Jagan Tadepalli Palace Open : అధికారంలో ఉండగా ఆయన ఎక్కడికైనా వెళ్తున్నారంటే ముందుగానే రోడ్లపై పరదాలు కట్టేవారు. ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ఆంక్షలు విధించేవారు. ఇక ఆయణ్ని కలవాలంటే పార్టీ నేతలు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు కళ్లు కాయలు కాచేలా వేచి చూడాల్సిన పరిస్థితి వచ్చేది. వారి నివాసం వైపు వెళ్లేందుకు ఆంక్షలు ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అధికారం కోల్పోవడంతో ఆ బంగ్లా తలుపులు తెరుచుకున్నాయి. ఇది చూసి శ్రేణులు, జనాన్ని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ నాయకుడు ఎవరో అన్నది ఆయనేనండి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి.
Jagan Meet YSRCP Leaders : అధికారంలో ఉండగా ఐదేళ్ల పాటు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను, జనాన్ని తాడేపల్లి ప్యాలెస్ గేటు లోపలికి రానివ్వకుండా వైఎస్ జగన్ పక్కన పెట్టారు. కానీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో ఎట్టకేలకు ఆయన మెట్టు దిగారు. తన బంగ్లా తలుపులు తెరిచి కార్యకర్తలను కలిసేందుకు అవకాశం కల్పించారు. దీంతో పార్టీ శ్రేణులు, కొందరు ప్రజలు మాజీ సీఎంను కలిసేందుకు క్యాంప్ ఆఫీస్‌కు తరలివచ్చారు. వచ్చిన వారందరినీ పలకరించిన జగన్ వారితో ఫొటోలూ దిగారు.
మార్పును చూసి ఆశ్చర్యపోయిన కార్యకర్తలు : కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో జగన్ మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడవద్దని పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వివరించారు. ఘోర ఓటమి తర్వాత ఆయనలో వచ్చిన మార్పును చూసి పలువురు పార్టీ శ్రేణులు, ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
పార్టీ ఆవిర్భావం నుంచీ జెండా మోసిన తమకు కనీస గౌరవం ఇవ్వలేదని, ఓడిపోగానే తాము గుర్తుకొచ్చామా అని కొందరు చర్చించుకుంటున్నారు. గతంలో జగన్ తమ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఆయన కలుద్దామనుకున్నా పరదాలు కట్టేవారని చెబుతున్నారు. దీంతో అప్పుడు ఆయణ్ని కలిసే అవకాశం రాలేదని పేర్కొంటున్నారు. కానీ ఎన్నికల్లో పరాభవంతో జగన్‌లో ఎట్టకేలకు మార్పు వచ్చినట్లుందని అనుకుంటున్నారు. దీంతో తాడేపల్లి ప్యాలెస్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.
జనం జడుసుకోవడాలు - వ్యాపారుల బెంబేలు, చెట్ల వణుకులు ఇక ఉండవులే! - YS Jagan Visit Pulivendula
హిమాలయాలకు మాజీ సీఎం జగన్ - వైఎస్సార్సీపీ నేతలతో కీలక వ్యాఖ్యలు - YS jagan interesting comments