ETV Bharat / politics

వైసీపీలో ఆగని ఇన్​ఛార్జీల మార్పు - సీఎంవోకు క్యూ కడుతున్న నేతలు - Changes in YCP incharges

CM Jagan Met With YSRCP Leaders: ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో సీఎం జగన్ నుంచి పిలుపు వచ్చిదంటే ఎమ్మెల్యేలు, ఎంపీలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎవరి సీటు ఉంటుందో ఎవరిది సీటు చిరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ నుంచి పలువురు ఎమ్మెల్యేలకు పిలుపు వచ్చింది. ఈ క్రమంలో నేతలంతా తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వరుస కట్టారు.

jagan_met_ysrcp_leaders
jagan_met_ysrcp_leaders
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2024, 7:41 PM IST

CM Jagan Met With YSRCP Leaders: వైసీపీలో నియోజకవర్గాల్లోని ఇన్​ఛార్జ్​ల మార్పుల ప్రక్రియ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. పలు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలను తప్పిస్తోన్న జగన్ మరికొందరిపైనా వేటు వేసేందుకు సిద్ధమయ్యారు. దీనికోసం గడిచిన గత కొన్ని రోజులుగా కసరత్తు చేస్తున్నారు. తమ టికెట్ చించొద్దని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు తాడేపల్లికి వచ్చి విన్నవించుకుంటున్నారు. తమకే అవకాశం ఇవ్వాలని పార్టీ పెద్దలను కోరుతున్నారు. ఎంత మందిపై వేటు పడుతుందోనని సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.

రేపో ఎల్లుండో వైసీపీ ఐదో జాబితా - టికెట్​ ఉంటుందో ఊడుతుందో తెలియక నేతల టెన్షన్​

Change of Incharges in YSRCP: సీఎం జగన్ ఇప్పటికే 4 జాబితాల్లో 59 అసెంబ్లీ స్థానాలు, 9 ఎంపీ స్థానాల్లో ఇన్​ఛార్జీలను మార్చేశారు. మరికొన్ని కీలక స్థానాల్లోనూ ప్రస్తుతం ఉన్న వారిని తీసివేసేందుకు కసరత్తు చేస్తున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఇన్​ఛార్జీలు మార్పులతో అయిదో జాబితా సీఎం జగన్ రూపొందిస్తున్నారు. తాడేపల్లిలోని నుంచి పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు వచ్చింది.

పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఇన్​ఛార్జీల మార్పు నేపథ్యంలో పలువురు ఎమ్మెల్యేలు, నేతలకు సీఎంవో నుంచి పిలుపు రావడంతో తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధనరెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి , బాపట్ల ఎంపీ నందిగం సురేష్ క్యాంపు కార్యాలయానికి వచ్చారు. బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్, వినుకొండ ఎమ్మెల్యే బోళ్ల బ్రహ్మనాయుడు సీఎంవోకి వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ్ రెడ్డిని కలిసి తమ సీట్లపై చర్చించారు.

ముక్కలుగా మారి మూల్గుతున్న మంగళగిరి వైఎస్సార్​సీపీ - ఆదిపత్యపోరుతో పెరుగుతున్న అసమ్మతి

మరోవైపు వైసీపీలో నేతల రాజీనామా పర్వం కొనసాగుతుండటంతో అసంతృప్త నేతలు పార్టీని వీడకుండా ఉండేందుకు వైసీపీ నేతల ప్రయత్నాలు ప్రారంభించారు. వీరికి కూడా తాడేపల్లి నుంచి పిలుపు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన ఎమ్మెల్యేలను తాడేపల్లికి సీఎం జగన్ పిలిపిస్తున్నారు. పిలుపు మేరకు నూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు సీఎంవోకి వచ్చారు. సంతనూతలపాడు ఇన్​ఛార్జీగా ఎమ్మెల్యే సుధాకర్ బాబును తప్పించిన మంత్రి మేరుగ నాగార్జునను నియమించారు. సుధాకర్ బాబుకు టికెట్ ఇవ్వనందున అసంతృప్తితో ఉన్న ఆయన్ని పార్టీ ముఖ్య నేతలు పిలిచి మాట్లాడారు.

వైఎస్సార్​సీపీలో అసమ్మతి మంటలు- రాజీనామాలకైనా సిద్ధమంటున్న ప్రజాప్రతినిధులు

మంత్రి కొట్టు సత్యనారాయణ సైతం సీఎంవోకు: తాడేపల్లిగూడెం నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న వైసీపీ మంత్రి కొట్టు సత్యనారాయణ (Minister Kottu Satyanarayana) సైతం సీఎంవోకు వచ్చి చర్చలు జరిపారు. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సీఎంవోకి వచ్చి చర్చించారు. సర్వేలు అనుకున్న విధంగా లేవని చెబుతూ వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని పార్టీ ముఖ్యనేతలు ఎమ్మెల్యేలకు సూచిస్తున్నారు. అదే విధంగా అక్కడ కొత్తగా నియమించే అభ్యర్థిపైనా చర్చించి సహకరించాలని కోరుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.