ETV Bharat / offbeat

అమ్మాయిలూ అలర్ట్- మంచితనం మనకెందుకు?! - Good Behaviour Hurts you

Over Good Behaviour Will Hurt You : చిన్నపాటి పొగడ్తకే పొంగిపోవడం, స్వల్ప విమర్శకూ కుంగిపోవడం కొందరి నైజం. అందరి చేత మంచివారు అనిపించుకోవడానికి ఆరాటపడుతుంటారు కొందరు. అందుకు ఎవరేం చెప్పినా 'సరే' అంటారు. కానీ, ఆ మంచితనమే ఒక్కొసారి బలహీనతగా మారి ఇబ్బందుల పాలు చేస్తుంది. మరి అలాంటి వాటిని అధిగమించాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!

over_good_behaviour_will_hurt_you
over_good_behaviour_will_hurt_you (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 18, 2024, 9:28 AM IST

Over Good Behaviour Will Hurt You : "మా సంధ్య బంగారు తల్లి, పెద్ద వాళ్లంటే గౌరవం, చెప్పిన మాట వింటుంది’’ అత్తగారు పక్కింటి వాళ్లతో అంటుంటే విని నిట్టూర్చింది సంధ్య. ఈ ‘మంచిది’ అనిపించుకునే బలహీనత చిన్నప్పటి నుంచీ మొదలైంది సంధ్యకి.

అప్పటి వరకూ ఇంటి దగ్గర స్కూల్లో చదివిన సంధ్యని, కొంచెం దూరంగా ఉన్న పెద్ద స్కూల్లో చేర్పించారు. మొదటిరోజు టీచర్‌ ఇచ్చిన హోమ్‌వర్క్‌ మొత్తం చేసి, చెప్పిన పాఠం చదివి వెళ్లిన సంధ్యని క్లాసులో మెచ్చుకుంది టీచర్‌. ‘‘అందరూ చూడండి, సంధ్య ఎంత చక్కగా మొత్తం హోమ్‌వర్క్‌ చేసింది, చెప్పిన పాఠం నేర్చుకుంది- క్లాప్స్‌ కొట్టండి అందరూ’’ అంటూ అందరిచేత చప్పట్లు కొట్టించింది టీచర్‌. ఆ చప్పట్లూ, మెప్పులూ సంధ్య బలహీనతగా మారాయి. స్కూల్లో, ఆ తరవాత కాలేజీలో, సంధ్య ఉత్తమ విద్యార్థినిగా ఉండడానికే తాపత్రయపడింది.

తనతో చదివిన పిల్లలూ స్నేహితులూ ఎప్పుడైనా క్లాస్‌ ఎగ్గొట్టి సినిమాకి వెళ్లినా.. సంధ్య మాత్రం క్లాస్‌ అస్సలు మిస్‌ చెయ్యలేదు. అలాగే ఉద్యోగంలో చేరాక కూడా, ఎప్పుడూ ఉత్తమ ఉద్యోగస్తురాలిగానే పేరు పొందింది. అదే అదనుగా తోటి ఉద్యోగులు.. పనులు సంధ్య మీద వదిలేసి షాపింగ్‌కి వెళ్లడం, ఏదో ఒక సాకుతో త్వరగా ఇంటికి వెళ్లడం గమనించినా, ఏమీ చెయ్యలేక కోపం దిగమింగుకునేది, ‘మంచివాళ్లకి కోపం రాకూడదు కదా’ అనుకుంటూ. అలా, సంధ్య మంచితనం ఈ నోటా, ఆ నోటా పాకి, సుధీర్​ కుటుంబానికి చేరింది. అమ్మాయి బావుంది, ఉద్యోగం చేస్తోంది, అన్నిటికీ మించి ‘మంచిది’ అని, అడిగి మరీ కోడలిగా తెచ్చుకున్నారు. పెళ్లయిన వారానికే, వంటిల్లు అప్పచెప్పింది అత్తగారు తన మంచి కోడలికి. ఆనందంగా స్వీకరించింది ఉత్తమ కోడలు సంధ్య.

మీరు అతి మంచివారా? - జరగబోయేది ఇదే!

