ETV Bharat / politics

స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు - కూటమి అభ్యర్థుల్లో ఆందోళన - ap elections Final candidates List

Final candidates List in Krishana District: రాష్ట్రంలో ఎన్నికల ఉపసంహరణ గడువు పూర్తవటంతో పోటీపడే అభ్యర్థుల లెక్క తేలింది. మరోవైపు ఎన్నికల గుర్తుల కేటాయింపులో కొంత గందరగోళంతో నెలకొనటంతో కూటమి అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

Final_Candidates_List_in_Krishana_District

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 30, 2024, 2:07 PM IST

Final candidates List in Krishana District: రాష్ట్ర ఎన్నికల్లో మరో కీలక ఘట్టం పూర్తయింది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. దీంతో బుజ్జగింపులకు తెరపడగా కొందరు బరి నుంచి వైదొలిగారు. బరిలో ఉన్న తుది అభ్యర్థుల జాబితాను ఈసీ వెల్లడించగా పోటీపడే అభ్యర్థుల లెక్క తేలింది. దీంతో ప్రచార పర్వానికి తెరలేచింది. మరోవైపు ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుల్లోనూ కొంత గందరగోళం నెలకొంది.

జనసేన గుర్తు గాజుగ్లాసును స్వతంత్రులకు కేటాయించడంతో కూటమి అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. కొన్ని ప్రాంతాల్లో గాజుగ్లాసును పోలిన పెన్‌స్టాండ్‌ను కేటాయించడంపై జనసేన అభ్యంతరం తెలుపుతోంది. గుర్తింపు లేని ప్రాంతీయ పార్టీలకు, స్వతంత్రులకు గాజుగ్లాసు కేటాయించారు. జనసేన అభ్యర్థులకూ ఇదే గుర్తు కేటాయించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానంగా ఎన్టీఏ కూటమి, అధికార వైఎస్సార్సీపీ మధ్య పోటీ నెలకొంది. కొన్ని నియోజకవర్గాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు రంగంలో ఉన్నారు.

ఆద్యంతం ఆసక్తికరం: విజయవాడ సెంట్రల్‌లో ఎక్కువగా 20మంది, అత్యల్పంగా 9మంది నందిగామలో పోటీ పడుతున్నారు. 14 మంది కంటే ఎక్కువ మంది ఉంటే రెండు వీవీప్యాట్‌లు ఏర్పాటు చేస్తారు. ఒక వీవీప్యాట్‌లో మొత్తం 15 బటన్‌లు ఉంటాయి. 14 మంది అభ్యర్థులు ఒక నోటా బటన్‌ ఉంటుంది. సెంట్రల్‌లో నోటాతో కలిపి 21 బటన్‌లు వీవీప్యాట్‌లో ఉంచాలి. ఒకదానిలో 15 మంది, మరో దానిలో అయిదుగురు అభ్యర్థులు, చివరిన నోటా బటన్‌ ఏర్పాటు చేస్తారు.

విజయవాడ లోక్‌సభ పరిధిలో 17మంది ఉన్నందున ఇక్కడ రెండు వీవీప్యాట్‌లు పెట్టాలి. విజయవాడ మధ్య, పశ్చిమకూ రెండేసి వీవీప్యాట్‌లు ఏర్పాటు చేయాలి. ఎన్టీఆర్‌ జిల్లాలో మొత్తం ఓటర్లు 17,04,077. మచిలీపట్నం పార్లమెంటుకు అత్యధికంగా 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పార్లమెంటుకు రెండు వీవీప్యాట్‌లు వినియోగించాలి. కృష్ణా జిల్లాలో 15.39 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

నువ్వా నేనా!: విజయవాడ లోక్‌సభ పరిధిలో నువ్వానేనా అన్నట్లు పోటీ ఉంది. తాజా ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేస్తుండగా ఆయన సోదరుడు కేశినేని శివనాథ్‌(చిన్ని) టీడీపీ కూటమి నుంచి బరిలో నిలవడంతో పోరు ఆసక్తికరంగా మారింది. ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇండియా కూటమి అభ్యర్థి భార్గవ్‌ కూడా వీరి బంధువే కావడం మరింత ఆసక్తికరం. విజయవాడ లోక్‌సభలో గత రెండు పర్యాయాలు టీడీపీ జెండా ఎగరేసింది. ప్రస్తుతం టీడీపీ నుంచి జంప్‌ అయిన కేశినేని నాని వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ అభ్యర్థులతో సమన్వయం లోపం ఉన్నట్లు వైఎస్సార్సీపీ వర్గాలే పేర్కొంటున్నాయి.

