Minister Nara Lokesh Praja Darba to Address People Grievances : ఉండవల్లిలోని తన నివాసంలో 17వ రోజు నారా లోకేశ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. సెంటు పట్టా కోసం సేకరించిన తమ భూములకు వచ్చే ప్రభుత్వ పరిహారాన్ని మాజీ మంత్రి ఆళ్ల నాని అందకుండా చేశారని మంత్రి నారా లోకేశ్ వద్ద బాధితులు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ మిని గురుకులాల్లో పని చేస్తున్న బోధన, బోధనేతర ఉద్యోగులకు టైం స్కేల్ వర్తింపజేయాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు. గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఎంటీబీ (MTB), ఎమ్ఎల్ (MLE) ఈలకు ఉద్యోగ భద్రత, కనీసం వేతనం కల్పించాలని ఆదివాసీ మాతృభాష ఉపాధ్యాయ సంఘం మంత్రిని విజ్ఞప్తి చేశారు. ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పోరేషన్లో పని చేస్తున్న ఐటీ మేనేజర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, ఏఈలు, డీఈవోవోలు, ఆఫీసు సబార్డినేట్స్‌కు కాంట్రాక్ట్ పద్ధతి వర్తింపజేయాలని కోరారుతూ ఉద్యోగులు వినతులు అందజేశారు.
Minister Nara Lokesh Praja Darbar 17th Day : గ్రామ సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్‌గా పని చేస్తున్న తమకు విపరీతమైన పనిభారం పెరిగి ఇబ్బందులు పడుతున్నామని, తగిన న్యాయం చేయాలని సెక్రటేరియట్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రతి నిధులు కోరారు. మంగళగిరి నియోజకవర్గం నుంచీ వ్యక్తిగత సమస్యలతో లోకేశ్‌ను ప్రజలు పెద్ద ఎత్తున కలిశారు. నియోజకవర్గంలో తాగునీరు, డ్రైనేజీ, ఫించన్లు, రేషన్ కార్డుల తొలగింపు, అనారోగ్య సమస్యలను స్థానికులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందరి నుంచి స్వయంగా వినతులు తీసుకుని, సమస్యలు విన్న మంత్రి లోకేశ్ అన్నింటినీ పరిశీలించి ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
ప్రజా దర్బార్ వేదికగా ఇప్పటికే అనేక సమస్యలను పరిష్కరించగా మంచి ప్రజాదరణ పొందుతుంది. ఏళ్ల తరబడిగా బాధపడుతున్న వారికి తక్షణం సహాయం అందించి జనాదరణ పొందుతున్నారు. ఇన్నేళ్లు వైఎస్సార్సీపీ నాయకులకు భయపడి నలిగిపోయిన ప్రజలు, కూటమి విజయంతో తమకు జరిగిన అన్యాయాలను బయటపెడుతున్నారు. ఈ నేపథ్యం గత ప్రభుత్వ కీలక నేతల అరాచకాలు వెలుగు చూస్తున్నాయి.
'ప్రజాదర్బార్' అనూహ్య స్పందన - సమస్యల పరిష్కారానికి లోకేశ్ భరోసా - Nara Lokesh Praja Darbar