పొద్దున్నే లేచి అత్తగారికీ మామగారికీ కాఫీ కలిపి, స్నానం చేసి, ఆవిడ పూజ కోసం అంతా రెడీ చేస్తే.. సంధ్య టిఫిన్లూ వంటా చేసేలోగా ఆవిడ ఆరుకోట్ల దేవుళ్లకి పూజ కానిచ్చేది. కాలేజీకి వెళ్లే మరిదికీ ఆడపడుచుకీ డబ్బాలు అందిస్తే అదేదో సంధ్యకి ఉద్ధరింపు అన్నట్టే తీసుకుని వెళ్లేవారు. తనకీ భర్తకీ అన్నీ సర్ది బయలుదేరుతుంటే అత్తగారు ‘ఓ చుక్క కాఫీ ఇస్తావా?’ అనేది. ‘ఇప్పటికే లేటైంది.. నువ్వు ఆటోలో వెళ్లిపో’ అనేసి సుధీర్​ బయల్దేరేవాడు కానీ, ‘రోజూ ఇలా ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు చివరి నిమిషంలో పని చెప్పడం ఏమిటి?’ అని మాత్రం తల్లితో అనే వాడు కాదు.

సుధీర్ తల్లి మాత్రం కోడలు వచ్చాక హాయిగా ఎదురింటి వదినతో, పక్కింటి చెల్లెమ్మతో సినిమాలకూ గుళ్లకూ షాపింగ్‌లకూ బిజీగా తిరుగుతూనే ఉండేది. సంధ్య ఆఫీస్‌లో పని అయ్యి ఇంటికి వచ్చేసరికి, ఇల్లు అడ్డదిడ్డంగా ఉండేది. అది సర్దడం, వంట చెయ్యడం అంతా సంధ్య బాధ్యతే అన్నట్టు, ఎప్పుడైనా బస్సు దొరకక కాస్త లేటుగా వస్తే ఇంటిల్లిపాదీ సణుగుతూ ఉండేవారు. ఇంట్లో పరిస్థితి ఇలా ఉంటే- ఆఫీసులోనూ సంధ్య మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ‘ప్లీజ్‌’ అనే ఒక్క మాటతో పని మీద పడేసి పోయే గ్యాంగ్‌, ఆమె మీద అదనపు భారం పెడుతూనే ఉన్నారు. ఇంట్లో, ఆఫీసులో పని ఎక్కువై, ఎవరినీ ఏమీ అనలేక ఒక రకమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోతోంది సంధ్య. అయినా సంధ్యను పట్టించుకునేవారు లేరు.

ముందు నుంచీ ఆఫీసులో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకుండా, అప్పగించిన పని చెయ్యడం సంధ్యకి అలవాటు. ఇప్పుడు పని ఇదివరకటిలాగా గబగబా అవడంలేదు. దాంతో పై అధికారులు ఏదో ఒకటి అంటున్నారు. అది తన పనికాదని చెప్పలేకా ఎవరినీ ఏమీ అనలేకా నిశ్శబ్దంగా బాధపడుతోంది. అదుగో అప్పుడే, సంధ్య పాలిట దేవతలా వచ్చింది ‘అరుణ’ ఆఫీస్‌ మేనేజర్‌గా. వయసులోనూ అనుభవంలోనూ సీనియర్‌ అవడంతో, వచ్చిన వారంలోనే అన్నీ గమనించింది. ఉన్న నలుగురు ఆడవాళ్లలో, సంధ్య తప్ప మిగిలినవాళ్లు పని ఎగ్గొట్టి తిరగడం, అదంతా ఆ అమ్మాయి నోరెత్తకుండా పూర్తి చెయ్యడం, అందరూ అయిదు అవగానే వెళ్లిపోతుంటే, సంధ్య మాత్రం ఆరున్నర దాకా కదలకుండా చెయ్యడం, ‘థాంక్స్‌ సంధ్య, నువ్వెంత మంచిదానివి’ అని వాళ్లు అనగానే ఆ అమ్మాయి మొహంలో మెరుపు అన్నీ గమనించింది అరుణ.

