ETV Bharat / politics

ఆ ముగ్గురు కలసి నన్ను ఇబ్బంది పెట్టారు- కడప ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు - Dastagiri Complaint on Jagan - DASTAGIRI COMPLAINT ON JAGAN

Former Minister Viveka Murder Case Approver Dastagiri: ఐదు సంవత్సారాల పాటు ఆ ముగ్గురు కలసి తనను హింసించారని వివేకా హత్య కేసు అప్రూవర్‌ దస్తగిరి కడప ఎస్పీకి ఫిర్యాదుచేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌, భారతి, ఎంపీ అవినాష్‌రెడ్డి లు తనను ఏదో విధంగా నిరంతరం ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. నాటి ఘటనలపై విచారణ చేయాలని దస్తగిరి పేర్కొన్నారు.

Former Minister Viveka Murder Case Approver Dastagiri
Former Minister Viveka Murder Case Approver Dastagiri (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2024, 4:06 PM IST

Updated : Aug 27, 2024, 5:31 PM IST

Former Minister Viveka Murder Case Approver Dastagiri : ఐదు సంవత్సరాల పాటు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి, ఎంపీ అవినాష్‌రెడ్డి తనను తీవ్ర ఇబ్బందులు గురి చేశారని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌ మారిన దస్తగిరి ఆరోపించారు. ఈ మేరకు కడపలో జిల్లా ఎస్పీ హర్షవర్దన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. గత ఏడాది నవంబర్​లో తాను కడప జైల్లో ఉన్న సమయంలో జైలు అధికారులు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి ప్రలోభ పేట్టిన అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని ఎస్పీని కోరారు.

సీసీ టీవీ ఫుటేజ్​ను జైలు అధికారులు ఎందుకు తొలగించారు? : గత ఏడాది నవంబర్ 28న వైద్య శిబిరం పేరుతో జైలులోకి వచ్చిన చైతన్య రెడ్డి తనను బెదిరించి రాజీకి రావాలని డబ్బు ఆఫర్ చేశాడని తెలిపారు. ఆయన మాట వినకపోవడంతో కడప జైలు సూపరింటెండెంట్‌ ప్రకాశ్‌ తనను వారం రోజుల పాటు ఓ గదిలో వేసి నిర్బంధించి హింసించారని ఆరోపించారు. ఆ సమయంలో ఓ కేసులో అరెస్ట్ అయిన తెలుగుదేశం నేత బీటెక్ రవి కూడా తన పక్క బ్యారెకులోనే ఉన్నాడని, ఆయన్ని కూడా సాక్ష్యంగా విచారించాలని దస్తగిరి డిమాండ్ చేశారు. గత ఏడాది నవంబర్ 28 నాటి జైలులో సీసీ టీవీ ఫుటేజ్​ను జైలు అధికారులు ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదన్న దస్తగిరి.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోనైనా తనకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

హోం మంత్రి అనితతో వైఎస్ సునీత భేటీ - వివేకా హత్యపై వివరణ - YS Sunitha Met Home Minister Anitha

తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే : దస్తగిరి కడప ఎస్పీ హర్షవర్దన్‌ను కలిసి ఫిర్యాదు చేసిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ కడప జైల్లో జరిగిన అంశంపై జిల్లా ఎస్పీ, సీబీఐ దృష్టికి తీసుకెళ్తున్నట్లు వివరించారు. భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి తనని ఇబ్బందులకు గురి చేశారని అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో పోలీసులు కట్టు బానిసలుగా పని చేశారని ఆరోపించారు. జైల్లో అధికారులు తనని హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు.

కీలక పరిణామం- వివేకా హత్యకేసులో దస్తగిరి సాక్షి మాత్రమే: సీబీఐ కోర్టు - CBI Court on Viveka Murder Case

వైఎస్సార్సీపీ నేతలకు కడప జైలు సూపరింటెండెంట్‌ ప్రకాశ్‌ తొత్తుగా మారాడని, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి తనను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. వివేకా హత్య కేసులో రాజీ కావాలని డబ్బు ఆశ చూపారని తెలిపారు. చైతన్యరెడ్డి మాట వినకపోవడంతో జైల్లో నన్ను హింసించారని, తనను జైల్లో ఉన్న సమయంలో సీసీ ఫుటేజీని తొలగించారని తెలిపారు. నాటి ఘటనలపై విచారణ చేయాలని కోరుతున్నానని, తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందేనని దస్తగిరి అన్నారు.

'హూ కిల్డ్ బాబాయ్​'కి త్వరలోనే సమాధానం వస్తుంది: చంద్రబాబు - Who Killed Babai

Last Updated : Aug 27, 2024, 5:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.