ETV Bharat / politics

ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు - నిందితులుగా ఆయన కుమారుడు, సోదరుడు - Case Filed Against Arekapudi Gandhi - CASE FILED AGAINST AREKAPUDI GANDHI

Case Filed Against Arekapudi Gandhi : శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు అతని కుమారుడు, సోదరుడిపై హత్యాయత్నం కింద కేసు నమోదైంది. వీరితో పాటు కార్పొరేటర్లు వెంకటేశ్ గౌడ్, శ్రీకాంత్‌లను పోలీసులు నిందితులుగా చేర్చారు.

Case Filed MLA Against Arekapudi Gandhi and Corporators
Case Filed MLA Against Arekapudi Gandhi and Corporators (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 14, 2024, 10:48 AM IST

Updated : Sep 14, 2024, 1:46 PM IST

Case Filed Against MLA Arekapudi Gandhi and Corporators : శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. గాంధీతో పాటు అతని కుమారుడు, సోదరుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కార్పొరేటర్లు వెంకటేశ్‌గౌడ్‌, శ్రీకాంత్‌ను నిందితులుగా చేర్చారు. గచ్చిబౌలి పీఎస్​లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశారు.

సవాల్‌తో మొదలై అరెస్టు దాకా : కాగా రాష్ట్ర ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్‌గా అరెకపూడి గాంధీని నియమించిన అనంతరం పరిణామాలు ఒక్కసారిగా రాజకీయాలను వేడెక్కించాయి. తాను బీఆర్ఎస్​లోనే ఉన్నానని ప్రకటించిన గాంధీకి, గులాబీ కండువా కప్పుతానన్న కౌశిక్ రెడ్డి సవాల్​తో మొదలైన పంచాయితీ ఉద్రిక్తతలకు దారి తీసింది. కొండాపూర్​లోని కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వెళ్లడం, ఆయన అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు, కుండీలు ధ్వంసం చేయడం అరెస్టులకు దారితీసింది.

రాష్ట్రంలో రాజకీయ కాక - కౌశిక్‌రెడ్డి, అరెకపూడి గాంధీ మధ్య చల్లారని మాటల వేడి - KAUSHIK REDDY AREKAPUDI CONTROVERSY

గాంధీని పోలీసులు అరెస్టు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్​కు తరలించారు. అదే సమయంలో గాంధీ వెంట వచ్చిన అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. గాంధీ, ఆయన అనుచరులపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

రాజకీయ కుట్రతోనే రేవంత్‌ సర్కార్‌ ప్రాంతీయ విబేధాలకు తెరలేపుతోంది : కౌశిక్​రెడ్డి - Padi Kaushik Comments On CM Revanth

నా యుద్ధం కౌశిక్​ రెడ్డితోనే - బీఆర్​ఎస్​తో కాదు : ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ - Arekapudi Gandhi Latest Comments

Last Updated : Sep 14, 2024, 1:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.