ఒక నెల అవగానే, అరుణ మొదటగా అందరి సీటూ మార్చింది. ప్రతి వాళ్లూ ఫైల్‌ అవగానే వచ్చి దాని వివరణ ఇవ్వాలి అని చెప్పింది, దాంతో, అందరూ ఎవరిపని వాళ్లే చెయ్యడం మొదలుపెట్టారు. ‘సంధ్య మంచి పనిమంతురాలు. ఇలాంటివాళ్లు మేనేజర్‌గా ఉండాలి’ అనుకుంది అరుణ. ఒకరోజు సంధ్య లంచ్‌కి కూర్చుంటే, అరుణ కూడా బాక్స్‌ తీసుకుని ఆమె దగ్గర కూర్చుంది. ‘‘అందరితో కూర్చుని తినకుండా ఇలా ఒంటరిగా కూర్చున్నావేమిటి సంధ్య?’’ అంటూ బాక్స్‌ తీసింది. మొహమాటంగా ఒక నవ్వు నవ్వింది సంధ్య. ‘నీకు నవ్వు తప్ప మాటలు రావా?’’ అన్న అరుణతో, ‘‘అనవసరమైన మాటలు మాట్లాడేకంటే ఇదే మంచిది కదా అరుణగారూ’’ అంది.

మా అత్తయ్య మారాలంటే ఎలా.. సలహా ఇవ్వండి

‘‘నువ్వు మంచి పనిమంతురాలివి, ప్రమోషన్‌ ఎందుకు తీసుకోలేదు?’’ అడిగింది అరుణ. ఈ ప్రశ్నని ఏమాత్రం ఊహించని సంధ్య ఆశ్చర్యపోయింది. ‘‘ఉద్యోగంలో చేరాక అదే స్థాయిలో ఉండిపోకూడదు, మనకి జీవితంలో ఎదుగుదల అనేది చాలా ముఖ్యం. అది ఉద్యోగంలో కానీ, జీవితంలో కానీ. కూతురి నుంచి భార్యగా కోడలిగా తరవాత అమ్మగా ఎదగాలి. అలానే ఉద్యోగంలో కూడా. అప్పుడే నీకు తృప్తి ఉంటుంది. నీ తరవాత చేరిన వాళ్లు నిన్ను దాటిపోతుంటే నీకు ఆత్మవిశ్వాసం పోతుంది’’ అన్న అరుణ వైపు ప్రశంసగా చూసింది.

‘‘మీరు మాట్లాడుతుంటే నా పై అధికారిలా లేదు. మా అక్క మాట్లాడినట్టు ఉంది. మీరు అన్నదాన్ని నేను ఆలోచిస్తాను’’ అంటున్న సంధ్యతో, ‘‘వచ్చే నెలలో ప్రమోషన్‌ పరీక్షకి ప్రకటన వస్తుంది తప్పక ప్రయత్నించు’’ అని వెళ్లింది అరుణ. ఇంటికెళ్లాగానే సుధీర్​తో ప్రమోషన్‌ పరీక్ష గురించి సంతోషంగా చెప్పింది. అతను వెంటనే ‘‘ట్రాన్స్‌ఫర్‌ ఉండదుగా’’ అన్నాడు. ‘‘ఉహు’’ అంది. ‘‘అయితే చదువు’’ అన్నాడు కానీ, అసలు సంధ్యకి టైమ్‌ ఎక్కడ అనే గ్రహింపు లేదు. పని అంతా మీద వేసుకుని చేస్తుంటే చదివే సమయం ఉండటం లేదు.

అత్తగారు పక్కవాళ్లతో ‘మా కోడలు మంచిపిల్ల, నన్ను అస్సలు పని ముట్టుకోనివ్వదు’ అనడం, ఆడపడుచు లిఖిత ‘మా వదిన ఎంత మంచిదో తెలుసా! నేను ఏమి అడిగితే అది చేస్తుంది’ అని గర్వంగా చెప్పడం ఇప్పుడు అంత సంతోషాన్ని ఇవ్వడంలేదు సంధ్యకి. ‘నాకు వద్దు ఈ మంచితనం కితాబు, నేను పరీక్షకి చదవాలి’ అనుకుని నీరసంగా వెళ్లింది ఆఫీసుకి. ఈసారి సంధ్య వచ్చి అరుణతో ‘‘మీతో లంచ్‌ టైములో కొంచెం మాట్లాడాలి’’ అంది. ‘‘సరే’’ అని అరుణ లంచ్‌ టైమ్‌లో వచ్చి కూర్చుంది, సంగతి చెప్పింది సంధ్య. విని నవ్వింది అరుణ. ‘‘నేను నీ బలహీనత గమనించాను సంధ్య! నీకు మంచిదానివి అనిపించుకోవాలని తాపత్రయం. ప్రపంచం మొత్తానికి ఎప్పటికీ నువ్వు మంచిదానివి కాలేవు అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. నిన్ను ‘మంచి’ అని పొగిడేవాళ్లు ఎప్పుడైనా నీకు ఉపయోగపడ్డారా, లేక నిన్ను ఉపయోగించుకుంటున్నారా, ఆలోచించు.

