ETV Bharat / opinion

కూటమి చేతిలో జగన్ ఓటమి ఖాయమా?- అందుకే ప్రలోభాల పర్వం ప్రారంభించారా?

Prathidwani Debate: ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి చేతిలో ఓటమి ఖాయం అనే భయం అధికార పార్టీని వెంటాడుతోందా? అందుకేనా ఎన్నికల షెడ్యూల్‌కు ముందే వలంటీర్లతో ప్రలోభాలకు తెరలేపారు. ఇంత చేస్తున్నా సరే ప్రజాగ్రహాన్ని తప్పించుకోవటం వైసీపీకి సాధ్యమేనా? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.

Prathidwani Debate
Prathidwani Debate
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 12, 2024, 1:09 PM IST

Prathidwani Debate: కూటమి చేతిలో ఓటమి ఖాయం అనే భయం వైసీపీను ఆవహించిందా? ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ప్రలోభాల పర్వం అందుకేనా? వలంటీర్లను శిఖండుల్లా ఎందుకు వాడుతున్నట్టు? అడ్డదారిలో గెలవటం కోసం కాదా? ఇంటింటికీ తాయిలాలు పంచుతూ ఓట్ల కొనుగోలు ఎందుకు చేస్తున్నట్టు? జగన్‌పై నమ్మకం లేదా? జనాగ్రహం ఎగిసిపడుతోందని గ్రహించారా? కుక్కర్లు పంచినంత మాత్రాన జనం కుక్కిన పేనుల్లా పడుంటారా? ‘ఓటు అనే ఆయుధంతో పోరాడుతావో, నోటు అనే వ్యసనంతో మరణిస్తావో’ తేల్చుకో అని ఓ కవి అన్నట్టుగా ఇప్పుడు ప్రజలు తమ ఆత్మాభిమానాన్ని అమ్ముకుంటారా? ఐదేళ్లుగా చేసిన అరాచకాలను అంత త్వరగా మరిచిపోగలరా? ఇదీ నేటి ప్రతిధ్వని కార్యక్రమం. నేటి చర్చలో రాజకీయ విశ్లేషకులు ఎ.రాజేష్‌, వాలంటీర్ల వ్యవస్థపై పిటిషనర్‌ షేక్ అబూబకర్ సిద్దిఖ్​లు పాల్గొన్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఏపీలో ప్రలోభాలకు పాల్పడుతున్నారని మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ సైతం అన్నారు. కేవలం డబ్బులు మాత్రమే కాకుండా ప్రెషర్ కుక్కర్లు వంటి గృహోపకరణాలు సైతం పంపిణీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ రాలేదు అనే సాంకేతిక కారణంతో చర్యలు తీసుకోవడానికి ఎన్నికల సంఘం ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోందని చెప్పారు. అయితే ఇది సరైనది కాదన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్, దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు.

వైసీపీ మంత్రులు తమ శాఖలకు ఏం న్యాయం చేశారు? - వారికి ఎన్ని మార్కులు వేయవచ్చు?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పిన వ్యాఖ్యలు అక్షర సత్యమని రాజకీయ విశ్లేషకులు ఎ.రాజేష్‌ అన్నారు. వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి ఎన్నికల వ్యవస్థని అపహాస్యం చేశారని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలను చేస్తున్నారని చెప్పారు. దొంగ ఓట్లను చేర్చడం, అర్హులైన వారిని జాబితా నుంచి తొలగించడం చేస్తున్నారన్నారు.

అదే విధంగా మతాన్ని అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో ఓట్లు అడగకూడదనే నిబంధనను వైసీపీ ఎలా ఉల్లంఘిస్తోందో అనేది సిటిజన్స్ ఫర్‌ డెమోక్రసీ తెలిపింది. అధికారులను ఉపయోగించుకుని మతం పేరుతో ఓట్లు అడుగుతున్నారని పేర్కొన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు.

మహిళలపై నేరాల్లో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలిపిన జగన్‌కు ఎందుకు ఓటేయాలి?

మద్యం అమ్మకాల ద్వారా వేలకోట్ల రూపాయల నగదును ఏం చేసింది ప్రభుత్వం అనే దానిపై ఇప్పటిదాకా స్పష్టమైన సమాధానం రాలేదని, ఎన్నికల్లో ఖర్చు చేయటానికి నియోజకవర్గాలకు తరలించారు అనేది వాస్తవం అని రాజకీయ విశ్లేషకులు ఎ.రాజేష్‌ తెలిపారు. మద్య నిషేదం అని చెప్పి దానిని అమలు చేయలేదని, అదే విధంగా మద్యం షాపులలో కేవలం నగదు లావాదేవీలు మాత్రమే చేస్తున్నారని అన్నారు. ఇందులో పెద్ద మొత్తంలో నగదు చేతులు మారుతున్నట్లు స్పష్టం అవుతుందని చెప్పారు.

ఎన్నికల సంఘం చెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెట్టి మరీ అధికార వైపీపీ వలంటీర్లను వాడుతోంది. అదే విధంగా దొంగ ఓట్లు చేర్చారు. ప్రతిపక్షాల ఓట్లు తీసేసారు. ఇప్పుడు నోట్లతో ఓట్లను కొనాలని చూస్తున్నారు. ఎందుకు జగన్ పార్టీ ఇన్ని అడ్డదారులు తొక్కుతోంది? వైసీపీకు ఎందుకంత భయం పట్టుకుంది? ఇలా ప్రలోభపెట్టినంత మాత్రాన జనం లొంగిపోతారని అనుకుంటున్నారా? ఈ ఐదేళ్ల పాలనలో పడ్డ కష్టాలు మరిచిపోతారా? ఇలా పలు ప్రశ్నలకు చర్చలో పాల్గొన్న వక్తలు సమాధానాలు ఇచ్చారు. పూర్తి వీడియో పైన లింక్​పై క్లిక్ చేసి చూడండి.

ఎన్నికలకు ముందే జగన్​ ఓటమిని అంగీకరించారా ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.