Nellore Special Puli Bongaralu : సాధారణంగానే చాలా మంది మహిళలు వారానికి సరిపడా ఇడ్లీ/దోశ పిండి రుబ్బుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటుంటారు. పిండి ఇలా సిద్ధంగా ఉంటే అప్పటికప్పుడు దోశలు వేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అయితే.. దోశ పిండితో ఇంట్లో దోశలు వేసుకోవడం రొటీన్. అలా కాకుండా ఈ సారి కొత్తగా "నెల్లూరు స్పెషల్ పులి బొంగరాలు" ప్రిపేర్ చేయండి. ఈ స్టోరీలో చెప్పిన విధంగా ప్రిపేర్ చేస్తే.. కరకరలాడుతూ ఎంతో రుచిగా ఉంటాయి. వీటికి కాంబినేషన్‌గా కారం పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఇక ఆలస్యం చేయకుండా ఈ రెండు రెసిపీలను ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..
పులి బొంగరాలకు కావాల్సిన పదార్థాలు :
- పులిసిన దోశ పిండి- 3 కప్పులు
- శనగపప్పు-పావు కప్పు
- ఉప్పు రుచికి సరిపడా
- పచ్చిమిర్చి-4
- జీలకర్ర-టీస్పూన్
- కరివేపాకు-2 రెమ్మలు
- ఉల్లిపాయలు-2
- కొత్తిమీర తరుగు-కొద్దిగా
తయారీ విధానం :
- ముందుగా శనగపప్పు ఒక అరగంటపాటు నీళ్లలో నానబెట్టుకోవాలి.
- అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి దోశ పిండి తీసుకోవాలి.
- ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, నానబెట్టిన శనగపప్పు, కరివేపాకు తరుగు, కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోండి.
- ఇప్పుడు పులి బొంగరాలు వేయించడం కోసం.. స్టౌపై కడాయి పెట్టి నూనె పోయండి. (ఆయిల్ వేడయ్యాక కొద్దిగా పిండి వేయండి. అది వెంటనే ఆయిల్లో తేలితే నూనె బాగా కాగినట్లు గుర్తు)
- ఇప్పుడు చేతితో పిండిని కొద్దికొద్దిగా తీసుకుని ఆయిల్లో పులి బొంగరాలు వేసుకోండి. ఒక నిమిషం తర్వాత స్టౌ మీడియం ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసి పులి బొంగరాలను దోరగా వేయించుకోండి.
- పులి బొంగరాలు రెండు వైపులా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- మిగిలిన పిండితో ఇలా పులి బొంగరాలు వేయించుకుంటే సరిపోతుంది. పులి బొంగరాలు కరకరలాడుతూ ఎంతో రుచికరంగా వస్తాయి.
- వీటిని కారం పచ్చడి, పల్లీ చట్నీ, టమాటా చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటాయి.
కారం చట్నీకి కావాల్సిన పదార్థాలు :
- ఎండుమిర్చి -7
- వెల్లుల్లి రెబ్బలు-4
- ఉల్లిపాయ-1
- చింతపండు - కొద్దిగా
- ఉప్పు రుచికి సరిపడా
- జీలకర్ర-టీస్పూన్
కారం చట్నీ తయారీ విధానం :
- ముందుగా ఎండుమిర్చీలను ఒక పావు గంటసేపు నీటిలో నానబెట్టుకోవాలి.
- అలాగే ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి నానెబెట్టిన ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు, ఉప్పు, జీలకర్ర వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. (ఈ పచ్చడి కోసం నీళ్లు ఉపయోగించకూడదు.)
తాలింపు కోసం..
- నూనె-2 టేబుల్‌స్పూన్లు
- మినప్పప్పు-టీస్పూన్
- ఆవాలు- అరటీస్పూన్
- జీలకర్ర-అరటీస్పూన్
- కరివేపాకు-1
తాలింపు తయారీ విధానం..
- తాలింపు కోసం స్టౌపై పాన్ పెట్టి.. ఆయిల్ వేయండి.
- నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి ఫ్రై చేయండి.
- తర్వాత కరివేపాకు వేయండి.
- తాలింపు దోరగా వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసి కలుపుకోండి.
- అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే స్పైసీ కారం పచ్చడి రెడీ అయిపోతుంది.
ఇవి కూడా చదవండి :
కరకరలాడే "పెసర గారెలు" - ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్ - పైగా నూనె అస్సలు పీల్చుకోవు!
పిల్లల కోసం సూపర్ స్నాక్ రెసిపీ - టేస్టీ "ఆలూ బటర్ శాండ్విచ్" - సింపుల్‌గా చేసుకోండిలా!