BRS MLA Tellam Venkata Rao Meet CM Revanth Reddy : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని కలవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన సీఎంను కలిశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలవగా, భద్రాచలం ఒక్క సీటు మాత్రం బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు గెలిచారు.
ఆయన ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్‌లో ఉండి ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో ఆ తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం జరిగిన శాసనసభ ఎన్నికలో భద్రాచలం బీఆర్ఎస్(BRS) అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్యపై సుమారు 5 వేల ఓట్ల మెజారిటీతో తెల్లం వెంకట్రావు గెలుపొందారు. ఇప్పుడు సీఎం రేవంత్‌ను ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కలవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పార్టీ మారతారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఎమ్మెల్యే మాత్రం నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసినట్లు చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్‌లో చేరనున్న జీహెచ్‌ఎంసీ ఉప మేయర్ శ్రీలతా రెడ్డి దంపతులు
Bhadrachalam MLA Tellam Venkata Rao : అయితే భద్రాచలం నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కొన్నాళ్లుగా పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. ఈయన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని రాష్ట్రవ్యాప్తంగా పేరుంది. ఇప్పుడు అదే మంత్రిని వెంటబెట్టుకుని సీఎంను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. పార్లమెంటు ఎన్నికలకు ముందు తెల్లం వెంకట్రావు బీఆర్ఎస్కు షాక్ ఇస్తారా? అనే ప్రశ్న అందరి మదిని తొలచివేస్తోంది.
అయితే ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఇది రెండోసారి. కీలకమైన పార్లమెంట్ ఎన్నికల (Lok Sabha Polls 2024) ముందు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్కు ముఖ్య నేతలు పార్టీ మారడం ఆందోళనకరమైన విషయమే. ఇప్పటికే ముగ్గురు ఎంపీల్లో వెంకటేశ్ నేత కాంగ్రెస్ కండువా కప్పుకోగా, రాములు, బీబీ పాటిల్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు కొందరు మాజీలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, సునీత మహేందర్ రెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలువురు కార్పొరేటర్లు బీఆర్ఎస్కు బాయ్ చెప్పి కాంగ్రెస్‌లో చేరారు.
ఖమ్మం కాంగ్రెస్‌లో జోరందుకున్న చేరికలు - హస్తం తీర్థం పుచ్చుకున్న నలుగురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు
కాంగ్రెస్ కండువా కప్పుకున్న పట్నం సునీత మహేందర్ రెడ్డి, బొంతు రామ్మోహన్