ETV Bharat / opinion

వైఎస్సార్సీపీ పెద్దల భూదందా - బినామీల భరతం పట్టేందుకు సిద్ధమైన సర్కార్​ - YSRCP Leaders Land Encroachment - YSRCP LEADERS LAND ENCROACHMENT

Pratidwani on Lands Encroachment in YSRCP Govt : గత ప్రభుత్వం విశాఖ నగరం నడిబొడ్డు నుంచి తీరప్రాంతాల వరకు వందలు, వేల ఎకరాల భూములు అడ్డదారుల్లో దోపిడీ చేశారు. రాజధాని ముసుగులో వైఎస్సార్సీపీ పెద్దల భూదందాలకు పాల్పడ్డారు. ఇప్పుడు వారి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. మరి విశాఖలో ఐదేళ్లుగా ఏం జరిగింది? వేల ఎకరాలు కొట్టేసిన భూచోళ్లు ఎవరు? అనే అంశాలపై కొత్త ప్రభుత్వం ఫోకస్​ పెట్టింది.

YSRCP Leaders Land Encroachment
YSRCP Leaders Land Encroachment (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 4, 2024, 9:43 AM IST

Pratidwani on YSRCP Leaders Land Encroachment : ఉత్తరాంధ్ర జిల్లాలో దొంగలు పడ్డారు. విశాఖ నగరం నడిబొడ్డు నుంచి జిల్లాలోని తీరప్రాంతాల వరకు వందలు, వేల ఎకరాల భూములు అడ్డదారుల్లో అప్పనంగా కొట్టేశారు. రాష్ట్ర రాజధాని ముసుగులో వైఎస్సార్సీపీ పెద్దలు, గద్దలు సాగించిన ఆ భూదోపిడీ పర్వాలన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అరాచక మాఫియా ప్రభుత్వం మారడంతో భాదితులు బయటకు వచ్చి గోడు వెళ్లబోసుకుంటున్నారు. విశాఖలో ఐదేళ్లుగా జరిగిన భూ కుంభకోణాల విలువ ఎంత? స్టీల్‌ప్లాంట్‌ను జరిపి ఏం చేద్దామనుకున్నారు? బినామీల భరతం పట్టడానికేం చేయాలి? అనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

Lands Encroachment in YSRCP Govt : పైకి కనిపిస్తున్న ఎన్సీసీ, హయగ్రీవ దందాలు ఇందులో చిన్నభాగం మాత్రమే. మాజీ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి, ఆయన ఏ2 విజయసాయిరెడ్డి, వారి అనుచరగణం కనుసన్నుల్లో జరిగిన గూడు పుఠాణీలో ప్రజలు, ప్రభుత్వ ఆస్తులకు జరిగిన నష్టం ఎంత? ఐదు సంవత్సరాలుగా విశాఖలో అసలేం జరిగింది? భూచోళ్ల భరతం పట్టడానికి కొత్తప్రభుత్వం ఏం చేస్తోంది?కబ్జాకోరులు, మాఫియాడాన్లు చేశారంటే ఏదో అనుకోవచ్చు. కానీ నాటి సీఎంవో, సీఎం, సీఎస్‌ సహా పలువురిపై ఆరోపణలు వచ్చాయి. మరి వారి ఆప్తుల పేర్లే ప్రముఖంగా కనిపిస్తుండడం ఎలా చూడాలి?

ఇంకా వెలుగుచూడని దందాలెన్నో? : విశాఖలో ఇంకా వెలుగుచూడని దందాలెన్ని ఉన్నాయి?. అసైన్డ్‌ భూములు కొట్టేసిన వారిపై ఎలాంటి చర్యలు అవసరం? విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ భూములపై కన్నేసింది ఎవరు? స్టీల్‌ప్లాంట్‌ పక్కకు జరిపి అక్కడ ఏం చేద్దామనుకున్నారు? భూదందాలు, అక్రమాల ప్రభావం విశాఖపై ఎలా పడింది? ఈ విషయంలో కొత్తప్రభుత్వం ముందున్న సవాళ్లు ఏమిటి? బినామీ లావాదేవీల నియంత్రణచట్టంతో ఏం చేయవచ్చు? రెవెన్యూ రికవరిచట్టంతో ఎలాంటి చర్యలకు అవకాశం ఉంది? వాళ్లు మింగిన వేల ఎకరాలు కక్కించడమేలా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

విశాఖ నగరం చుట్టుపక్కల 500 ఎకరాల ప్రభుత్వ భూములు కాజేశారు. భీమిలి, ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి, మధురవాడలో చెరువులు, వాగులను సైతం ఆక్రమించారు. రాణి వాద్వాన్‌కు చెందిన దస్‌పల్లా భూములు, సామాజిక సేవల కోసం కేటాయించిన హయగ్రీవ, సెయింట్‌లూక్స్‌ భూములు వైఎస్సార్సీపీ నేతల గుప్పెట్లోకి వెళ్లాయి. అంతటితో ఆగకుండా తమకు కావాల్సిన వారికి విలువైన ప్రభుత్వ భూములను తక్కువ ధరకు కట్టబెట్టారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పేరుతో విశాఖ శారదా పీఠానికి 200 కోట్ల రూపాయల విలువైన భూమిని గత పాలకులు కేటాయించారు. పేద రైతులకు చెందిన 2,000ల ఎకరాల అసైన్డ్‌ భూములను అప్పటి ప్రభుత్వ పెద్దలు కొనుగోలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి.

జగన్​ ఆడంబరాలకు ప్రజా ధనం - అయిదేళ్లు ప్రజా ఖజానాకు చిల్లు - Jagan Misused Public Money

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.