Chandrababu and Nara Lokesh to File Nominations : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 19న మధ్యాహ్నం 1.27 గంటలకు కుప్పం ఎన్టీఏ కూటమి అభ్యర్థిగా టీడీపీ అధినేత చంద్రబాబు నామినేషన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. చంద్రబాబు తరఫున తొలిసారిగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి 2 సెట్లు నామినేషన్ దాఖలు చేయనున్నారు. రేపు ఉదయం కుప్పం వరదరాజుల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేస్తారు.
కుప్పంలో చంద్రబాబు తరఫున భువనేశ్వరి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. శనివారం కుప్పం ప్రజల సమక్షంలో చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొంటారు ఈ రోజు మధ్యాహ్నం భువనేశ్వరి హైదరాబాద్ నుంచి బెంగుళూరు మీదుగా కుప్పం వెళ్లనున్నారు. స్థానిక ప్రజలతో కలిసి శుక్రవారం చంద్రబాబు తరఫున నామినేషన్ దాఖలు చేస్తారు.
చంద్రబాబుపై 24, లోకేశ్‌పై 23 కేసులు - అత్యధికంగా వైసీపీ హయాంలోనే ! - Cases on Tdp leaders
Nara Lokesh Nomination : నేడు మంగళగిరి ఎన్టీఏ కూటమి అభ్యర్థిగా టీడీపీ నేత నారా లోకేశ్ తరపున నామినేషన్ దాఖలు చేయనున్నారు. మధ్యాహ్నం 2.34 గంటలకు లోకేశ్ తరఫున కూటమి బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు నామినేషన్ దాఖలు చేస్తారు. ఉదయం సర్వమత ప్రార్థనలతో ఆయన విజయాన్ని కాంక్షిస్తూ నేతలు ర్యాలీ చేయనున్నారు.
Andhra Pradesh Elections 2024 : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలో లోక్‌సభ, శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఈ నెల 25 వరకు పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుంది. ఈ నియోజకవర్గాల్లో మే 13వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనున్నట్లు ఈసీ నోటిఫికేషన్లో పేర్కొంది. నేటి నుంచి శాసన సభ, లోక్ సభ నియోజక వర్గాల్లో నామినేషన్ల స్వీకరణ జరగనుంది. 25వ తేదీ వరకూ నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఉండగా 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 29వ తేదీన నామినేషన్ ల ఉప సంహరణకు తుది గడువుగా ఈసీ స్పష్టం చేసింది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరగనుంది.
ఏపీలో మే 13న ఎన్నికలు - నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ - AP ELECTIONS 2024