BRS MLA Harish Rao Fires On Congress : రైతుల సమస్యలు పరిష్కరించి వెంటనే నీటిని విడుదల చేయాలని సిద్దిపేట కలెక్టర్‌కు మాజీ మంత్రి హరీశ్‌రావు వినతిపత్రం అందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు నివారించే ప్రయత్నం చేయకుండా రైతులకు అపాయం చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలం బాట పర్యటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని నీటిని విడుదల చేసిందని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్లే ప్రభుత్వం నీటిని విడుదల చేసిందని, పంటలు నష్టపోయిన రైతులకు రూ.25 వేల పరిహారం అందించాలని తెలిపారు. 100 రోజుల్లో అమలు చేస్తామని రైతులకు అనేక హామీలు ఇచ్చారని, అవి వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబరు 9న రుణమాఫీ చేస్తామని చేయలేదని తెలిపారు. అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇచ్చి కొనాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
స్టేజీ పైనే హనుమాన్ చాలీసా పఠించిన మాజీమంత్రి హరీశ్‌రావు - Harish Rao Sang Hanuman Chalisa
BRS MLA Harish Rao Comments : అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ రైతులకు అన్యాయం చేస్తుందని, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ రైతుల పక్షమేనని తెలిపారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరవు అని అన్నారు. కూడవెల్లి వాగులోకి తక్షణమే నీటిని విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. 24 గంటల్లో కూడవెల్లి వాగులోకి నీటిని విడుదల చేయకపోతే, పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
రైతుల సమస్యలు పరిష్కరించి నీటిని విడుదల చేయాలి. కేసీఆర్ పొలం బాట పట్టాక రాష్ట్ర ప్రభుత్వం మేల్కొంది. కేసీఆర్ పర్యటన తర్వాత సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. బీఆర్ఎస్ నాయకుల పోరాటం వల్లే ప్రభుత్వం నీరు విడుదల చేసింది. రాష్ట్రంలో పంటలు నష్టపోయిన రైతులకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలి. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలి. అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇచ్చి కొనాలి. -హరీశ్ రావు, మాజీ మంత్రి
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రక్షించాలి : కాంగ్రెస్ పార్టీ రైతులకు అన్యాయం చేస్తుందన్న హరీశ్‌రావు కాంగ్రెస్ వచ్చాక నీళ్లు తగ్గి కన్నీళ్లు పెరిగాయన్నారు. రైతులను పరామర్శించేందుకు సీఎంకు, మంత్రులకు తీరిక లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ రైతులను కంటికి రెప్పలా కాపాడుకుందని ఈ ప్రభుత్వం వచ్చాక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. విపక్షనేతలను పార్టీలో చేర్చుకోవడంపై ఉండే శ్రద్ధ రైతులపై లేదన్నారు. సీఎం మాపై అక్రమ కేసులు పెట్టేందుకు తీరికలేకుండా ప్రయత్నిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు మాని రైతులను రక్షించాలని సూచించారు.