Doodh Well water In karimnagar : కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి కాలంలో తెలంగాణలోని కరీంనగర్ జిల్లా మొలంగూర్‌లో కోట నిర్మాణం పూర్తికాగా.. ఆ కోట ప్రవేశద్వారం ఎదురుగా పూర్తి రాతి ట్టడంతో నిర్మితమైన దూద్‌బావి నీటి గురించి గొప్పగా చెప్పుకుంటారు ప్రజలు. ఇప్పటికీ ప్రజలు, చరిత్రకారులకు ఆ దూద్‌బావిలో నీరు తెల్లగా పాల మాదిరిగా ఉండటానికి కారణమేమిటో ప్రశ్నార్థకంగానే మిగిలింది. శంకరపట్నం మండలం మొలంగూరు గ్రామంలోని దూద్‌బావి నీటి గురించి ఎంతగా వర్ణించి చెప్పినా తక్కువే.
Molangur Doodh Well : అడుగు మొదలుపై భాగం వరకు రాతి కట్టడంతో ఉన్న దూద్‌బావి నీటిలో నాణెం వేసినా అది స్పష్టంగా కనిపించడం ఆ బావిలోని నీటి పారదర్శకతకు నిదర్శనం. దూద్‌బావి నీటిని తాగితే ఎలాంటి రుగ్మతలు దరిచేరవని పరిసర గ్రామాల ప్రజలు గట్టిగా విశ్వసిస్తారు. ఆ బావివి చూసేందుకు పలు ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్నారు.
పాలు, నీళ్లు కలిపిన రీతిలో తెల్లగా ఉండే ఆ బావి నీటిని నిజాం నవాబు తన తాగునీటి అవసరాల కోసం గుర్రాలపై ఇక్కడి నుంచి తెప్పించుకునే వారని స్థానికులు చెబుతున్నారు. బావిలో ఊటనీరు చేరుకోగానే తోడుకుని వెళ్ళేందుకు వీలుగా రాత్రి మొదలు తెల్లవార్లు ప్రజలు ఆ బావి వద్ద జాగరణ చేసే దృశ్యాలు నిత్యకృత్యం. ఐతే ఏళ్ళ తరబడి చరిత్రగానే మిగిలిపోయిన దూద్‌బావిలోని నీటి విశిష్టతను అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో పరీక్షించారు.
దాహం తీరాలంటే రోజూ ఎండలో 2కి.మీ నడవాల్సిందే!
మార్కెట్‌లో బడా కంపెనీలు బాటిళ్లు, ప్యాకెట్ల రూపంలో అమ్మే నీటికంటే ప్రకృతి సిద్ధమైన దూద్‌బావి నీరు శ్రేష్ఠంగా ఉందని భూగర్భ జలశాఖ అధికారులు ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో తేటతెల్లమైంది. జిల్లాల విభజన తర్వాత మొలంగూరు కోట, దూద్‌బావి పరిసరాలను పర్యాటకంగా గుర్తింపు తేవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా మెులంగూరు గ్రామస్థులు బావి రక్షణకు చర్యలు చేపడుతున్నారు.
"ఈ బావిలోని నీరు తియ్యగా కొబ్బరి నీళ్లలాగే ఉన్నాయి. ఈ నీళ్లు తాగితే ఎలాంటి రోగాలు రావు. అందుకే ఇక్కడ నీళ్లనే తాగుతున్నాం. ఈ బావిని కాకతీయ రాజులు తవ్వించారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఈ బావిలోని నీరునే తీసుకెళ్తారు. కరోనా సమయంలో కూడా ఈ నీళ్లు మెడిసిన్‌లా ఉపయోగపడ్డాయి." - గ్రామ ప్రజలు
మరో వివాదంలో తాజ్ మహల్! అక్కడ వాటర్ బాటిళ్లు నిషేధం - అసలేం జరిగిందంటే? - Taj Mahal Controversy