Chandrababu Prajagalam Public Meeting in Narasapuram: జగన్ పాలనలో అన్ని రంగాలు పతనావస్థకు చేరాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. చంద్రబాబు నిర్వహిస్తున్న ప్రజాగళం యాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొససాగుతోంది. సీతారామపురం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణుల భారీ ర్యాలీతో చంద్రబాబు నరసాపురం చేరుకున్నారు. అక్కడ జనసేన కార్యాలయం వద్ద చంద్రబాబుకు తెలుగు, వీర మహిళలు హారతులు పట్టి స్వాగతం పలికారు. నరసాపురంలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆక్వా రంగానికి పూర్వవైభవం తెస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేశామని కోస్తాంధ్రలో ఆక్వా కల్చర్ అమలు చేశాని గుర్తు చేశారు.
వైసీపీ విముక్త రాష్ట్రంగా చేయాలనేది పవన్ ఆకాంక్ష: దేశంలో ఆక్వా రంగాన్ని నంబర్ వన్‌గా నిలిపగా వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా పడిపోయిందని అన్నారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆక్వా రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తాని రైతులకు చంద్రబాబు హామీ ఇచ్చారు. అంతే కాకుండా రైతులకు రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం చేసి అన్నదాతను ఆదుకుని రాజును చేస్తామని అన్నారు. వైసీపీ విముక్త రాష్ట్రంగా చేయాలనేది పవన్ ఆకాంక్ష అని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులను దగా చేసిందని మండిపడ్డారు.
మోదీ నాయకత్వంలోనే భారత్ నంబర్ వన్‌గా తయారవుతుందని దేశాన్ని అగ్రగామిగా మార్చేందుకు మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. 2047 నాటికి భారత్ నంబర్ వన్‌గా తయారవుతుందని అన్నారు. ఈ సారి కేంద్రంలో మళ్లీ వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 160 అసెంబ్లీ, 24 పార్లమెంటు స్థానాలు గెలవాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వం రూ.13 లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశారని, ప్రజల నెత్తిన అప్పుల కుంపటి ఉందని అన్నారు.
వైసీపీ డీఎన్‌ఏలోనే శవ రాజకీయం ఉంది: తండ్రి లేని బిడ్డ అని గతంలో జగన్ సానుభూతి పొందారని ఆ తరువాత ఎన్నికల్లో బాబాయిని చంపి ఓట్లు అడిగారని చంద్రబాబు అన్నారు. నిజానికి వైసీపీకి జగన్ గొడ్డలి గుర్తు పెట్టుకోవాలని అన్నారు. వైసీపీ డీఎన్‌ఏలోనే శవ రాజకీయం ఉందని ఆగ్రహిచారు. రాష్ట్రంలో జగన్ జే బ్రాండ్ మద్యం, గంజాయి, డ్రగ్స్ తెచ్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నాడని మండిపడ్డారు. కిరాణా దుకాణాల్లోనూ గంజాయి దొరుకుతోందని ఆ గంజాయిని అమ్మేది కూడా వైసీపీ నాయకులేనని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సంపద సృష్టించి ఆదాయం పెంచి పేదలకు పంచుతామని, ఆడబిడ్డలకు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు. పిల్లలను బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయిస్తారని అన్నారు.
రాష్ట్రంలో బాగుపడింది ఒక్క జగనే: జగన్ పాలనలో అన్ని రంగాలు పతనావస్థకు చేరాయని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్ ట్యాక్స్ వల్ల ఆటో మొబైల్ రంగం దివాలా తీసిందని అన్నారు. రాష్ట్రంలో అన్ని రంగాలు అతలాకుతలమైనా బాగుపడింది మాత్రం ఒక్క జగనేనని అన్నారు. మూడు జెండాలు వేరైనా రాష్ట్రాన్ని బాగు చేసి ప్రజల జీవితాల్లో వెలుగు తేవడమే తమ అజెండా అని చంద్రబాబు అన్నారు. పార్టీల కోసం కార్యకర్తల త్యాగాలు వృథా కావు. ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని అన్నారు. నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇస్తామని భరోసా ఇచ్చారు. ప్రమాదకరమైన భూ హక్కుల చట్టం తీసుకువచ్చారని ఈ చట్టం వస్తే ఎవరి ఆస్తులకు రక్షణ లేదని అన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వ ఆస్తులే తాకట్టు పెట్టారు ఈ భూ హక్కుల చట్టం వస్తే ప్రజల ఇళ్లు, భూములు కూడా తాకట్టు పెడతారని అన్నారు.