AP Ministers Meeting on Draft BC Defense Act: రాష్ట్రంలో బీసీ గణన చేపట్టాలని మంత్రులు నిర్ణయించారు. బీసీ రక్షణ చట్టం ముసాయిదా రూపకల్పనపై బీసీ మంత్రులు సమావేశం అయ్యారు. ఎన్నికల హామీగా ఉన్న బీసీలకు రక్షణ చట్టం అమలుపై మంత్రుల తొలి సమావేశం నిర్వహించారు. హోం మంత్రి అనిత, బీసీ మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, అనగాని సత్యాప్రసాద్, పార్థసారథి, కొండపల్లి శ్రీనివాస్, సవిత, సత్యకుమార్, వాసంశెట్టి సుభాష్‌లు బీసీ రక్షణ చట్టం విధి విధానాలపై చర్చించారు. బీసీ చట్టం తెస్తే రాష్ట్ర పరిధిలో ఏఏ అంశాలు వస్తాయనే దానిపై ప్రాథమిక చర్చ జరిపారు.
రాష్ట్ర పరిధిలో తీసుకొచ్చే చట్టంలో ఐపీసీకి లోబడి ఎలాంటి అంశాలు వస్తాయని ఈ అంశాలకు న్యాయ సలహా తీసుకుని ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపై మంత్రులు చర్చించారు. జాతీయ బీసీ కమిషన్ సిఫార్సులు కూడా తీసుకుని చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. తదుపరి భేటీలో కుల సంఘాలను పిలిచి వారి సూచనలు తీసుకోవాలని నిర్ణయించారు. చట్టం, సెక్షన్ల రూపకల్పనపై మరింత అధ్యయనం చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. బీసీ డిక్లరేషన్ అమలుపై సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారని మంత్రులు తెలిపారు. చట్టం రూపకల్పనకు తరుచూ సమావేశాలు నిర్వహించాలని మంత్రులు నిర్ణయించారు.
ఉచిత ఇసుక విధానంపై ఫిర్యాదులు - చంద్రబాబు ఆగ్రహం
తాడేపల్లి ప్యాలెస్ కంచె ఖర్చు ఎంతో తెలుసా? - 30 అడుగులకు రూ.12.85కోట్లు - వివరాలు బయటపెట్టిన లోకేశ్