ETV Bharat / opinion

యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు- సీఎం సహా యంత్రాంగమంతా అహర్నిషలు కృషి - Govt Mission for save Vijayawada - GOVT MISSION FOR SAVE VIJAYAWADA

Pratidhwani : విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం తరఫు నుంచి సహాయ చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? సహాయ చర్యలపై ప్రజల స్పందన ఏమిటి? ముఖ్యమంత్రే కలెక్టరేట్‌లో మకాం వేసి పర్యవేక్షించడం, పగలు,రాత్రి అన్న తేడా లేకుండా ఆయనే నేరుగా బాధితుల వద్దకు వెళ్ళడం... బాధితులకు ఇవన్నీ ఎలాంటి భరోసాని స్తున్నాయనేది నేటి ప్రతిధ్వనిలో తెలుసుకుందాం.

govt_mission_for_save_vijayawada
govt_mission_for_save_vijayawada (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2024, 1:16 PM IST

Pratidhwani : కష్టం వచ్చినప్పుడు ప్రజలు ఎక్కడో ప్రభుత్వం కూడా అక్కడే. విజయవాడ వరద విలయంలో అదే చేస్తోంది కూటమి ప్రభుత్వం. కలెక్టరేట్‌లోనే ముఖ్యమంత్రి మకాం వేసి మరీ సహాయ చర్యలు పర్యవేక్షిస్తుంటే, సమస్త యంత్రాంగం విరామమెరగకుండా శ్రమిస్తోంది. గడిచిన ఐదారు రోజులుగా ముఖ్యమంత్రి కార్యాలయం సహా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే విజయవాడకు తరలి వచ్చింది. అన్ని శాఖల్ని సమన్వయం చేసి రాష్ట్ర వ్యాప్తంగా సిబ్బందిని రప్పించి మోహరించారు. బాధితుల్ని రక్షించి సురక్షిత ప్రాంతాలకు చేర్చడం నుంచి ఆహారం, ఔషధాల పంపిణీ వరకు మేమున్నాం, మీకేం కాదని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వరద నీరు పారుతున్న చోట్లలో సాధారణ స్థితిని నెలకొల్పేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఈ సహాయ చర్యలపై ప్రజలు ఏం అనుకుంటున్నారు బురద రాజకీయాల్ని దాటి మిషన్ విజయవాడ కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది? ఇదీ నేటి ప్రతిధ్వని. చర్చలో పాల్గొంటున్న వారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు డీవీ. శ్రీనివాస్, సీనియర్ పాత్రికేయులు ఏ సురేష్.

ముఖ్యమంత్రితో పాటే మొత్తం ప్రభుత్వం విజయవాడకు తరలి రావడంతో పాటు రాష్ట్రం మొత్తం నుంచీ సహాయ చర్యలకు సిబ్బందిని తరలిస్తున్నారు. ఇది ఎలాంటి మేలు చేస్తోంది? వరద ముంచెత్తిన మొదటి రోజు నుంచి ఈ క్షణం వరకు ప్రభుత్వం, అధికారుల స్పందనలో ఎక్కడైనా ప్రయత్నలోపం కనిపించిందా? ఇలాంటి సమయంలో ప్రజలకు ఏం అవసరం?

సింగ్​నగర్​లో మళ్లీ వరద- సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న ప్రజలు - Floods Increasing to Singh Nagar

సహాయచర్యలు ఇలా కొనసాగుతున్న సమయంలోనే సాయం చేయకపోగా నిందలేస్తారా? తప్పుడు ప్రచారం చేస్తారా అంటూ సీఎం ఆవేదన వ్యక్తం చేయడం వెనక కారణమేంటి? సాధారణంగా ఇలాంటి విపత్తులప్పుడు పార్టీలకు అతీతంగా స్పందిస్తారు. భుజంభుజం కలిపి పని చేస్తారు. విజయవాడ వరదల్లో విపక్ష వైఎస్సార్సీపీ నుంచి ఆ స్ఫూర్తి కనిపించిందా? విపత్తుల్లో క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటునే ఉన్నత స్థాయి సమీక్షలు, కేంద్రంతో అప్‌డేట్‌లో ఉండి సాయం పొందడం చాలా కీలకం. ఈ విషయంలో ప్రభుత్వం కృషి ఎలా ఉంది? ముంపు నుంచి బయట పడుతున్న బెజవాడ ప్రజలు సాధారణ జీవనంలోకి అడుగు పెట్టేందుకు ప్రభుత్వంతో పాటు పౌర సమాజం నుంచి ఎలాంటి సహాయసహకారాలు అవసరం? అనే పలు అంశాలను ఈ ప్రతిధ్వని కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం.

కార్ల ఖర్చు 'తడిసి' మోపెడు - ఆందోళనలో వాహనదారులు - Cars Damage in Flood Disaster

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.