ముందు నీ మంచి చూసుకో, తరవాత నీ కుటుంబం మంచి చూడు, తరవాతే ఎవరైనా. నువ్వు ప్రమోషన్‌ తెచ్చుకుంటే నీ కుటుంబంలో అందరికీ ఆర్థికంగా ఉపయోగం ఉంటుంది. అలాంటపుడు వాళ్లాందరూ నీకు సహకరించాలి, కాదంటే నువ్వు నెమ్మదిగా చెప్పి ఒప్పించు. వాళ్లు సహాయం చెయ్యకపోతే వాళ్లని ఎలా ఒప్పించాలో నువ్వే ఆలోచించు’’ చెప్పింది అరుణ. ఇంటికి వెళ్లాక భోజనాలయ్యాక అందరూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఆ ప్రస్తావన తెచ్చింది.

నిలబడి నీళ్లు తాగుతున్నారా? - మీరు డేంజర్​లో ఉన్నట్టే! - HOW TO DRINK WATER

‘‘అత్తయ్యగారూ, నాకు వచ్చే నెలలో ఆఫీస్‌ పరీక్షలు ఉన్నాయి, పొద్దున్న మామూలుగా అన్ని పనులూ చేస్తాను, సాయంత్రం ఆఫీసులో చదువుకుని రావాలి. ఈ నెల రోజులూ రాత్రి వంట లిఖిత సాయంతో మీరు కొంచెం చూసుకోండి’’ అంది. ‘‘చూడమ్మాయ్‌, గుళ్లో రేపటి నుంచి ప్రవచనాలు. నేను వెళ్లాలి. నాకు కుదరదు’’ అని అత్తగారు అంటుండగానే ‘‘నాకు రెండు నెలల్లో ఫైనల్‌ పరీక్షలు, నాకు ఇవన్నీ పెట్టకు వదినా’’ అని లేచి వెళ్లిపోయింది లిఖిత. నిస్సహాయంగా భర్త వైపు చూస్తే, పేపర్‌ చాటున తల దాచుకున్నాడు అతను.

‘నువ్వు మంచిదానివి అనిపించుకోవడం వల్ల నీకేమన్నా ఉపయోగమా?’ అన్న అరుణ మాటలు గుర్తొచ్చాయి. రాత్రంతా ఏడ్చి కళ్లు ఎర్రబారి, మొహమంతా ఉబ్బి ఉన్న సంధ్యని ఆఫీసులో విచిత్రంగా చూశారు అందరూ. ‘‘నాకీ మంచితనం వద్దు అరుణగారూ’’ అంటూ కళ్లనీళ్లు పెట్టుకున్న సంధ్యని నవ్వుతూ చూసి ఒక లెటర్‌ చేతికిచ్చింది గీత. ‘‘మంచితనం నీ బలం కావాలి సంధ్య, బలహీనత కాదు. దాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకో. మంచిగా ఉండద్దని ఎప్పుడూ ఎవ్వరూ చెప్పరు. కానీ దాన్ని అవతలివాళ్లు ఆయుధంగా వాడి, నిన్ను ఉపయోగించుకోకుండా చూసుకోవడం నీ చేతుల్లోనే ఉంది.

