Pratidwani: మారిన అరాచక ప్రభుత్వంతో పాటే పద్ధతులు, విధానాలూ ఒక్కొక్కటిగా మారుతున్నాయి. దోపిడీ రాజ్యానికి చెల్లుచీటి పాడుతూ ప్రజలు, వారి అవసరాల కేంద్రంగా నిర్ణయాలు అమల్లోకి వస్తున్నాయి. ఆ సంస్కరణలు, ప్రక్షాళన క్రమంలో ఇప్పుడు ఇసుక వంతు వచ్చింది. ఎన్నికలకు ఇచ్చిన కీలకమైన హామీ మేరకు ఉచిత ఇసుక విధానం తిరిగి తీసుకుని రాబోతున్నట్లు ప్రకటించింది కూటమిప్రభుత్వం. అందుకు కావాల్సిన విధివిధానాలు ఖరారు తుదిదశకు వచ్చింది. సోమవారం నుంచి అందరికీ ఉచితంగా ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకుని వచ్చారు. దానిద్వారా ఎంతమేర భారం తగ్గుతుంది? గత ప్రభుత్వం విధానాలతో ఎంత నష్టం జరిగి ఉండొచ్చు? వంటి అంశాలపై నేటి ప్రతిధ్వని కార్యక్రమం.
అయితే గడిచిన ఐదేళ్లుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం మిగిల్చిన చేదు అనుభవాలు, సాగించిన అంతుదరి లేని దోపిడీ నేపథ్యంలో కొత్త నిర్ణయం అమలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఉపాధి, నిర్మాణరంగానికి కావాల్సిన అవసరాలు తీర్చుతునే పర్యావరణ పరిరక్షణ కోసం ఏం చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. నేటి చర్చలో గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త దండా నాగేంద్ర, విజయవాడకు చెందిన జియాలజిస్ట్, పర్యావరణవేత్త ధరణికోట వెంకటరమణ పాల్గొన్నారు.
ఉచిత ఇసుక ప్రారంభం - రూ.6 వేల ట్రాక్టర్ ఇప్పుడు రూ.1500 - Free sand policy begins from today
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుసరించిన అడ్డగోలు ఇసుక విధానం వల్ల ఉపాధి, నిర్మాణరంగాలపై తీవ్ర ప్రభావం పడింది. దీనివల్ల భారీ నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇసుక విధానాన్ని పునసమీక్షించాల్సి వచ్చింది. నూతన విధానంలో ప్రజలకు ఉచితంగా ఇసుక అందిస్తామన్న ప్రభుత్వం తవ్వకం, నిల్వ, రవాణకు అయ్యే ఖర్చులు భరిస్తే చాలంది. దానిద్వారా భారం తగ్గుతుంది.
రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఊరిలో ఇసుకను అక్రమంగా తోడేయటం వలన గత అయిదేళ్లలో పర్యావరణానికి హాని కలిగింది. అయిదేళ్లుగా జరిగిన ఇసుక అక్రమతవ్వకాలపై కేసుల్లో ప్రభుత్వం మారిన నేపథ్యంలో అసలు దొంగలు వెలుగుచూసే అవకాశం ఉంది. ఇసుక వంటి ప్రభుత్వ విధానాల్ని విమర్శలకు తావులేకుండా అమలు చేయడంలో స్థానిక, జిల్లా స్థాయి యంత్రాంగానిది కీలక పాత్ర. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇసుక విషయంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది.
ఏపీలో ఉచిత ఇసుక విధానం వచ్చేసింది- జీవో జారీ చేసిన ప్రభుత్వం - Free Sand Policy Guidelines