ETV Bharat / politics

పింఛన్​ పంపిణీ అంశాన్ని వైసీపీ రాజకీయం చేస్తుంది: పురందేశ్వరి - PURANDESWARI ON PENSIONS - PURANDESWARI ON PENSIONS

Pension distribution issues in AP: పింఛన్ పంపిణీపై వైసీపీ ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపించారు. 2019 ముందు వాలంటీర్ వ్యవస్ధ లేనప్పడు కూడా పింఛన్లు అందించిన విషయాన్ని పురందేశ్వరి గుర్తు చేశారు. లబ్ధిదారుల వద్దకు వాలంటీర్​ ఎందుకు వెళ్లి ఇవ్వాలన్న ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పడం లేదని పురందేశ్వరి ఎద్దేవా చేశారు.

Pension distribution issues in AP
Pension distribution issues in AP
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 2, 2024, 8:47 PM IST

Pension Distribution Issues in AP: సార్వకత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులతో పాటుగా, సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చెల్లింపుల విషయంలో ఎన్నికల సంఘం పర్యవేక్షణ కొనసాగుతుంది. అయితే, వైసీపీ ప్రభుత్వం ముందుగా నిర్ణయించినట్లుగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్ పంపిణీ కార్యక్రమం చెపట్టాలనుకుంది. వాలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్ పంపిణీని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పింఛన్ పంపిణీ అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పందించారు.

రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోంది: అవ్వాతాతల పింఛన్ పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తోందని దగ్గుబాటి పురందేశ్వరి మండిపడ్డారు. సంక్షేమం అనేది నిరంతరాయంగా సాగేదని, అందుకు తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సన్నద్దంగా లేదని నిలదీశారు. ఎన్నికల సందర్భంలో కేంద్ర ఎన్నికల ఆదేశాలను ఆసరాగా చేసుకుని అవ్వతాతలకు అందించాల్సిన పింఛన్ పంపిణీని చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం రాజకీయం చేస్తుందని ధ్వజమెత్తారు. ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రతిపక్షాలపై నెట్టేసి తమ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేలా ముఖ్యమంత్రి వైఖరి కనపడుతోందని విమర్శించారు.

సీఎం జగన్ తన రాజకీయ స్వార్థం కోసం పింఛన్లు నిలిపివేశారు: టీడీపీ - TDP Leaders Met CS Jawahar Reddy

పింఛన్​ ఇవ్వడానికి బటన్ ఎందుకు నొక్కడం లేదు సమర్ధవంతంగా పింఛన్ అందించడానికి అవసరమైన విధానాలు రూపొందించుకోకపోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతగా కొట్టొచ్చినట్లు కనపడుతోందని పరందేశ్వరి విమర్శించారు. 2019 కి పూర్వం అంటే వాలంటీర్ వ్యవస్ధ లేనప్పడు కూడా పింఛన్లు అందించిన విషయాన్ని పురందేశ్వరి రాష్ట్ర ప్రభుత్వాని కి గుర్తు చేశారు. పింఛన్ పంపిణీ విషయంలో బాధ్యతల నుంచి వెనుదిరిగే దిశగా వాలంటీర్ వ్యవస్ధ లేని సమయంలోనూ, ఫించన్ పంఫిణీ కార్యక్రమం ఉందని, నేరుగా నగదు బదిలీ ద్వారా పింఛన్ పంపడానికి రాష్ట్రప్రభుత్వానికి ఉన్న అడ్డంకులేంటని నిలదీశారు. ప్రతి ఎన్నికల సభలో 58 నెలల్లో 130 పర్యాయాలు బటన్ నొక్కానని గర్వంగా చెబుతున్న ముఖ్యమంత్రి అవ్వాతాతల కోసం అదేవిధంగా వితంతువులు, వికలాంగులకు బటన్ ఎందుకు నొక్కడంలేదని ప్రశ్నించారు.

'అమ్మా వెళ్లొద్దు- భోజనాలు ఉన్నాయి-ఆగండి' జనాలను నిలువరించేందుకు వైసీపీ ప్రయత్నాలు - YCP LEADER ELECTION CAMPAIGN

ముఖ్యమంత్రి ఏమి ఆశిస్తున్నారు: వాలంటీర్ల పేరుతో ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోసే బదులు వాలంటీర్లతో నేరుగా నగదును పంపిణీ చేసే బదులు డిబిటి ద్వారా ఎందుకు నగదు పంపడానికి ఎందుకు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారన్నారని ప్రశ్నించారు. వాలంటీరే ఎందుకు వారి వద్దకు వెళ్లి ఇవ్వాలి అన్న ప్రశ్న ముఖ్యమంత్రి సమాధానం చెప్పడం లేదని పురందేశ్వరి ప్రశ్నించారు. వాలంటీర్ ద్వారా ఇంటింటికి పంపించే పింఛన్ వెనుక ముఖ్యమంత్రి ఏమి ఆశిస్తున్నారో వెల్లడించాలన్నారు. సంక్షేమం నేరుగా వారికి పంపించడానికి వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఇష్టపడడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం వాలంటీర్ విధానం ద్వారా పంపిణీ చేయకూడదన్న విషయంపై ముఖ్యమంత్రి రాజకీయం చేసి, తద్వారా బాధ్యతల నుండి వైదొలిగే ప్రయత్నం చేస్తున్నారని పురందేశ్వరి విమర్శించారు.

రాజకీయ లబ్ధి కోసమే ఈసీపై వైఎస్సార్సీపీ దుష్ప్రచారం: అనగాని - Anagani on Pension Distribution

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.