ETV Bharat / politics

ఎన్నికల వేళ వైసీపీకి మరో షాక్​ - రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే - Former MLA Resigned YSRCP

Former MLA Amanchi Krishnamohan Resigned YSRCP: వైసీపీ సభ్యత్వానికి ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ రాజీనామా చేశారు. ఈ నెల 9న ప్రజల సమక్షంలో భవిష్యత్‌  కార్యాచరణ, రాజకీయ ప్రణాళిక ప్రకటిస్తానని ఆమంచి స్పష్టం చేశారు.

resigned_ysrcp
resigned_ysrcp
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 4, 2024, 5:49 PM IST

Former MLA Amanchi Krishnamohan Resigned to YSRCP: వైసీపీ సభ్యత్వానికి ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ రాజీనామా చేశారు. ఈ నెల 9న ప్రజల సమక్షంలో భవిష్యత్‌ కార్యాచరణ, రాజకీయ ప్రణాళిక ప్రకటిస్తానని ఆమంచి స్పష్టం చేశారు.

Amanchi Dissent to YSRCP Party : గత కొద్ది రోజులుగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అనుచరులతో సమావేశాలు నిర్వహించారు. స్థానికులకు టికెట్ ఇవ్వకుండా ఎక్కడ నుంచో వచ్చిన వారికి టికెట్ ఇవ్వడమేంటని నేతలు అభిప్రాయపడ్డారు. కరణం వెంకటష్​కు కాకుండా స్థానికుడైన ఆమంచికే టికెట్ ఇవ్వాలనే డిమాండ్‌ను నేతలు తెరపైకి తెచ్చారు. ఇటీవల ఆమంచిని పర్చూరు నుంచి కూడా తప్పించడంతో సోమవారం రాత్రి తన అనుచరులతో సమావేశం నిర్వహించారు. మరో రెండ్రోజుల్లో తన కార్యాచరణను వెల్లడిస్తానని అనుచరులతో చెప్పినట్లు సమాచారం.

ఇప్పటికే కరణం, ఆమంచి వర్గాల మధ్య కొంతకాలంగా పోరు జరుగుతుంది. 2019 ఎన్నికల్లో చీరాలలో వైఎస్సార్సీపీ తరపున పోటీ చేసిన ఆమంచి, టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి చేతిలో ఓడిపోయారు. అనంతరం బలరాం వైఎస్సార్సీపీ (YSRCP) పంచన చేరారు. చీరాల టికెట్ కోసం ఆమంచి చేసిన ప్రయత్నాలూ విఫలమయ్యాయి. ఇటీవల ఆమంచిని పర్చూరు నుంచి కూడా తప్పించారు. దీంతో ఆయన చీరాలలోనే ఉంటూ టికెట్ తనకే ఇవ్వాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.