Chandrababu Speech at Prajagalam Public Meeting in Nandyala: ఉద్యోగాలు కావాలంటే ఎన్డీయేను గెలిపించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. నంద్యాల ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతామని స్పష్టం చేశారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మీ భవిష్యత్తుకు భరోసా నాదని యువతకు చంద్రబాబు హామీ ఇచ్చారు.
తొలిసారి ఓటు వేస్తున్నారా? ఈవీఎంలో ఓటు ఎలా పడుతుందో తెలుసుకోండి! - How To Cast Vote Using EVM
పింఛన్ తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ అని గుర్తు చేశారు. రూ.200 పింఛన్‌ను రూ.2 వేలు చేశామని తెలిపారు. ఇప్పుడు అదే పింఛన్‌ను రూ.4 వేలకు పెంచి ఏప్రిల్ నుంచే ఇస్తామని హామీ ఇచ్చారు. పాత బకాయిలతో కలిపి జులైలో రూ.7 వేలు పింఛన్ ఇస్తామని చంద్రబాబు అన్నారు. ప్రస్తుతం దివ్యాంగులకు రూ.6 వేలు పింఛన్ ఇస్తామని జులై నుంచి రూ.12 వేలు వస్తుందని తెలిపారు. ఇంటి వద్ద పింఛన్ ఇవ్వకుండా వైసీపీ నేతలు శవరాజకీయాలు చేశారని చంద్రబాబు మండిపడ్డారు.
రోడ్డు ప్రమాదంలో బయటపడిన డబ్బుల కట్టలు- ఏకంగా ఏడు కోట్లు! - 7 Boxes 7 crore Found in Vehicle
మన భూమి పాస్ పుస్తకంపై జగన్ ఫొటో ఎందుకు చంద్రబాబు ప్రశ్నించారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దుచేస్తూ రెండో సంతకం చేస్తానని తెలిపారు. భూమి పాస్ పుస్తకంపై రాజముద్ర ఉండాలి సైకో ఫొటో కాదని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ అనే వ్యక్తిని జగన్ పెడుతున్నారని తెలిపారు. మనకు ఏ సమస్య ఉన్నా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ వద్దకే వెళ్లాలని అన్నారు. మీ భూమి మీరు అమ్ముకోవడానికి వీల్లేకుండా చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
మీ భూమి పోతే నేరుగా హైకోర్టుకు వెళ్లాలి ఇప్పుడు ఆ కోర్టులు కూడా లేకుండా చేసి భూములు కొట్టేసే కుట్ర చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరి శ్వాస వరకు రాష్ట్రాభివృద్ధి, భావితరాల కోసమే పనిచేస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. తనది అభివృద్ధి బ్రాండ్ అయితే జగన్‌ది విధ్వంసం అని అన్నారు. జగన్ తనను అక్రమంగా అరెస్టు చేశారని గుర్తు చేసుకున్నారు. జగన్‌ను ఇంటికి పంపేందుకు ప్రతి ఒక్కరూ ఓటు కోసం పోటెత్తాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.