Pratidwani : జనాన్ని మోసం చేయటంలో జగన్ పార్టీ వాళ్లు మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఒక అబద్దాన్ని సృష్టించి, సొంత మీడియాలో తప్పుడు ప్రచారం చేసి తద్వారా రాజకీయంగా లబ్దిపొందటం వైసీపీకి వెన్నతో పెట్టిన విద్య. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు తిరుమలలో శ్రీవారి పింక్ డైమాండ్ గల్లంతైందని అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉందని అన్నారు. హిందువుల ఆరాధ్యదైవం శ్రీవేంకటేశ్వరుడిని కూడా స్వార్థం కోసం రాజకీయాల్లోకి లాగారు. జనం నమ్మేలా ప్రచారం చేశారు. వైసీపీ గెలిచాకా పింక్ డైమాండ్ కేసు ఏం చేశారు?
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఏ వైసీపీ నేత ఎందుకు మాట్లాడరు? ప్రజలను ఫూల్స్ చేయాలని అనుకుంటున్నారా? ఒక్కసారి మోసపోయినంత మాత్రాన పదేపదే మోసపోయేంత అమాయకులా జనం? కోడికత్తి కేసులో, వివేకా హత్యలో, గులకరాయి గొడవలో అన్నింట్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించిన వైసీపీకి గుణపాఠం చెప్పేందుకు జనం సిద్ధమా? "వైసీపీ మోసాల్లో పింక్ డైమాండ్ ఒకటి!" అనే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈ చర్చలో రాజకీయ విశ్లేషకులు సుబ్బారావు, సీనియర్ జర్నలిస్ట్ గౌతమ్ గారు పాల్గొన్నారు.
సీఎం జగన్పై రాయి దాడి కేసు - నిందితుడిని కస్టడీకి కోరిన పోలీసులు - Cm Jagan Stone Pelting Case
సరిగ్గా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ పింక్ డైమాండ్ విషయంలో ఎలాంటి తప్పుడు ప్రచారం చేసింది? ప్రజలను ఏ విధంగా మోసపుచ్చింది? 2019 ఎన్నికల్లో చంద్రబాబును అధికారం నుంచి దూరం చేసి, తాను సీఎం అవటం కోసం ప్రతిపక్షనేత జగన్ తిరుమల శ్రీవారిని కూడా రాజకీయాల్లోకి లాగారు. విజయసాయిరెడ్డి అయితే చంద్రబాబు ఇంట్లో ఆ పింక్ డైమాండ్ ఉందని ఆరోపించారు? సీఎం అయ్యాక ఆ కేసును ఎందుకు నిరూపించలేదు. సరిగ్గా గత ఎన్నికల సమయంలోనే కోడికత్తితో తనని టీడీపీ వాళ్లు చంపించబోయారని జగన్ ప్రచారం చేశారు. జగన్ సీఎం అయ్యాకా టీడీపీ వాళ్లని ఎందుకు ఆ కేసులో అరెస్ట్ చేయలేకపోయారు?
గత అసెంబ్లీ ఎన్నికలప్పుడే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. చంద్రబాబునాయుడే చంపించాడని నారాసుర రక్తచరిత్ర హెడ్డింగ్ పెట్టి సాక్షిలో చంద్రబాబు చేతిలో కత్తి పెట్టి రక్తం కారుతున్న ఫోటో వేసి ప్రజలను ఎన్నికల్లో రెచ్చగొట్టి లబ్దిపొందారు. చంద్రబాబు ప్రమేయమే లేని వాటిల్లో కూడా ఆయనపై కేసులు పెట్టిన జగన్ వివేకా హత్యకేసులో చంద్రబాబు పాత్ర ఎందుకు నిరూపించలేదు? తనే సీఎం కదా? జగన్ రాజకీయ నినాదాలనే కాదు మనుషులను కూడా వాడుకుని వదిలేస్తారు అనటానికి సొంత చెల్లెల్లే ఉదాహరణ. ప్రతి ఇంటికీ మంచి జరిగితేనే నాకు ఓటేయండి అంటున్న జగన్ తన ఇంట్లో మంచి జరగకే వాళ్ల చెల్లెళ్లు బయటకు వచ్చిన విషయం మరిచిపోయారా? సంపూర్ణ మద్యనిషేధం చేస్తా, ప్రతి ఏటా మెగా డీఎస్‌సీ ఇస్తా లాంటి హామీలిచ్చి మోసం చేసిన జగన్ నిజస్వరూపం ప్రజలు గ్రహించారా?