Chief Whip and Whips meet CM Chandrababu: అసెంబ్లీలో చీఫ్ విప్, విప్ లుగా నియామకమైన ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. చీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులు సహా 15 మంది సభ్యుల నియామకాలకు సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో వారంతా అసెంబ్లీ ఆవరణలోని సీఎం కార్యాలయంలోనే చంద్రబాబును కలసి సమావేశం అయ్యారు.
చీఫ్ విప్‌గా జీవీ ఆంజనేయులు, విప్‌లు ఆదినారాయణ రెడ్డి, అరవ శ్రీధర్, అశోక్, బొలిశెట్టి శ్రీనివాస్, బోండా ఉమా మహేశ్వరరావు, దాట్ల సుబ్బరాజు, యనమల దివ్య, వీఎం థామస్, తోయాక జగదీశ్వరి, కాల్వ శ్రీనివాసులు, రెడ్డప్పగారి మాధవి, గణబాబు, తంగిరాల సౌమ్య, యర్లగడ్డ వెంకటరావు ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. చీప్ విప్, విప్‌లుగా నియామకమైన అందరికీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. మీపై పెట్టిన నమ్మకం మేరకు సమర్థంగా నిరూపించుకుని సేవలు అందించాలని సీఎం అన్నారు. పార్టీకి, కూటమి పక్షాలకు ప్రభుత్వానికి మంచిపేరు తీసుకుని రావాలని సీఎం చంద్రబాబు విప్‌లకు సూచించారు.
పదవి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు: మూందుగా జీవీ ఆంజనేయులు సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. చీఫ్ విప్ పదవికి ఎంపికైన తర్వాత తొలిసారి ఆయన సీఎంని కలిశారు. అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో తన సతీమణి లీలావతితో కలిసి చంద్రబాబు వద్దకు వెళ్లారు. చీఫ్ విప్ పదవి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని అన్నారు. జీవీ ఆంజనేయులుకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.
ఎమ్మెల్యేలు రాష్ట్ర సంపదగా తయారుకావాలి - సీఎం చంద్రబాబు క్లాస్
అంబటి హింట్ - 'నా ఇంట్లోనే ఉన్నాడు వచ్చి అరెస్టు చెయ్యండి' - షాకిచ్చిన పోలీసులు