ETV Bharat / politics

' రేవంత్‌రెడ్డి పంపే బుల్డోజర్లకు మేం అడ్డంగా నిలబడతాం - హైదరాబాద్‌లో పేదలకు అండగా ఉంటాం'

హైడ్రా, మూసీ ప్రాజెక్టుల తదుపరి కార్యచరణపై బీఆర్ఎస్‌ ఫోకస్ - మూసీ విషయంలో రోజుకోమాట మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శ - రేవంత్‌రెడ్డి పంపే బుల్డోజర్లకు తాము అడ్డంగా నిలబడతామని వ్యాఖ్య

KTR Focus On HYDRA MUSI Issues
KTR Focus On HYDRA MUSI Issues (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2024, 4:38 PM IST

KTR Focus On Hydra Musi Issues : హైడ్రా, మూసీ ప్రాజెక్టుల విషయమై తదుపరి కార్యాచరణపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. అందులో భాగంగానే జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న సమావేశంలో మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పాల్గొన్నారు.

మూసీ పేరిట జరుగుతున్న లూటీని ప్రజల్లోకి తీసుకెళ్తాం : మూసీ పేరిట జరుగుతున్న లూటీని ప్రజల్లోకి తీసుకెళ్తామని, నియోజకవర్గాల వారీగా బస్తీలు, క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టి భరోసా కల్పిస్తామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వ దుందుడుకు చర్యలు, అనాలోచిత విధానాలతో పేదలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించినట్లు తెలిపారు.

మోదీ పెద్దనోట్ల రద్దు సమయంలో కారణాలు మార్చినట్లే కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ విషయంలో మాట్లాడుతోందని కేటీఆర్ ఆక్షేపించారు. దుర్మార్గంగా, అరాచకంగా మూసీ పరివాహకంలో ఉన్న పేదల ఇండ్లను నోటీసులు ఇవ్వకుండా కూలుస్తామని అంటున్నారని బిల్డర్లు, వ్యాపారవేత్తలను భయపెట్టేందుకు మాత్రమే హైడ్రా అని మండిపడ్డారు.

పేదలకు రక్షణ కవచంలా ఉంటాం : పేదల కడుపు మీద కొట్టకుండా తాము మూసీ సుందరీకరణ చేశామని, పేదలకు నష్టం కలిగే ప్రతిపాదనలు వద్దని కేసీఆర్ అప్పట్లో వారించారని గుర్తు చేశారు. కూకట్ పల్లిలో 1980లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీవ్ గాంధీ నగర్‌లో 20 వేల మందికి పట్టాలు ఇచ్చి, ఇప్పుడు ఆక్రమణ దారులు అంటున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.

"ప్రభుత్వ దుందుడుకు చర్యలపై చర్చించాం. సర్కారు అనాలోచిత విధానాలతో పేదలు ఇబ్బందులు తప్పడం లేదు. సరైన ప్రణాళిక లేకుండా ఇష్టం వచ్చినట్లు ముందుకెళ్తున్నారు. మూసీ విషయంలో రోజుకోమాట మాట్లాడుతున్నారు. బిల్దర్లు, వ్యాపారవేత్తలను భయపెట్టేందుకే హైడ్రా చర్యలు ఉంటున్నాయి"- కేటీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు

బుల్డోజర్లకు అడ్డుగా నిలుస్తాం : హైదరాబాద్‌లో పేదలకు అండగా ఉంటామని కేటీఆర్‌ తెలిపారు. బీఆర్ఎస్ రక్షణ కవచంలా నిలుస్తుందన్న ఆయన రేవంత్ రెడ్డి పంపే బుల్డోజర్లకు అడ్డుగా నిలుస్తామని తెలిపారు. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ నేతల పర్యటన చేపడతామన్న ఆయన ఎస్టీపీలు, ఎస్ఎన్డీపీ పనులను సందర్శిస్తామని చెప్పారు.

బస్తీల్లోకి వెళ్లి ప్రజలకు భరోసా కల్పిస్తామని, లీగల్ సెల్ ద్వారా అండగా ఉంటామని కేటీఆర్ తెలిపారు. హైడ్రా పేరిట ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, హైడ్రా పేరిట వసూళ్లు జరుగుతున్నాయనడానికి నాంపల్లిలోని కాంగ్రెస్, మజ్లిస్ నేతల గొడవ ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలిగినా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, తెలంగాణ భవన్ వద్దకు రావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తమను ఇబ్బంది పెట్టి రాక్షసానందం పొందితే పొందండి కానీ, ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని ప్రభుత్వానికి సూచించారు.

శ్వేతపత్రం విడుదల చేయాలి : అప్పుల ద్వారా వచ్చిన డబ్బులు ఏం చేశారో శ్వేతపత్రం ప్రకటించగలరా? అని సవాల్ చేశారు. అప్పు పుట్టడం లేదని మంత్రి తుమ్మల అంటున్నారని సీఎం, డిప్యూటీ సీఎం రోజూ దివాళా కోరు మాటలు మాట్లాడితే అప్పు ఎలా వస్తుందని కేటీఆర్ ప్రశ్నించారు. నౌకాదళ రాడార్ విషయంలో రేవంత్ రెడ్డి బీజేపీ నేత కంటే ఎక్కువగా మాట్లాడారని, మూసీ ప్రక్షాళన అంటూ పురిట్లోనే అన్యాయం చేస్తుంటే ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు. రాడార్‌ కేంద్రంతో స్థానికులకు ఒక్క ఉద్యోగం కూడా రాదని పేర్కొన్నారు.

కేసీఆర్ సీఎంగా ఉంటే రైతుబంధు డబ్బులు వచ్చేవి, ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు వచ్చేవి : కేటీఆర్​

రేవంత్‌రెడ్డి చేసేది ఫోర్త్ సిటీ కాదు - ఫోర్ బ్రదర్స్ సిటీ - అంతా నాటకాలు : కేటీఆర్ - KTR Fires on CM Revanth

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.