ETV Bharat / offbeat

తెచ్చిన కొన్ని రోజులకే "గోధుమ పిండి"కి పురుగు పడుతోందా? ఈ టిప్స్​ పాటిస్తే ఎక్కువ రోజులు తాజాగా! - HOW TO STORE FLOUR LONG TERM

-ఒక్కసారే ఎక్కువ మొత్తంలో గోధుమ పిండి కొనుగోలు చేస్తున్న ప్రజలు -ఈ టిప్స్​ పాటిస్తే ఎక్కువ రోజులు ఫ్రెష్​గా ఉంటుందట!

Wheat Flour Storage Tips
Wheat Flour Storage Tips (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 29, 2024, 12:48 PM IST

Wheat Flour Storage Tips: చాలా మంది ఇళ్లల్లో బ్రేక్‌ఫాస్ట్‌, డిన్నర్‌లో చపాతీలను ఆహారంగా తీసుకుంటుంటారు. ఇక చపాతీలు చేయాలంటే గోధుమ పిండి కావాల్సిందే. అయితే ఒకప్పుడు గోధుమల్ని కొని శుభ్రం చేసి.. ఎండ బెట్టి మర ఆడించి పిండి సిద్ధం చేసుకునేవారు. కానీ, నేటి ఉరుకుల పరుగుల జీవితంలో అంత ఓపిక లేకపోవడంతో మార్కెట్​ నుంచి ఒకేసారి కేజీల కొద్ది పిండి తీసుకువచ్చి ఇంట్లో నిల్వ చేసుకుంటున్నారు. అయితే, ఈ క్రమంలో కొన్నిసార్లు పిండి పురుగులు పట్టడం మనం గమనిస్తుంటాం. దీంతో కొద్దిమంది పారబోస్తే.. మరికొద్దిమంది పిండిని జల్లించి చపాతీలు చేస్తుంటారు. అయితే, కొన్ని టిప్స్​ పాటించడం వల్ల గోధుమ పిండికి పురుగుల పట్టకుండా ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉండేలా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు మీ కోసం..

గాలి చొరబడని డబ్బాలో : గోధుమ పిండిని నిల్వ ఉంచే డబ్బా మూత వదులుగా ఉంటే గాలి తగులుతుంది. దీనివల్ల పిండికి పురుగులు పడతాయి. కాబట్టి, గోధుమ పిండిని ఎయిర్​టైట్​ కంటైనర్లో స్టోర్​ చేయమంటున్నారు. అయితే, పిండిని గాలి చొరబడని డబ్బాలో ఉంచినా సరే.. అప్పుడప్పుడూ తీసి కాసేపు ఎండలో ఉంచాలని.. ఇలా చేయడం వల్ల పిండిలో బ్యాక్టీరియా నశించిపోతుందంటున్నారు.

లవంగాలు, బిర్యానీ ఆకులు : సాధారణంగా లవంగాలు, బిర్యానీ ఆకులను మనం బిర్యానీలు, నాన్​వెజ్​ వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటాం. అయితే, వీటిని మనం గోధుమ పిండి స్టోర్​ చేసే డబ్బాలో వేయడం వల్ల పురుగులు పట్టకుండా చూసుకోవచ్చని.. అలాగే పిండి ఎక్కువ రోజులు తాజాగా ఉంటుందని సూచిస్తున్నారు.

ప్యాకెట్లో ఉంచకండి : ఎక్కువ మంది గోధుమ పిండిని కావాల్సినంత తీసుకుని మిగిలిన దానిని ప్యాకెట్​లోనే ఉంచుతుంటారు. ఇలా చేయడం వల్ల కొన్ని రోజులకే పిండికి పురుగు పడుతుందని అంటున్నారు. అలా కాకుండా ఉండాలంటే పిండిని డబ్బాలో నిల్వ చేయమంటున్నారు.

వేరువేరు డబ్బాలో : కొంతమంది తెలిసో తెలియకో నిల్వ ఉంచిన గోధుమ పిండిలో.. కొత్తగా తీసుకొచ్చిన పిండిని కలుపుతుంటారు. దీనివల్ల మొత్తం పిండి పురుగు పట్టే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి, పాత పిండిని పూర్తిగా ఉపయోగించడం లేదా రెండింటినీ వేరువేరు డబ్బాలో నిల్వ ఉంచడం చేయాలని సలహా ఇస్తున్నారు.

తేమ లేకుండా చూడండి : గోధుమ పిండి నిల్వ ఉంచే డబ్బాని కడిగిన తర్వాత తేమ లేకుండా పొడి వస్త్రంతో పూర్తిగా తుడవండి. ఆపై పిండిని నిల్వ ఉంచండి. అయితే, పిండిని నిల్వ ఉంచడం కోసం ప్లాస్టిక్​ డబ్బాలకు బదులుగా.. వీలైతే గాజు సీసాలను ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

కూరగాయల్ని పెద్ద ముక్కలుగా కట్ చేసినా - కర్రీపై మూత పెట్టకపోయినా సమస్యే - ఆరోగ్యానికీ ముప్పేనట!

పిండి చేత్తో కలపకుండా, కర్రతో రుద్దకుండా - సూపర్​ సాఫ్ట్​గా "చపాతీలు" రెడీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.