ఇదేంది గురూ: ఎన్డీఏ కూటమి భాగస్వామిగా ఉన్న జనసేనకు గాజుగ్లాసు గుర్తు కేటాయించిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం ఈ గుర్తును జనసేన పోటీలో లేని ప్రాంతాల్లో ఇతర వ్యక్తులకు కేటాయించింది. దీంతో కొంత గందరగోళం తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో బందరు ఎంపీ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తున్నారు. ఆయనకు గాజు గ్లాసు గుర్తు వచ్చింది. పార్లమెంటుకు పోటీపడే వారికి ఇతరులకు ఈ గుర్తు కేటాయించరు. కానీ పెన్నుస్టాండు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తమవుతోంది.

అవనిగడ్డ నుంచి జనసేన అభ్యర్థిగా మండలి బుద్ధప్రసాద్‌ రంగంలో ఉన్నారు. బందరు అసెంబ్లీ సెగ్మెంటులో చింతపల్లి మనోహర్‌కు, పామర్రులో ఎం.రాజమనోహర్‌, గన్నవరంలో వల్లభనేని వంశీకృష్ణకు గాజుగ్లాసు కేటాయించారు. పెడన, గుడివాడ, పెనమలూరుల్లో ఎవరికీ గాజుగ్లాసు కేటాయించలేదు. విజయవాడ పార్లమెంటులో వై.కృష్ణకిశోర్‌ అనే స్వతంత్ర అభ్యర్థికి గాజుగ్లాసు కేటాయించారు. విజయవాడ తూర్పు నుంచి కూనపరెడ్డి దశరథ్‌, సెంట్రల్‌లో గొల్లపల్లి ఫణిరాజ్‌, మైలవరంలో వల్లభనేని నాగపవన్‌కుమార్‌, జగ్గయ్యపేటలో బేరోతుల ప్రకాశరావులకు గాజుగ్లాసు గుర్తు కేటాయించారు. నందిగామ, తిరువూరు, విజయవాడ పశ్చిమలో ఎవరికీ కేటాయించలేదు.

జగన్‌ పాలన విభజన కంటే రెట్టింపు బాధ - ప్రభుత్వ వ్యతిరేకతలో ఫ్యాన్‌ కనుమరుగు: చంద్రబాబు - Chandrababu Naidu Interview

విజయవాడ పరిధిలో బరిలో ఉన్న తుది అభ్యర్థులు:

విజయవాడ లోక్​సభ నియోజకవర్గంలో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య: 17

విజయవాడ మధ్య అసెంబ్లీ నియోజకవర్గంలో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య: 20

విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య: 15

విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య: 15

జగ్గయ్య పేట అసెంబ్లీ నియోజకవర్గంలో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య: 13

తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య: 12

మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య: 12

నందిగామ అసెంబ్లీ నియోజకవర్గంలో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య: 9

మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో బరిలో ఉన్న తుది అభ్యర్థులు:

మచిలీపట్నం లోక్​సభ నియోజకవర్గంలో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య: 15

బందరు అసెంబ్లీ నియోజకవర్గంలో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య: 14

గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య: 12

అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గంలో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య: 12

గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య: 12

పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య: 11

పెడన అసెంబ్లీ నియోజకవర్గంలో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య: 10

పామర్రు అసెంబ్లీ నియోజకవర్గంలో బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య: 08

స్వార్థం కోసం జగనే కన్నతండ్రి పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్పించారు: వైఎస్‌ షర్మిల - YS Sharmila election campaign

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.