ETV Bharat / politics

హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్​ - 'ఆ ఎమ్మెల్యే'ను అదుపులోకి తీసుకోవాలని ఆదేశం - MLA house arrest - MLA HOUSE ARREST

MLA house arrest : పోలింగ్​ వేళ హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహించింది. తెనాలిలో ఓటరుపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే అన్నాబత్తిని శివకుమార్​ను అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది. పోలింగ్​ ముగిసే వరకూ గృహ నిర్బంధం విధించింది.

EC_Action_against_mla
EC_Action_against_mla (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 13, 2024, 3:42 PM IST

Updated : May 13, 2024, 4:20 PM IST

MLA House Arrest : రాష్ట్రంలో పోలింగ్ భారీగా నమోదవుతుండగా మరో వైపు అధికార పార్టీ అరాచకాలు పెరిగిపోయాయి. దాడులకు తెగబడుతూ రక్తపాతం సృష్టిస్తున్నాయి. టీడీపీ నేతల వాహనాలను ధ్వంసం చేయడంతో పాటు పోలింగ్​ ఏజెంట్లుగా వెళ్లిన వారిని తీవ్రంగా గాయపరిచారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తెనాలిలో ఓటరుపై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే శివకుమార్​పై చర్యలు చేపట్టింది.

గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌పై ఎన్నికల సంఘం ఆగ్రహించింది. శివకుమార్‌ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించిన ఈసీ పోలింగ్ పూర్తయ్యే వరకూ శివకుమార్‍ను గృహ నిర్భంధంలో ఉంచాలని స్పష్టం చేసింది. నియోజకవర్గంలోని ఓ ఓటరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శివకుమార్ దాడి చేసిన నేపథ్యంలో ఈసీ చర్యలకు ఉపక్రమించింది. నియోజకవర్గంలోని ఐతనగర్‌ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేయడానికి వెళ్లిన ఎమ్మెల్యే క్యూ పద్ధతి పాటించకుండా నేరుగా లోపలికి వెళ్లేందుకు యత్నించారు. దీంతో క్యూలైన్​ లో రావాలంటూ అభ్యంతరం చెప్పిన ఓటర్​ను ఆయన చెంపదెబ్బ కొట్టారు. ఓటరు కూడా ఎమ్మెల్యే శివకుమార్‌ చెంప చెళ్లుమనిపించడంతో ఎమ్మెల్యే అనుచరమూక విచక్షణారహితంగా పిడిగుద్దులు కురిపించింది. జరిగిన ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన స్పెషల్ పోలీస్ అబ్జర్వర్ మిశ్రా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐతానగర్ పోలింగ్ బూత్ వద్ద పరిస్థితిని తెలుసుకున్న దీపక్ మిశ్రా సీసీ ఫుటేజ్‌ను తెప్పించుకుని పరిశీలించినట్లు సమాచారం. హింసాత్మక ఘటనలు జరిగిన మరో 5 ప్రాంతాల్లోని పరిస్థితిపైనా కోరిన మిశ్రా పోలింగ్ సరళిని కమాండ్ కంట్రోల్ రూమ్‌ నుంచి పర్యవేక్షించారు.

అంతకంతకూ పెరుగుతున్న పోలింగ్ - మధ్యాహ్నం 1 గంట వరకు 40.26 శాతం - POLL PERCENTAGE

శాంతిభద్రతలు కాపాడలేకపోయారు - హింసాత్మక ఘటనలపై చంద్రబాబు ఆగ్రహం - Chandrababu on Clashes in Palnadu

పోలింగ్‌ రోజున అధికార పార్టీ ఆగడాలు పెరిగిపోయాయని, రాష్ట్ర వ్యాప్తంగా హింస బాగా మితిమీరిపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పోలీసులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. తాడిపత్రిలో ఏకంగా ఎస్పీ వాహనంపైనే దాడి చేశారని, టీడీపీ అభ్యర్థిపైనే దాడికి దిగడం హింసా రాజకీయాలకు పరాకాష్ఠగా చంద్రబాబు అభివర్ణించారు. ప్రజలంతా నిర్భయంగా తరలివచ్చి ఓటు వేయాలని, అత్యధిక ఓటు శాతంతో హింసా రాజకీయాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు.

ఓటు వేయాలన్నా డోలీ మోతలే - 'ఎన్నికలను బహిష్కరించిన గ్రామస్థులు' - Voters Problems

Last Updated : May 13, 2024, 4:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.