Pratidhwani : గడువు దగ్గర పడుతున్న కొద్దీ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడిగా పతాక స్థాయికి చేరుకుంటోంది. యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూసిన సందర్భం రానే వచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థుల మధ్య మొదటి ముఖాముఖిని కోట్లాదిమంది కళ్లప్పగించిన వీక్షించారు. మరి ఇటు ట్రంప్ అటు కమలాహారీస్ మధ్య జరిగిన ఈ వాడీవేడీ చర్చలో ఎవరు గెలిచారు? అమెరికన్ మీడియా నుంచి ప్రతిదేశంలోనూ ఇప్పుడిదే ప్రశ్న! మరి కీలకమైన డిబేట్‌లో అసలు ఏ ఏ అంశాలకు చర్చకు వచ్చాయి? వాటికి అధ్యక్ష అభ్యర్థులు ఎలా స్పందించారు? ఈ చర్చ ఫలితం ప్రభావం అమెరికా ఎన్నికలపై ఎలా ఉండబోతోంది? మొత్తంగా ట్రంప్ - కమలా హారీస్‌లో ఎవరు గెలిస్తే అమెరికన్లకు ఏంటి? ప్రపంచానికేమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ కార్యక్రమంలో పొలిటియో రీసెర్చ్ ఫౌండేషన్ సంజయ్ పులిపాక, రాజకీయ వ్యూహ నిపుణుడు కె. రవికుమార్ పాల్గొన్నారు.
ట్రంప్, హారిస్ పరస్పర విమర్శలు - వాడీవేడిగా అధ్యక్ష అభ్యర్థుల డిబేట్! - US Electtions 2024
ట్రంప్-కమలాహారిస్ మధ్య అధ్యక్ష ఎన్నికల చర్చ : పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియాలో 90 నిమిషాల పాటు జరిగిన అధ్యక్ష అభ్యర్థుల చర్చలో హారిస్ మాటల తూటలకు ట్రంప్ అవాక్కయ్యారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలపై వారి వాదనను ఒకరికి ఒకరు వినిపించారు. అబార్షన్ల హక్కుపై నిర్ణయాన్ని రాష్ట్రాలకే వదిలేస్తానని ట్రంప్ పేర్కొన్నారు. ఇందుకు కమలా హారిస్ కేంద్ర ప్రభుత్వ గ్వారంటీతో అబార్షన్ హక్కును తీసుకువస్తానని తన వాదనను వినిపించింది. పన్నుల విషయంలో కూడా ఒకరికి ఒకరు వాదనలు వినిపించారు. పన్నులను గణనీయంగా తగ్గించి గతంలో మాదిరి గొప్ప ఆర్థిక వ్యవస్థను తీసుకొస్తానని ట్రంప్ తెలిపాగా, అందుకు కమలా హారిస్ మధ్య తరగతికి పన్నుల నుంచి ఉపశమనం కల్పించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. వాణిజ్యంలో మిత్ర దేశాల మోసాన్ని అడ్డుకునేందుకు దిగుమతి సుంకాలను పెంచుతానని ట్రంప్ వివరించారు. ఆరోగ్య సేవలను అందరికీ అందుబాటులో తీసుకు వచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తానని కమలా హారిస్ పేర్కొంది. రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్ధాన్ని ముగిస్తానని ట్రంప్ సృష్టం చేయగా, ప్లాస్టిక్ స్ట్రాల నిషేధంపై ముందుకు సాగతానని కమలా హారిస్ తన వాదనను వినిపించింది.
"హోరాహోరీగా అమెరికా అధ్యక్ష ఎన్నికలు - ఎవరు గెలిస్తే ఎవరికి మేలు? " - US PRESIDENTIAL ELECTIONS 2024
ఆసక్తిగా గమనించిన ప్రపంచ దేశాలు : అమెరికా అధ్యక్ష ఎన్నికలు రోజురోజుకీ హోరాహోరీగా మారుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు మాజీ అధ్యక్షుడు ట్రంప్, ప్రస్తుత అధ్యక్షుడి వారసురాలిగా దూసుకువచ్చిన కమలాహారిస్ మధ్య మాటల తూటాలు, మారుతున్నాయి. ఎన్నికలు జరిగే నవంబర్-5 వైపు కాలం వేగంగా కరిగిపోతుండడంతో ఇరుశిబిరాలు ప్రచారాన్ని పీక్స్‌కు చేర్చాయి. ఎన్నికల ఘట్టం చివరిదశలో పై చేయి కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు.