BRS MP Candidate Vinod Comments : రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తోందని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఐదేళ్లలో చేయబోయే అభివృద్ధి పనులను కరీంనగర్లో వివరించారు. కరీంనగర్లో ఉన్నత విద్యాసంస్థలు తేవాలన్నదే తన లక్ష్యమని, విద్యా సంస్థకు 150 ఎకరాల భూమిని కూడా గతంలో గుర్తించామని తెలిపారు.
కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు రైలు మార్గం వేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కరెంట్ సరిగా లేక రైతుల మోటార్లు కాలిపోతున్నాయన్న వినోద్ కుమార్, ఇళ్లలోకి ప్రజలు ఇన్వర్టర్లు కొనాల్సిన పరిస్థితిని వచ్చిందని అన్నారు. కరీంనగర్‌కు బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలన్న ఆయన, ప్రజలు అభివృద్ధి కోరుకుంటారా? విధ్వంసం కోరుకుంటారా? అని ప్రశ్నించారు.
సింగపూర్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని తీసుకువస్తా. విద్యా సంస్థకు 150 ఎకరాల భూమిని కూడా గతంలో గుర్తించాం. కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు రైలు మార్గం వేసేందుకు కృషి చేస్తా. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం చేస్తోంది. కరెంట్ సరిగా లేక రైతుల మోటార్లు కాలిపోతున్నాయి. కరీంనగర్‌కు బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలి? - వినోద్‌కుమార్, కరీంనగర్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థి