ETV Bharat / politics

దగా డీఎస్సీ కాదు, మెగా డీఎస్సీ ప్రకటించాలి - ఈ నెల 22న కాంగ్రెస్ చలో సెక్రటేరియట్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 5:53 PM IST

Congress Party Chalo Secretariat : ఈ నెల 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగ సభలు నిర్వహిస్తామని కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. దగా డీఎస్సీ కాదు మెగా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ 22న చలో సెక్రటేరియట్ చేపట్టనున్నట్లు తెలిపారు.

congress_party_chalo_secretariat
congress_party_chalo_secretariat

Congress Party Chalo Secretariat : దగా డీఎస్సీ కాదు మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 22వ తేదీన చలో సెక్రటేరియట్ చేపట్టామని కాంగ్రెస్ పార్టీ నేత, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు గిడుగు రుద్రరాజు తెలిపారు. పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల ఆధ్వర్యంలో చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ ఆంధ్ర రత్న భవన్ లో చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి సంబంధించిన వాల్​ పోస్టర్లను ఆవిష్కరించారు.

సిద్ధం సభలో ఈ నాలుగు ప్రశ్నలకు జగన్ సమాధానం చెప్పగలడా?

గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ ఫిబ్రవరి 26వ తేదీన అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (AICC President Mallikarjuna Kharge)హాజరవుతారన్నారు. ఎన్నికల సమీపిస్తున్నందున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ సహా ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు. వ్యవస్థల గురించి వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని ఎద్దేవా చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే పార్టీలోకి ఎందుకు వచ్చారో? తిరిగి ఎందుకు వెళ్లిపోయారో ఆయనే సమాధానం చెప్పాలని పేర్కొన్నారు.

సీఎం జగన్ రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు పెట్టారు: కాంగ్రెస్​ నేతలు

'ఫిబ్రవరి 26 నుంచి మార్చి మూడో వారం వరకూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్​ పార్టీ సభలు నిర్వహించనున్నాం. ఆయా సభల్లో రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, ప్రత్యేక హోదా, వెనుకబడిన రాయలసీమకు రావాల్సిన ప్యాకేజీపై నిలదీస్తాం. తొలి బహిరంగ సభ అనంతపురంలో, మరో సభ వైజాగ్ స్టీల్​ ప్లాంట్​కు వ్యతిరేకంగా, రాష్ట్ర రాజధాని నగరం నిర్మాణం కోసం గుంటూరులో మరో సభ నిర్వహిస్తాం. పోలవరం ప్రాజెక్టు, నీటి పారుదల రంగంలో అన్యాయం, వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, సమస్యలపై జంగారెడ్డిగూడెంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తాం. సభలకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, రేవంత్ రెడ్డి, ప్రియాంక గాంధీ, చివరకు రాహుల్ గాంధీ నాయకత్వంలో మరో భారీ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. మార్చి రెండు, మూడు వారాల వరకు నిర్వహించే సభల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి చేసిన అన్యాయంపై నిలదీస్తాం. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా కార్యాచరణ రూపొందిస్తాం. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే స్వచ్ఛందంగా కాంగ్రెస్​ పార్టీరోకి వచ్చారు. వెళ్లేటపుడు ఎందుకు వెళ్లాడో చెప్పలేదు. ఆ విషయంలో ఆయనే క్లారిటీ ఇస్తే బాగుంటుంది. జగన్​ ముఖ్యమంత్రి అయ్యాక కార్పోరేటర్లు బాగుపడ్డారు తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదు.' అని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు గిడుగు రుద్రరాజు తెలిపారు.

త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటిస్తాం: కాంగ్రెస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.