నీకు ఒక నెల రోజులు ముంబై హెడ్‌ ఆఫీసులో ట్రైనింగ్​ ఉంటుంది. ఒకవేళ వెళ్లకపోతే డిసిప్లినరీ యాక్షన్‌ తీసుకుంటారు’’ అంటున్న అరుణని, ఆశ్చర్యంగా చూస్తున్న సంధ్యతో- ‘‘ఇది మంచి అవకాశం, నా స్నేహితుడు అక్కడ ఫ్యాకల్టీ, అతనికి చెప్తేనే నీకు ట్రైనింగ్‌ అవకాశం వచ్చింది. అక్కడ ప్రమోషన్‌ పరీక్షకి తగ్గ ట్రైనింగ్‌ ఉంటుంది. ఇది నీకు సువర్ణ అవకాశం. మాములుగా అంటే మీ ఇంట్లో ఒప్పుకోరు కానీ, వెళ్లకపోతే చర్య తీసుకుంటారు అంటే, చచ్చినట్టు ఒప్పుకుంటారు’’ అంది అరుణ.

ఇంటికెళ్లాక ఏమీ మాట్లాడకుండా ఆ కాగితం సుధీర్​ చేతికి ఇచ్చింది సంధ్య. ‘‘ఇది ఏమిటి. పరీక్ష అన్నావు. ఇప్పుడు ఈ ట్రైనింగ్‌?’’ సందేహంగా అన్నాడు సుధీర్​. ‘‘నాకేం తెలుసు? ఇది తప్పదు, పరీక్ష ఎలానో తెలీదు, ఆ టైమ్‌కి ముంబైలోనే ఉంటాను. మరి రాయనిస్తారో లేదో. వెళ్లకపోతే డిసిప్లినరీ యాక్షన్‌ అంటున్నారు మా మేనేజర్‌. ఏదైనా తేడా వచ్చి, ఉద్యోగానికి ముప్పు వస్తే- మనం లిఖిత పెళ్లి కోసం, మేడ మీద కట్టడం కోసం చేస్తున్న పొదుపు ఆగిపోతుంది. కానీ, నెల రోజులు నేను లేకుండా మీకు అందరికీ కష్టం. పాపం అత్తయ్యగారు ఇంట్లో పని చెయ్యలేరు, లిఖిత చదువుకోవాలి. ఏం చెయ్యాలో నాకు పాలుపోవడంలేదు. పోనీ ఉద్యోగం మానెయ్యనా?’’ మంచితనం ముసుగు వేసుకుని బాధగా అంటున్న సంధ్యని, అప్పటికే బయట తచ్చట్లాడుతున్న అత్తగారు గభాలున రూమ్‌లోకి వచ్చి ఆపారు.

‘‘నువ్వు లేకపోతే ఇల్లు నడవదా ఏమిటి? నెలేగా, అందరం తలా ఒక చెయ్యి వేస్తాం. నువ్వు అదేదో ట్రైనింగ్‌కి వెళ్ళు’’ అని ఆర్డర్‌ లాంటి సలహా ఇచ్చింది సంధ్య అత్తయ్య. ‘‘మీరందరూ ధైర్యం చెప్తే అలాగే అత్తయ్యా’’ వినయంగా అంది సంధ్య. ‘మంచితనానికీ మంచి అనిపించుకోవాలనే తాపత్రయానికీ తేడా తెలుసుకో, ఎక్కడ ఎలా పనులు చేయించాలో తెలీకపోతే నువ్వు ఆఫీసులో మేనేజర్‌ పోస్ట్‌కీ ఇంట్లో కోడలి పోస్టుకీ పనికిరావు’ అన్న అరుణ మాట గుర్తుతెచ్చుకుని, ‘నాకొద్దీ మంచితనం కితాబు బాబూ! నేను కొంచెం గడుసుతనం నేర్చుకుంటా’ అనుకుంది సంధ్య.

చివరగా... ఇది ఓ మహిళ కథనమే అయినా, పురుషుల్లోనూ ఇలాంటి వారు లేకపోలేదు.

కొరియన్​ మహిళల బ్యూటీ సీక్రెట్​ ఇదే- అందానికి ఆ అలవాట్లే అతి ముఖ్యం - Korean beauty secret

వృద్ధాప్యం వాయిదా వేయాలనుకుంటున్నారా?- వీటిని ట్రై చేయండి! - Anti Aging best Food

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.