శ్రీనివాసరావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.