ETV Bharat / offbeat

మీ ఇంట్లో వుడెన్ ఫర్నీచర్స్​​ ఉన్నాయా ? - ఈ టిప్స్​ పాటిస్తే చెదలు పోవడంతో పాటు కొత్తవాటిలా మెరుస్తాయి! - Wooden Furniture Safety Tips

author img

By ETV Bharat Features Team

Published : Sep 2, 2024, 2:35 PM IST

Wooden Furniture Safety Tips: ఇంటిని అందంగా మార్చడానికి చెక్కతో చేసిన డైనింగ్​ టేబుల్, సోఫా సెట్లు, డ్రెస్సింగ్​ టేబుల్​ వంటి ఖరీదైన ఫర్నీచర్స్​​ కొంటుంటారు చాలా మంది. అయితే వీటిని కొనడం ఒక ఎత్తైతే.. వాటిని జాగ్రత్త చేయడం మరో ఎత్తు. ఎందుకంటే, వర్షాకాలంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కూడా అవి చెదలు పట్టే అవకాశం ఉంటుంది. అయితే, వీటికి చెదలు పట్టకుండా ఎటువంటి టిప్స్​ పాటించాలో ఇప్పుడు చూద్దాం.

Wooden Furniture Safety Tips
Tips To Save Wooden Furniture From Termites (ETV Bharat)

Tips To Save Wooden Furniture From Termites : ఇంట్లో చెక్కతో చేసిన ఫర్నీచర్ ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది. ఇవి ఇంటిని అందంగా, ఆకర్షనీయంగా కనిపించేలా మార్చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చాలా మంది ఎన్నో వేల రూపాయలు ఖర్చుచేసి ఎంతో ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. అయితే, వర్షాకాలంలో గాలిలోని అధిక తేమ కారణంగా ఖరీదైన ఈ ఫర్నీచర్​ చెదలు పట్టే అవకాశం ఉంటుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సరే చెక్క ఫర్నీచర్​ పూర్తిగా పాడైపోతుంది. అయితే, ఈ సీజన్​లో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల ఫర్నీచర్​ చెదలు పట్టకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్​ ఏంటో చూసేయండి..!

క్లీన్​ చేయండి: రోజూ ఏదోక విధంగా ఇంట్లో ఉండే సోఫా సెట్​, డైనింగ్​ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్​ వంటి వాటిపై దుమ్ము ధూళీ పడుతుంటుంది. వీటిని క్లీన్​ చేయకపోతే ఫర్నీచర్​ పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకే వారానికి రెండుమూడుసార్లు ఫర్నీచర్​ క్లీన్​ చేయాలి. ఇందుకోసం, చిన్న గిన్నెలో నీళ్లను తీసుకుని అందులో కొద్దిగా వెనిగర్​ కలపండి. ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో పోసుకుని ఫర్నీచర్​పై స్ప్రే చేసి.. పొడి వస్త్రంతో తుడవండి. ఇలా చేస్తే ఫర్నీచర్​ చెదలు పట్టకుండా ఉండడంతో పాటు, డస్ట్​ తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

2012లో 'జర్నల్ ఆఫ్ ఎంటమోలాజికల్ సైన్స్'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. వెనిగర్.. చెద పురుగులను నివారించడంలో సమర్థవంతంగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో దక్షిణ కొరియాలోని జియోంగ్‌సాంగ్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన 'డాక్టర్‌ చాంగ్-యోంగ్ ఓ' పాల్గొన్నారు. చెద పురుగులను నివారించడంలో వెనిగర్‌ బాగా పని చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

వేప నూనె : చెద పురుగులను నివారించడంలో వేప నూనె కూడా ప్రభావవంతంగా పని చేస్తుందని అంటున్నారు. ముందుగా వేప నూనెను ఒక స్ప్రే బాటిల్‌లో పోసుకుని చెదలు పట్టిన చోట స్ప్రే చేయండి. లేకపోతే ఒక పొడి వస్త్రంపై కొద్దిగా వేప నూనెను పోసి చెదలున్న చోట రాయొచ్చు. ఇలా చేస్తే.. చెద పురుగులను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ స్ప్రేని కిటికీలు, తలుపులు, గది మూలల్లో స్ప్రే చేయడం వల్ల దోమలు, కీటకాలు రాకుండా ఉంటాయట.

ఈ జాగ్రత్తలు కూడా:

కవర్​ చేయండి : మనం కొత్తగా ఫర్నీచర్​ ఏదైనా కొన్నప్పుడు దానిపై ప్లాస్టిక్​ కవర్స్ వేసి అమ్ముతుంటారు. అయితే, చాలా మంది అందంగా కనిపించడం లేదని ఫర్నీచర్​పై ఉండే కవర్స్​ని పూర్తిగా తొలగిస్తుంటారు. కానీ, మీరు ఇలా చేయకండి. ఫర్నీచర్​పై కవర్లు ఉండడం ద్వారా ఎక్కువ కాలం పాటు కొత్తవాటిలా కనిపిస్తాయి. అలాగే మరకలు పడకుండా చూసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

సన్​లైట్​కి దూరంగా: సూర్యకాంతి నేరుగా ఫర్నీచర్​పై పడకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సన్​లైట్​ పడడం ద్వారా ఫర్నీచర్​పై ఉండే పేయింట్​ మెల్లిగా పోతుందని.. దీనివల్ల ఖరీదైన ఫర్నీచర్​ పాడైపోయే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి, ఇంట్లోని సోఫా సెట్లు, టేబుళ్లను సూర్యకాంతి లేని ప్రదేశంలో ఉంచమని సలహా ఇస్తున్నారు.

నీళ్లు, షాంపూ : మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొన్నిసార్లు డైనింగ్​ టేబుల్​పై కూరల మరకలు పడుతుంటాయి. అలాగే చెక్కతో చేసిన ఫర్నీచర్​, టేబుళ్లపై జిడ్డు మరకలు ఏర్పడుతుంటాయి. వీటిని తొలగించడానికి ఒక గిన్నెలో నీటిని తీసుకుని షాంపూ కలపండి. తర్వాత పొడి వస్త్రాన్ని ఈ మిశ్రమంలో ముంచి ఫర్నీచర్​ని క్లీన్​ చేయండి. ఇక్కడ మీరు షాంపూకి బదులుగా నిమ్మరసం కూడా ఉపయోగించవచ్చు. ఇలా చేస్తే ఫర్నీచర్​పై మరకలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి :

చెద పురుగులు ఇంటిని గుల్ల చేస్తున్నాయా ? - ఈ నేచురల్​ టిప్స్ పాటిస్తే ప్రాబ్లమ్​ ఇట్టే సాల్వ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.