How To Make Healthy Sprouts Poha Recipe: కొంతమంది పోషకాలు పుష్కలంగా ఉండే మొలకలను (స్ప్రౌట్స్) తినడానికి ఇష్టపడతారు. అలా అని రోజూ అవే తినాలంటే కాస్త ఆలోచిస్తారు. అలాంటి వారు ఇలా వెరైటీగా ప్రిపేర్ చేసుకున్నారంటే ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా ఇది బరువు(Weight) తగ్గాలనుకునేవారికి, సింపుల్‌గా అయిపోయే హెల్దీ టిఫెన్ కోరుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది. అదే.. "హెల్తీ స్ప్రౌట్స్ పోహా". మరి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్ధాలు :
- అటుకులు - ఒకటిన్నర కప్పు
- మొలకలు - అర కప్పు
- నూనె - 3 టేబుల్‌స్పూన్లు
- పల్లీలు - 3 టేబుల్‌స్పూన్లు
- పచ్చిమిర్చి - 2
- ఉల్లిపాయ తరుగు - పావు కప్పు
- క్యారెట్ తరుగు - పావు కప్పు
- క్యాప్సికం తరుగు - పావు కప్పు
- టమాట తరుగు - పావు కప్పు
- ఫ్రోజెన్ బఠాణీ - పావు కప్పు
- ఆవాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- ఎండుమిర్చి - 2
- కరివేపాకు రెమ్మలు - 2
- పసుపు - పావు టీస్పూన్
- రుచికి సరిపడా - ఉప్పు
- పంచదార - పావు టీస్పూన్
- వాటర్ - 4 టేబుల్‌స్పూన్లు
- కొత్తిమీర - కొద్దిగా
- నిమ్మరసం - 1 టేబుల్‌స్పూన్
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, క్యాప్సికం, టమాటాలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ముందుగానే మొలకలనూ ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- అయితే, ఇక్కడ మేము పెసలు, ఉలవలు, శనగలు.. వంటి మిక్స్డ్ స్ప్రౌట్స్ తీసుకున్నాం. మీరూ అవే తీసుకోవాలని లేదు.. మీకు నచ్చిన మొలకలు వాడుకోవచ్చనే విషయాన్ని గమనించాలి.
- అనంతరం జల్లెడలో మందంగా ఉండే అటుకులను తీసుకొని జల్లించుకోవాలి. ఇలా చేయడం వల్ల అందులో ఏమైనా రవ్వ ఉంటే సెపరేట్ అవుతుంది. ఆ తర్వాత వాటిని పూర్తిగా తడిపి కాసేపు జల్లెడలోనే అలా వదిలేయాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త హీట్ అయ్యాక పల్లీలు వేసుకొని మంటను మీడియంలో ఫ్లేమ్ ఉంచి అవి చిట్లే వరకు వేయించుకోవాలి. ఆపై అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి కాసేపు వేయించుకోవాలి.
- ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసుకొని ఆనియన్స్ మెత్తబడే వరకు మగ్గించుకోవాలి.
- అప్పుడు అందులో క్యారెట్, క్యాప్సికం తరుగు వేసి మరో మూడు నిమిషాల పాటు మిశ్రమాన్ని వేయించుకోవాలి.
- ఆ విధంగా వేయించుకున్నాక.. ఆ మిశ్రమంలో టమాట తరుగు, పసుపు, రుచికి తగినంత ఉప్పు, బఠాణీలు, మిక్స్డ్ స్ప్రౌట్స్.. ఇలా ఒక్కొక్కటిగా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై మూతపెట్టి 3 నుంచి 4 నిమిషాల పాటు మగ్గించుకోవాలి.
- ఆ తర్వాత మూత తీసి అందులో తడిపి పక్కన పెట్టుకున్న అటుకులు వేసి చిదిరిపోకుండా బాగా టాస్ చేసుకోవాలి.
- అనంతరం కాస్త చక్కెర వేసి కలుపుకోవాలి. అయితే, బరువు తగ్గాలనుకునేవారు పంచదారను స్కిప్ చేయొచ్చు. ఆ తర్వాత పాన్ అంచుల వెంట వాటర్ పోసుకొని కదపకుండా మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మంట మీద 4 నుంచి 5 నిమిషాల పాటు స్టీమ్ కుక్ చేసుకోవాలి.
- ఈ విధంగా చేయడం వల్ల రెసిపీలో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పోహాకు పడుతాయి. అలాగే.. అటుకులు సరిగా లోపలిదాకా ఉడుకుతాయి. పైగా టేస్ట్ రుచికరంగా ఉంటుంది.
- ఆవిధంగా ఉడికించుకున్నాక.. స్టౌ ఆఫ్ చేసి పాన్ పై మూత తీసి కాస్త నిమ్మరసం వేసి, కొత్తిమీర తరుగు చల్లి దించుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే 'హెల్తీ స్ప్రౌట్స్ పోహా' రెడీ!
ఇవీ చదవండి :
బరువు తగ్గాలా? - మీ బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ డ్రై ఫ్రూట్స్ చేర్చుకుంటే బెస్ట్ రిజల్ట్!
తెలుగు వారికి ఎంతగానో నచ్చే సేమియా ఉప్మా - పొడి పొడిగా ఇలా చేసేయండి - పిల్లలు ఇష్టంగా తినేస్తారు!