Prathidwani : 2019లో జగన్ సీఎం అయిన దగ్గర్నుంచి పేదలు ఉసూరుమంటున్నారు. బటన్ నొక్కిన దాని కంటే ప్రభుత్వం బొక్కిందే ఎక్కువ. ఇచ్చిన దానికంటే లాక్కుందే ఎక్కువ. గత ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తే ఆ వ్యవస్థను నాశనం చేశారు. ఫలితంగా రాష్ట్రంలో భవన నిర్మాణాలు నిలిచిపోయి లక్షలమంది కూలీలు అల్లాడిపోయారు. చిన్న పరిశ్రమలు మూతపడి కార్మికులు రోడ్డున పడ్డారు. పరిశ్రమలు రాక, వ్యాపారాలు లేక, రహదారులు కానరాక బడుగు జీవులు నానాకష్టాలు పడుతున్నారు.
అడ్డా కూలీలు, కార్పెంటర్లు, చిరు వ్యాపారులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లూ అందరూ లబోదిబో అంటున్నారు. ఉన్న ఊరు వదిలి వలసలు పోతున్నారు. జగన్‌కు ఓటేసిన వారంతా చెంపలేసుకుంటున్నారు. ఐదేళ్ల జగన్ పాలన పేదలకు శాపంగా ఎలా మారిందో నేటి ప్రతిధ్వనిలో చర్చిద్దాం. ఈ చర్చలో సెంటర్ ఫర్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ నర్సింగరావు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య పాల్గొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
CM Jagan Neglect Building Construction Labours in AP : సీఎం జగన్ రాజధానుల పేరిట ఆడిన మూడు ముక్కలాటలో స్థిరాస్తి రంగం కుదేలైంది. ఆ ఆటలో భవన నిర్మాణ కార్మికులు సమిధలయ్యారు. గత ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవడం మొదలు కార్మికుల జీవనోపాధిని నాశనం చేయడమే లక్ష్యమన్నట్లుగా జగన్ పనిచేశారు. నూతన ఇసుక విధానం పేరిట రీచ్‌లను మూసివేసి ఇసుక అందుబాటులో లేకుండా చేశారు. దీంతో ఒక్కసారిగా నిర్మాణాలు ఆగిపోయి కార్మికులకు నెలల తరబడి ఉపాధి కరవైంది. ఒకటి, రెండు రోజులు పనులు దొరక్కపోతేనే పూట గడవని కుటుంబాలు కొన్ని నెలలపాటు అల్లాడిపోయాయి. ఇంటి అద్దెలు, వైద్యం, పిల్లల ఫీజులు, రోజువారీ ఖర్చులు భారంగా మారి అప్పులపాలయ్యారు. అంతలోనే వచ్చిన కరోనాతో వారి పరిస్థితి మరింత దిగజారింది.
రాజధానుల పేరిట జగన్ మూడు ముక్కలాట - బలైన భవన నిర్మాణ కార్మికులు - CM Jagan Neglect Labours
భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. రాజధాని ప్రాంతంలో భవనాలు నిర్మించేందుకు అప్పులు చేసి, స్థలాలు కొని, నిర్మాణాలు చేపట్టిన వారు వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. కొత్త ఇసుక విధానం పేరుతో అయిదు నెలలపాటు ఇసుక రీచ్‌లను బంద్ చేశారు. జగన్ సర్కార్ 2019 సెప్టెంబరు 5 నుంచి నూతన ఇసుక విధానం తెచ్చింది. అప్పుడు నదుల్లో నీరు ఉండడంతో ఇసుక లభ్యం కాలేదు. దీంతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయి నిర్మాణ రంగం ఉక్కిరిబిక్కిరైపోయింది.
బలైపోయింది ఎవరు? : సీఎం జగన్ నూతన ఇసుక విధానం వల్ల రాష్ట్రంలో తాపీ మేస్త్రీలు, కూలీలు, రాడ్ బెండింగ్ మేస్త్రీలు, సెంట్రింగ్, సామగ్రి మోసే కార్మికులు, సీలింగ్ పనిచేసేవారు, ఎలక్ట్రిషియన్లు, వడ్రంగులు, ప్లంబర్లు, టైల్స్ వేసేవారు, పెయింటర్లు, కంకర, ఇటుకలు, ఇసుక మోసే కార్మికులు తీవ్రంగా నష్టపోయారు.
50 లక్షల మందిని హింసించారు : రాష్ట్రంలోని 59 రంగాల్లో పనిచేసే కార్మికులు తమ పేర్లను సంబంధిత శాఖలో నమోదు చేసుకుంటారు. ఇలా నమోదు చేసుకున్న కార్మికులు 19.46 లక్షల మంది ఉన్నారు. నమోదు చేసుకోని వారి సంఖ్య దీనికి రెట్టింపు ఉంటుంది. ఈ లెక్కల ప్రకారం సుమారు 50 లక్షల మంది ఉంటారని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. నిర్మాణ రంగంపై పరోక్షంగా ఆధారపడిన లారీ, ఆటో, ట్రాలీల డ్రైవర్లు, వాటి యజమానులు, నిర్మాణ సామగ్రి విక్రయించే దుకాణదారులు, వాటిలో పని చేసేవారు, భవన నిర్మాణ కార్మికులు, తాపీ మేస్త్రీలు, రాడ్ బెండింగ్, సెంట్రింగ్, ఎలక్ట్రిషియన్, ప్లంబర్, టైల్స్ మేస్త్రీలు, రంగులు వేసేవారు ఇలా అనేక వర్గాల చెందిన లక్షల మంది సీఎం జగన్ పాలనలో నష్టపోయారు.