ETV Bharat / politics

'జగన్‌ బెంగళూరులో ఫుల్‌టైమ్‌, తాడేపల్లిలో పార్ట్‌టైమ్‌' - Alliance Leaders Fire on Jagan - ALLIANCE LEADERS FIRE ON JAGAN

లడ్డూ అంశంలో జగన్‌ దోషిగా నిలబడ్డారు - తమ నేతలను కాపాడుకునేందుకే డైవర్షన్‌ పాలిటిక్స్‌

alliance_leaders_fire_on_jagan
alliance_leaders_fire_on_jagan (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 4, 2024, 6:57 PM IST

Alliance Leaders Fire on Jagan in case of Tirumala Laddu: డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని తిరుమలకు వెళ్లని జగన్ తిరుమల విశిష్టత గురించి మాట్లాడటం శోచనీయమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్​లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్​లో మీడియాతో మాట్లాడిన పయ్యావుల తిరుపతి లడ్డూ విషయంలో సిట్​ ఏర్పాటుని స్వాగతిస్తున్నామని అన్నారు. లక్షలాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయంలో ఎలాంటి పక్షపాతం, రాజకీయాలకు తావు లేకుండా అన్ని నిజాలు బయటకు వచ్చేందుకు సహకరిస్తామన్నారు.

'జగన్‌ బెంగళూరులో ఫుల్‌టైమ్‌, తాడేపల్లిలో పార్ట్‌టైమ్‌' (ETV Bharat)

టీటీడీని అగౌరవపరిచిన వారు దోషులుగా తేలే రోజు త్వరలోనే వస్తుందన్నారు. సెట్టింగులు వేసి తిరుమలేశ్వరుడిని ఇంటికి రప్పించుకున్న జగన్ ఇప్పుడు తిరుమల గురించి మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. టీటీడీ ఛైర్మన్​గా సుబ్బారెడ్డి తప్పు చేశారన్న పయ్యావుల కోర్టు తీర్పులను సైతం తప్పుదోవ పట్టించేలా జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కోర్టు ఇచ్చిన కాపీని జగన్ చదవాలని సూచించారు. జగన్‌ అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని పయ్యాల మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పును జగన్‌ వక్రీకరించారని అన్నారు. తీర్పు కాపీ రాకముందే జగన్‌ ప్రెస్‌మీట్‌ పెట్టారని వ్యాఖ్యానించారు. తిరుమల ప్రాశస్త్యం గురించి గతంలో ఎప్పుడైనా జగన్‌ మాట్లాడారా అని పయ్యావుల ప్రశ్నించారు.

మంగళగిరి ఎయిమ్స్​లో మెరుగైన వైద్య సేవలు ​- అతి తక్కువ ఖర్చుతో చికిత్స - Mangalagiri AIIMS

Minister Anam Ramanaraya Reddy: సుప్రీంకోర్టు సూచన జగన్‌కే వర్తిస్తుందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్​సీపీ పాలనలో ఆలయాలపై దాడులు జరిగితే జగన్‌ ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ఆలయాలపై దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోలేదని అన్నారు. నాసిరకం నెయ్యి సరఫరాపై అప్పటి ఈవోకు తెలిసే మౌనంగా ఉన్నారా అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను జగన్‌ వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ కల్తీ అంశాన్ని చంద్రబాబు వెలుగులోకి తెచ్చారని నిజాలు బయటకు వస్తాయనే జగన్‌ అసత్యాలు చెబుతున్నారని మంత్రి ఆనం మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్‌ వాస్తవాలను వెలికి తీస్తుందని అన్నారు.

MLA GV Anjaneyu: జగన్‌ బెంగళూరులో ఫుల్‌టైమ్‌ తాడేపల్లిలో పార్ట్‌టైమ్‌ ఉంటున్నారని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎద్దేవా చేశారు. తాడేపల్లికి పార్ట్‌టైమ్‌ వస్తూ జగన్‌ నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌కు పాస్‌పోర్టు సమస్య లేకుంటే లండన్‌లో ఫుల్‌టైమ్‌ ఉండేవారని అన్నారు. కుట్రలు చేసేందుకు జగన్‌ తాడేపల్లి వస్తున్నారని చేసిన పాపాల నుంచి జగన్‌ ఎక్కడికీ తప్పించుకోలేరని అన్నారు. ఓడినా తాడేపల్లి ప్యాలెస్‌లోని ఫర్నిచర్‌ను ప్రభుత్వానికి ఎందుకివ్వలేదని ఎమ్మెల్యే జీవీ ప్రశ్నించారు.

పరిశ్రమల్లో భద్రతా చర్యలు - ప్రమాదాల నివారణ దిశగా కూటమి సర్కారు చర్యలు - industries safety measures

మద్యం దుకాణాల అప్డేట్​ - మూడు రోజుల్లో మూడు వేల దరఖాస్తులు - Application For AP New Liquor Shops

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.