ETV Bharat / politics

తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలన్నదే నా తపన- తెలంగాణాలో ఆన్‌లైన్‌లో పార్టీ సభ్యత్వం : చంద్రబాబు - CBN meet Telangana TDP Leaders - CBN MEET TELANGANA TDP LEADERS

CM Chandrababu meet Telangana TDP Leaders: ప్రపంచంలో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలనే ఆలోచనతోనే నిరంతరం పనిచేస్తున్నానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. హైదరాబాద్​లోని ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ముఖ్యనేతలతో చంద్రబాబు చర్చించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపైనా చర్చించినట్లు తెలుస్తోంది.

CBN_MEET_TELANGANA_TDP_LEADERS
CBN_MEET_TELANGANA_TDP_LEADERS (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 25, 2024, 3:03 PM IST

Updated : Aug 25, 2024, 7:36 PM IST

CM Chandrababu meet Telangana TDP Leaders: 2047 కల్లా ప్రపంచంలో తెలుగువారు అగ్రస్థానంలో ఉండాలనే ఆలోచనతోనే నిరంతరం పనిచేస్తున్నానని సీఎం చంద్రబాబు వెల్లడించారు. హైదరాబాద్​లోని ఎన్టీఆర్ ట్రస్ట్‌ భవన్‌లో పార్టీ శ్రేణులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై ముఖ్యనేతలతో చంద్రబాబు చర్చించారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికపైనా చర్చించినట్లు తెలుస్తోంది. 2047 వందేళ్ల స్వాతంత్ర్య వేడుకల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉండాలని, అందులో తెలుగు రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉండేలా కృషి చేయాలి సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. తెలంగాణాలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. ఈ క్రమంలో తెలంగాణాలో ఆన్‌లైన్‌లో పార్టీ సభ్యత్వం తీసుకొనే ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అంతే కాకుండా తెలంగాణాలో యువకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. 15 రోజులకు ఒకసారి రాష్ట్రానికి వచ్చేందుకు ప్రయత్నిస్తానని అందరినీ కలిసి అభిప్రాయాలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు వద్ద నేర్చుకుంటా- ప్రజల కోసం కూలీ మాదిరిగా పనిచేస్తా: పవన్ కల్యాణ్​ - PAWAN comments in GRAMA SABHA

'పరిశ్రమలు వినూత్న ఆలోచనలతో రావాలి' - కంపెనీల సీఈవోలతో సీఎం చంద్రబాబు - AP CM Chandrababu Sri City Visit

Last Updated : Aug 25, 2024, 7:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.