Prathidwani on Telangana Lok Sabha Elections 2024 : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం తుది ఘట్టానికి చేరింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించాయి. అభివృద్ధి కార్యక్రమాల గురించి సంక్షేమ పథకాలపై ఈ పార్టీలు భారీగా హామీలిచ్చాయి. స్థానిక, ప్రాంతీయ, జాతీయ అంశాలపై హోరాహోరీగా ప్రచారాలు చేశాయి. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు ఏఏ అంశాలను ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి? ఏ పార్టీకి ఏఏ అంశాలు ఓట్లు రాలుస్తాయి? తెలంగాణ, లోపలా బయటా రాజకీయ ముఖచిత్రం ఎలా ఉంది? రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల్లో పార్టీల ప్రచార సరళి ఎలా కొనసాగింది? కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రచార వ్యూహాలు అమలు చేసింది? ఆ పార్టీ తాను అనుకున్న లక్ష్యాన్ని ఎంత వరకు చేరుకుంటుంది? ఏఏ అంశాలకు ప్రచారంలో ప్రాధాన్యం లభించింది?. బీఆర్ఎస్ ప్రచార వ్యూహాలు ఎలా సాగాయి? ర్యాలీలు, సభల్లో ఆ పార్టీ నేతల ప్రసంగాలు ఇచ్చిన సందేశం ఏంటి? బీఆర్ఎస్ నేతలు గెలుస్తామని అనుకుంటున్న నంబర్‌ను చేరుకుంటుందా?. బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలు ఎలా ఉన్నాయి? ఈ పార్టీ ఏఏ అంశాలపై దృష్టి సారించింది? గెలుపుపై బీజేపీ అంచనాలు ఎలా ఉన్నాయి? వాటిని ఎంతవరకు చేరుకుంటుంది? ఈ విషయాలపై నేటి ప్రతిధ్వని.
- " class="align-text-top noRightClick twitterSection" data="">