Election Officials Stopped MLA Rachamallu Siva Prasad Reddy Campaign : సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రచారం మొదలుకొని పోలింగ్ తేదీ వరకు పార్టీలు, నేతలు ఈ నియామవళికి లోబడి వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ వైఎస్సార్సీపీ నేతల తీరు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమలు అయినట్లుగా కనిపించడం లేదు. కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో వైఎస్సార్సీపీ జెండాలు, నేతల ఫ్లెక్సీలు అలానే దర్శనమిస్తున్నాయి. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు బహుమతులు పంపీణీ చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ మొట్టికాయలు వేసి విచారణ జరిపించాలని చెప్పిన మరుసటి రోజే అనుమతి లేకుండా ప్రచారానికి వెళ్లడంతో అధికారులు అడ్డుకున్నారు.
Rachamallu Siva Prasad Reddy Violation of Election Code : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోనీ 38వ వార్డులో అనుమతి లేకుండా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రచారం నిర్వహించారు. ఉదయం వార్డులో ఆ పార్టీ నాయకులతో కలిసి ఆయన ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. దీంతో ఎన్నికల అధికారుల బృందం అక్కడికి చేరుకొని ప్రచారానికి అనుమతి లేదని నిలిపివేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారం చేయాలంటే సువిధ యాప్లో అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అనుమతి తీసుకున్న తర్వాతే ప్రచారం చేయాలని చెప్పడంతో ప్రచారాన్ని నిలిపివేసిన రాచమల్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వైఎస్సార్సీపీ నేతలు - కేసు నమోదు
నా తప్పు లేదు : ఎన్నికల నియమావళిని తాను పాటిస్తానని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. సువిధ యాప్లో ఎన్నికల ప్రచారానికి అనుమతి తీసుకునేందుకు తాము ప్రయత్నం చేశామని తెలిపారు. అయితే ఆ యాప్ పని చేయడం లేదని ఆరోపించారు. అనుమతి లేకపోవడంతో ప్రచారం నిలిపివేయాలని ఎన్నికల అధికారుల బృందం కోరడంతో తాను ప్రచారాన్ని నిలిపి వేశానని స్పష్టం చేశారు.
"సువిధ యాప్లో ఎన్నికల ప్రచారానికి అనుమతి తీసుకునేందుకు రాత్రి ప్రయత్నం చేశాను. కానీ యాప్ ఓపెన్ కాలేదు. తప్పు వారిపై ఉన్న ప్రచారం ఆపమంటే ఆపేశాను."- రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే
Violation of Election Code In Proddatur : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన ఇద్దరు వ్యక్తులపై రెండో పట్టణ ఠాణాలో కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. ఆదివారం ప్రొద్దుటూరులో నిర్వహించిన నూర్ బాషా దూదేకుల సంఘం ఆత్మీయ సమావేశానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, నాయకులు హాజరు అయ్యారు. చీరలు పంపిణీ చేస్తామని చెప్పడంతో మహిళలను భారీ ఎత్తున సభకు తరలించారు. చీరల పంపణీ కోసం మహిళలకు టోకెన్లు సైతం అందించారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘన - వీఆర్వోను సస్పెండ్ చేసిన ఈసీ
ఈ ఘటనపై ఈటీవీ భారత్ - ఈనాడు, ఈటీవీలో వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ విజయరామరాజు విచారణకు ఆదేశించారు. ఎలాంటి అనుమతులు లేకుండా సమావేశం ఏర్పాటు చేయడం, ఎన్నికల కోడ్‌ను ఉల్లగించి చీరెల పంపిణీ కార్యక్రమం నిర్వహించిన పగిడాల దస్తగిరి, నాగూర్ అనే వ్యక్తులపై పురపాలిక కమిషనర్, ఆర్‌వోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఇద్దరిపై ప్రొద్దుటూరు రెండో పట్టణ ఠాణాలో కేసు నమోదు చేసినట్లు కలెక్టర్ విజయరామరాజు ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎన్నికల కోడ్‌ను పటిష్ఠగా అమలు చేయాలని ఓ వైపు ఎస్ఈఓ మొర పెట్టుకుంటున్నా వైఎస్సార్సీపీ నేతలు మాత్రం తమ నిబంధనలు వేరే ఉంటాయిలే అన్నట్లు వ్వహరిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నిబంధనలను పాటించకపోగా ఓటర్లను యథేచ్ఛగా ప్రలోభాలకు గురి చేస్తున్నారని అన్నారు.
వాలంటీర్ల అత్యుత్సాహాం- వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లు