Prathidwani : ప్రపంచ దేశాలను ఆకర్షిస్తున్నాయి అమెరికా ఎన్నికలు. రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల్లో ఎవరు గెలిస్తే ఎవరికి ఏంటనే లెక్కలు ఆసక్తికరంగా మారాయి. తాజా అంచనాల ప్రకారం రిపబ్లికన్ వైపు నుంచి టెంపరి ట్రంప్, డెమోక్రట్ల నుంచి కమలా హారీస్ తలపడుతున్నట్టు కనిపిస్తోంది. ట్రంప్‌ను ఢీకొనే సత్తా భారత సంతతి సక్సెస్‌ఫుల్ & పవర్‌ఫుల్ లీడర్, ఉపాధ్యక్షురాలు కమలాహారీస్‌కే ఉందని డెమెక్రట్లంతా ముక్తకంఠంతో చెబుతున్నారు. ట్రంప్ మాత్రం ఆమె బైడెన్ కంటే దారుణం అంటూ పంచ్‌లు విసురుతున్నారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల పాత్ర, ప్రభావం ఏ విధంగా ఉండనుంది? ఎవరు గెలిస్తే భారత్‌కు ఏం ప్రభావం ఉంటుంది? ఇదీ నేటి ప్రతిధ్వని అంశం. నేడు మనతో చర్చలో పాల్గొంటున్న వారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణురాలు డా. రాధ రఘురామపాత్రుని, శరత్‌చంద్ర ఐఏఎస్ అకాడమీ శరత్‌చంద్ర.
కమలా హారిస్‌కు ఒబామా దంపతుల మద్దతు- ఇక లైన్ క్లియరే! - US Election 2024
కాగా, అమెరికాలో ఇటీవల రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ కాల్పుల్లో మాజీ అగ్నిమాపక సిబ్బంది కోరీ కంపెరాటోర్, తన కుటుంబాన్ని కాపాడుకొనే క్రమంలో గన్‌మెన్ తూటాకు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జరిగిన ఓ బహిరంగ సభలో ట్రంప్ అతడిని గుర్తు చేసుకుంటూ ప్రత్యేకంగా నివాళులర్పించారు.
'యుద్ధానికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలి'- నెతన్యాహుతో భేటీ వేళ ట్రంప్ కీలక కామెంట్స్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఖరారయ్యారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా స్వయంగా కమలా హారిస్ వెల్లడించారు. తన అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించే దరఖాస్తుపై సంతకం చేసినట్లు కమలా హరిస్ తెలిపారు. ప్రతి ఓటును సంపాదించడానికి కృషి చేస్తానని అన్నారు. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో నవంబర్‌లో ప్రజాబలంతో నడుస్తున్న ప్రచారమే గెలుస్తుందని ఎక్స్ వేదికగా వ్యాఖ్యనించారు.