Prathidwani : ‘వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి'. అంటే బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. శ్రీనివాసుడికి సమానమైన దేవుడు భూత, భవిష్యత్తు కాలాల్లో ఎవరూ లేరని శ్లోకానికి అర్థం. భక్తుల విశ్వాసం. కోట్లాది భక్తుల విశ్వాసంతో గత వైసీపీ ప్రభుత్వం ఆటలాడుకుంది. ఇష్టారాజ్యంగా సేవల ధరలు పెంచేయండని ధర్మకర్తల మండలిలో నాటి టీటీడీ ఛైర్మన్ చేసిన వ్యాఖ్యలు కలచివేశాయి. శ్రీవారు కొలువున్న కొండను వైఎస్సార్సీపీ సర్కారు కుటిల రాజకీయాలతో కలుషితం చేసింది. సేవల్లో లోపాలతో భక్త కోటి బాధలు పడింది. ఇప్పుడు ప్రభుత్వం మారింది. తిరుమల పవిత్రతను కాపాడే ప్రభుత్వం వచ్చింది. ఈ నేపథ్యంలో కొండపై తీసుకురావాల్సిన సంస్కరణలు ఏవి? భక్తులు ఏం ఆశిస్తున్నారు? ఇదీ నేటి ప్రతిధ్వని. ఈ కార్యక్రమంలో ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీ శ్రీనివాసానంద సరస్వతీ స్వామి, శ్రీవారి భక్తజన ప్రతినిధి నవీన్‌కుమార్‌రెడ్డి పాల్లొన్నారు.
రూముల ధరలు, సేవల ధరలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా పెంచేసిందని, తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చేశారని, దీనివల్ల గత ఐదేళ్లుగా భక్తులు చాలా ఇబ్బందులు పడ్డారని ప్రముఖులు తెలిపాారు. గత అయిదేళ్లలో తిరుమల వెళ్లివచ్చిన భక్తులు అంతా ఒకేమాట చెప్తున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాకా ఎందుకో మాకు గతంలో ఉన్నంత పవిత్రభావన కలగట్లేదు అని చాలామంది అంటున్నారు.
టీటీడీ బోర్డు ఛైర్మన్లుగా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి వీరిరువురి వ్యవహారశైలి పైనా అనేక సందర్భాల్లో విమర్శలు వచ్చాయి. టీటీడీ ఈవోగా వ్యవహరించిన ధర్మారెడ్డి తిరుమల శ్రీనివాసుడి కంటే జగన్‌కు విధేయతతో పనిచేశారని విమర్శలు ఉన్నాయి.
ఈమధ్య ఒక పీఠాధిపతి మాట్లాడుతూ నాడు జగన్ సీఎం అవటం కోసం, తర్వాత చంద్రబాబు సీఎం అవ్వాలనీ, మోడీ పీఎం కావాలని పూజలు చేశానని చెప్పారు. పీఠాధిపతుల ప్రథమ కర్తవ్యం ఎవర్ని ఏ పదవులో కూర్చోపెట్టాలనా లేక హిందూ ధర్మపరిరక్షణా?
గత అయిదేళ్లలో తిరుమలలో ఏం జరిగింది? హిందువుల మనోభావాలు ఎలా దెబ్బతిన్నాయి? మీవంటి సాధువులు ఎంత ఆందోళన చెందారు? గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం రెండు టీటీడీ పాలకమండళ్లను నియమించింది? ఆ నియామకాలు సాగిన తీరెలా ఉంది? నిజంగా స్వామి వారు ఆ పాలకమండలిని చూసి సంతోషించి ఉంటారా? అలిపిరి దగ్గర మందుపాతర పేలితే తనకు శ్రీనివాసుడే ప్రాణభిక్ష పెట్టారని సీఎం చంద్రబాబు చాలా సందర్భాల్లో చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నూతన సీఎం ప్రక్షాళన చేయాలంటే మీరు వారికి చేసే సూచనలేంటి?
హిందూ ఆలయాలపై పదేపదే దాడులు - మరోసారి వైసీపీ వస్తే పరిస్థితి ఏంటి? - Attacks on Hinduism in AP