Anantapur Lok Sabha Constituency: అనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2008 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న రాప్తాడు మండలం, అనంతపురం రూరల్ మండలం కొంతభాగం, ఆత్మకూరు మండలాలు ఇప్పుడు హిందూపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగమయ్యాయి. రెవెన్యూ డివిజన్ల పరిధిలో కలిపి మొత్తం 63 మండలాలున్నాయి. ఇది జనరల్ కేటగిరిలో ఉంది.
లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు:
మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
- రాయదుర్గం
- ఉరవకొండ
- గుంతకల్
- తాడిపత్రి
- శింగనమల(ఎస్సీ)
- అనంతపురం పట్టణం
- కల్యాణదుర్గం
2024 ఓటర్ల జాబితా ప్రకారం ఓటర్లు:
- మొత్తం ఓటర్ల సంఖ్య- 17.47 లక్షలు
- ఓటర్లలో పురుషుల సంఖ్య- 8.65 లక్షలు
- మహిళా ఓటర్ల సంఖ్య- 8.81 లక్షలు
- ఓటర్లలో ట్రాన్స్‌జెండర్ల సంఖ్య- 232
ఇప్పటివరకూ జరిగిన ఎన్నికల్లో 12 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, తెలుగుదేశం మూడు సార్లు, సీపీఐ, వైఎస్సార్సీపీ ఒక్కోసారి విజయం సాధించాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జేసీ పవన్ కుమార్ రెడ్డిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి తలారి రంగయ్య విజయం సాధించారు.
ప్రస్తుత ఎన్నికలకు పోటీలో ఉన్న ప్రధాన పార్టీ అభ్యర్థులు: ప్రస్తుతం మాలగుండ్ల శంకరనారాయణ వైఎస్సార్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా ఈ లోక్‌సభ నియోజకవర్గం టీడీపీకి కేటాయించగా అంబికా లక్ష్మీనారాయణను బరిలో దించారు.
గత ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు వీరే:
- 1952: పైడి లక్ష్మయ్య(కాంగ్రెస్)
- 1957: తరిమెల నాగిరెడ్డి(కమ్యూనిష్టు పార్టీ)
- 1962: ఉస్మాన్ అలీఖాన్(కాంగ్రెస్)
- 1967: పొన్నపాటి ఆంటోని రెడ్డి(కాంగ్రెస్)
- 1971: పొన్నపాటి ఆంటోనిరెడ్డి(కాంగ్రెస్)
- 1977: దారుర్ పుల్లయ్య(కాంగ్రెస్)
- 1980: దారుర్ పుల్లయ్య(కాంగ్రెస్)
- 1984: డి.నారాయణ స్వామి(టీడీపీ)
ఇప్పటివరకూ గెలుపొందిన అభ్యర్థులు- సమీప ప్రత్యర్థులు:
- 1989: అనంత వెంకటరెడ్డి(కాంగ్రెస్)- జీ.రామన్న చౌదరి(టీడీపీ)
- 1991: అనంత వెంకటరెడ్డి(కాంగ్రెస్)- బీ.టీ.ఎల్.ఎన్ చౌదరి(టీడీపీ)
- 1996: అనంత వెంకట రామిరెడ్డి(కాంగ్రెస్)- ఆర్. రంగప్ప(సీపీఐ)
- 1998: అనంత వెంకట రామిరెడ్డి(కాంగ్రెస్)- ఆర్ రామకృష్ణ(సీపీఐ)
- 1999: కాలవ శ్రీనివాసులు(టీడీపీ)- అనంత వెంకట రామిరెడ్డి(కాంగ్రెస్)
- 2004: అనంత వెంకటరామిరెడ్డి(కాంగ్రెస్)- కాలవ శ్రీనివాసులు(టీడీపీ)
- 2009: అనంత వెంకటరామిరెడ్డి(కాంగ్రెస్)- కాలవ శ్రీనివాసులు(టీడీపీ)
- 2014: జె. సి. దివాకర్ రెడ్డి(టీడీపీ)- అనంత వెంకట రామిరెడ్డి(వైఎస్సార్సీపీ)
- 2019 తలారి రంగయ్య(వైఎస్సార్సీపీ)- జే.సీ పవన్ కుమార్ రెడ్డి(టీడీపీ)