APJAC Movement Activity : మంత్రివర్గ ఉపసంఘం చర్చించిన అంశాలపై ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించక పోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు, పలిశెట్టి దామోదరరావు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణం ఐఆర్ ప్రకటించాలని, ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలు తక్షణం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ను 7 నుంచి 10శాతం, 12 నుంచి 15శాతం శాతానికి పెంచాలన్నారు.
'మా సమస్యలను పరిష్కరించాలి' - విజయవాడలో విద్యుత్ ఉద్యోగుల ఆందోళన
2023 లో ఇవ్వాల్సిన రెండు డీఏలు వెంటనే ప్రకటించాలన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాలని, ఉద్యోగుల ఆర్థిక అంశాలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన అంశాలపై వెంటనే ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించకపోతే, ఈ నెల 22వ తేదీన జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి, ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు భోజన విరామ సమయంలో చేసిన ఆందోళన రెండో రోజు విజయవాడలో కొనసాగింది. బందరు రోడ్డులోని రవాణా శాఖా కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో ఉద్యోగులు హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ అవసరాలకు దాచుకున్న సొమ్ముని జగన్ ప్రభుత్వం తమకు ఇవ్వకపోవడం అన్యాయమని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ((State Government Employees) వాపోయారు. ఎన్నికల ముందు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విభాగంలో పని చేస్తున్న ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తానన్న సీఎం జగన్ మాట తప్పి, మడమ తిప్పారని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విమర్శించారు.
రిటైర్డ్ ఉద్యోగుల ఆందోళన- ఒంగోలు కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష
తమ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే తమ ఆందోళన తీవ్రతరం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉద్యోగులు హెచ్చరించారు. తమ సమస్యలు తక్షణమే చర్చల ద్వారా పరిష్కారం చేయకపోతే ఈనెల 27న చలో విజయవాడ చేపడతామని తేల్చిచెప్పారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న సమస్యలపై ఏపీ ఎన్జీఓల సంఘం (AP NGOs Association) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఏపీ ఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీ ఎన్జీఓల సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ మీడియాతో మాట్లాడారు.
సమస్యలపై స్పందించకపోతే 27న 'చలో విజయవాడ': ప్రభుత్వ ఉద్యోగులు