Lokesh on Chair Folding Dialog : ఎన్నికల్లో నేతల ప్రసంగం అతి కీలకమైన అంశం. ఉర్రూతలూగించే ప్రసంగం నాయకుడికి చక్కని భవిష్యత్ ఇవ్వడంతో పాటు పార్టీని కూడా బలోపేతం చేస్తుంది. శ్రేణులకు ఉత్సాహాన్నిస్తుంది. ఎన్నికల్లో ఓట్ల శాతం పెంచుతుంది. చివరికి అదే ప్రసంగం జయాపజయాలను కూడా నిర్దేశిస్తుంది. ఈ నేపథ్యంలో కొంత మంది నాయకులు తమదైన శైలిలో ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటారు. ఈ క్రమంలో వారు చెప్పే పిట్ట కథలు, డైలాగులు అత్యంత వేగంగా జనంలోకి వెళ్తుంటాయి.
ప్రస్తుతం ఏపీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఓ వైపు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila Reddy) రచ్చబండ కార్యక్రమం ద్వారా దూకుడు పెంచారు. సీఎం జగన్ రెడ్డి నాయకత్వం, ప్రభుత్వ వైఫల్యంపై ఆమె చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరో వైపు జగన్ కూడా జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడూ నా అక్కచెల్లెమ్మలు అంటూ ప్రసంగించే జగన్ ప్రస్తుతం ఆ డైలాగ్ మర్చిపోతున్నారు. డైలాగ్ పాతదై పోయిందో లేక అంగన్వాడీలు, ఆశ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు ఇటీవల సమ్మె చేపట్టి నేరుగా జగన్‌ను విమర్శించిన నేపథ్యంలో జగన్ మాట మార్చారు. ఇక తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేశ్ తమ ప్రసంగంలో జగన్ లక్ష్యంగా విసురుతున్న సవాళ్లు ఇటు టీడీపీ కార్యకర్తలతో పాటు సాధారణ పౌరుల్లోనూ ఉత్సాహం నింపుతున్నాయి. ఎన్నికల్లో డైలాగ్ వార్ హాట్ టాపిక్‌గా మారింది.
జగన్ చొక్కా మడత పెడితే - ప్రజలు కుర్చీ మడత పెట్టి !: చంద్రబాబు
కుర్చీలు మడతపెడితే జగన్ కుర్చీ ఖాళీ : వైఎస్సార్సీపీ నేతలు (YSRCP Leaders) చొక్కాలు మడతపెడితే పసుపు సైన్యం, జనసైనికులు చూస్తూ ఊరుకోరని, వారు కుర్చీలు మడతపెడితే జగన్ కుర్చీ ఖాళీ అవుతుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. రాజధాని ఫైల్స్ సినిమా అన్నా, రైతుల్ని చూసినా జగన్‌కు భయం పట్టుకుందని, అందుకే సినిమా విడుదల కాకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.
మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానని చెప్పిన జగన్ ప్రభుత్వ అధికారులకే టార్గెట్లు విధించి ప్రజల్ని తాగుబోతుల్ని చేస్తున్నారని ఆరోపించారు. జగన్ పాలనలో ప్రజలు పన్నుల భారంతో అల్లాడుతున్నారన్న లోకేశ్ (Lokesh), తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం రాగానే సంక్షేమ రాజ్యం అందిస్తామని నెల్లిమర్ల శంఖారావం సభలో ప్రకటించారు.
ఎన్నికల వేళ 'బొమ్మ' చూపిస్తోన్న జగన్ సర్కార్
గుంటూరు కారంలోని "కుర్చీ మడత పెట్టి" అంటూ సాంగ్ మాస్ సాంగ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఇప్పుడు ఈ మడతపెట్టే మాట రాష్ట్ర రాజకీయాల్లో వినిపించడం ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) చొక్కా మడతపెట్టాల్సిన సమయం వచ్చిందంటే, జనం మీ కుర్చీనే మడతపెట్టేస్తారంటూ చంద్రబాబు, లోకేశ్ గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఉమ్మడి రాజధానికి మరో రెండేళ్లంటే- ఇన్నాళ్లు గుడ్డి గుర్రానికి పళ్లు తోమినట్లా?: వైఎస్ షర్మిల