Family Members Installed Bull Idols in Annamayya District : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం నరసాపురంలో 15 ఏళ్ల క్రితం రెండు ఎద్దులు మృతి చెందడంతో వాటి జ్ఞాపకార్థం విగ్రహాలు తయారు చేయించి ప్రతిష్టించాడు ఓ యజమాని. పెద్దపయ్య కుటుంబం అన్ని విధాలా అభివృద్ధి చెందడానికి ఆ ఎద్దుల కష్టం ఎంతో ఉందని గ్రామస్థులు తెలిపారు. పెద్దపయ్య ఇంటిలో మొదట కోడె దూడ జన్మించింది. దానికి జత కోసం మరో ఎద్దును కొన్నారు. అవి వారి కుటుంబం అభివృద్ధికి ఎంతో కష్టపడ్డాయన్నారు. పొలంలో బండి కట్టి ఇంటికి వెళ్లమని ఆదేశిస్తే మధ్యలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా ఇంటికి చేరుకునేవని కుటుంబసభ్యులు తెలిపారు.
శ్రీశైలంలో కన్నుల పండువగా రథోత్సవం.. ఒంగోలులో ఎడ్ల బండలాగుడు ప్రదర్శన
గ్రామంలో ఎలాంటి సమస్యలు వచ్చినా ఎద్దులకు పూజలు చేస్తే సమస్యలు తొలగిపోయేవని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో 15 ఏళ్ల క్రితం ఒక ఎద్దు రోడ్డు ప్రమాదంలో చనిపోగా, మరో ఎద్దు ఇంటి దగ్గరే చనిపోయిందన్నారు. ఈ కాడెద్దులు పెద్దపయ్య కుటుంబానికి అభివృద్ధి కోసం చేసిన కష్టానికి గుర్తుగా ఊరి పొలిమేరలో చిన్నపాటి ఆలయం నిర్మించి అందులో ఎద్దుల విగ్రహాలను ఏర్పాటు చేయించారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మూడో శుక్రవారం విగ్రహాలకు వైభవంగా పూజలు చేసి అన్నదాన కార్యక్రమం చేస్తున్నట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.
ప్రమాదవశాత్తు ఎద్దులు చనిపోవడం బాధాకరం. కాడెద్దుల వల్లే పెద్దపయ్య కుటుంబం అభివృద్ధి చెందింది. అందుకు జ్ఞాపకార్థంగా విగ్రహాలు ఏర్పాటు చేసి గుడి కట్టారు. ప్రతిరోజు పూజలు చేస్తున్నారు. కాడెద్దులు చనిపోయినప్పటి నుంచి వాటి జ్ఞాపకార్థంగా ప్రతి ఏటా శ్రావణమాసంలో ప్రత్యేక పూజలు చేసి అన్నదానం చేస్తున్నాం. - స్థానికులు
ఒంగోలు గిత్తల ఊసే లేదు - పాల డెయిరీకి పాడె కట్టిన జగన్ - cm ys jagan neglected ongole dairy
కుటుంబ సభ్యులు ప్రతిరోజు కాడెద్దులకు పూజలు చేసేవారు. ఈ ఏడాది కూడా రెండు ఎద్దుల విగ్రహాలకు పూజలు చేసి అన్నదానం చేశారు. ఇలాంటి ఎద్దులు జన్మించడం మాకు ఎంతో సంతోషమని పెద్దపయ్య కుటుంబ సభ్యులు అన్నారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ఘనంగా వాటికి పూజలు కొనసాగిస్తామని తెలిపారు. గ్రామస్థులు కూడా కాడెద్దులు చేసిన శ్రమను, విశ్వాసాన్ని కొనియాడుతున్నారు. నోరులేని మూగ జీవాలు తమ యజమాని వద్ద ఎంతో నమ్మకంగా పనిచేసి గ్రామ ప్రజల మన్ననలు పొందాయి.
తిరుపతి జిల్లాలో అట్టహాసంగా జల్లికట్టు పోటీలు- కొత్త అనుభూతి కలిగిందన్న యువత