ETV Bharat / lifestyle

ముఖానికి ఐస్​తో మర్దన చేస్తే అందం పెరుగుతుందా? - నిపుణుల క్లారిటీ! - FACIAL ICING IN TELUGU

- ఐస్​ ఎలా అప్లై చేయాలి? ముఖంలో ఎలాంటి మార్పులు వస్తాయి? - ప్రముఖ సౌందర్య నిపుణురాలు శైలజ సూరపనేని వివరణ

Ice on Face for Skin
Ice on Face for Skin (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 17, 2025, 4:31 PM IST

Ice on Face for Skin : ముఖం అందంగా కనిపించాలని మనలో చాలా మంది రకరకాల చిట్కాలు పాటిస్తుంటారు. అందులో ముఖాన్ని ఐస్​తో మర్దన చేసుకోవడం కూడా ఒకటి. అయితే, ఫేస్​ గ్లోయింగ్​గా కనిపించడానికి ఈ బ్యూటీ టిప్​ నిజంగానే పని చేస్తుందా? ఇలా ముఖానికి ఐస్‌ రుద్దితే ఏమవుతుంది ? అందం కోసం ఇలాంటి చిట్కాలు పాటించడం మంచిదేనా ? అనే ప్రశ్నలకు ప్రముఖ సౌందర్య నిపుణురాలు 'డాక్టర్​ శైలజ సూరపనేని' చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం.

చైనీస్‌ బ్యూటీ టిప్​ : ముఖానికి ఐస్‌ రుద్దితే మంచిదని తెలిపే శాస్త్రీయ ఆధారాలైతే ఏమీ అందుబాటులో లేవు. ఇలా ముఖానికి ఐస్​ అప్లై చేసుకోవడం చైనీస్‌ స్కిన్‌కేర్‌లో ఒక భాగం! కాలంతో పాటు ఈ బ్యూటీ టిప్​ మన దగ్గరికీ వచ్చింది. ఈ విధానాన్ని చాలా మంది ఎప్పటినుంచో ఫాలో అవుతున్నారు. ముఖ్యంగా ఫేస్​ ఉబ్బినా, కళ కోల్పోయినట్లుగా కనిపించినా ఈ టిప్​ బాగా పనిచేస్తుంది.

ముఖానికి ఐస్​తో మర్దన చేయడం వల్ల చర్మంలో రక్తప్రసరణ మెరుగవుతుందట. దీనివల్ల చర్మరంధ్రాలు తెరుచుకుని చర్మం బిగుతుగా అనిపిస్తుంది. అలాగే స్కిన్​ కొద్దిగా నిగనిగలాడుతున్నట్లూ కనిపిస్తుంది. ముఖానికి ఐస్‌ రుద్దిన తర్వాత మేకప్‌ వేస్తే ఫేస్​కి చక్కగా పట్టేస్తుంది. అందుకే ఎక్కువ మంది ఈ చిట్కా ఫాలో అవుతుంటారని డాక్టర్​ శైలజ సూరపనేని చెబుతున్నారు.

ఈ చిట్కా ఫాలో అయ్యేవారు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవేంటంటే- అదే పనిగా నేరుగా ముఖానికి ఐస్​తో మసాజ్​ చేసుకోకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల చర్మం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఫేస్​కి ఐస్​ని నేరుగా అప్లై చేయకుండా, ఒక శుభ్రమైన వస్త్రంలో చుట్టి, మృదువుగా వృత్తాకారంలో మసాజ్‌ చేసుకోవాలి. ముఖానికి ఐస్‌ పెట్టాక ఫేస్​ పొడిబారుతుంది. కాబట్టి, మాయిశ్చరైజర్‌ తప్పకుండా ఉపయోగించాలి.

"కొందరికి బుగ్గల్లో గులాబీ రంగులో గీతలు కనిపిస్తుంటాయి. అలాంటివారు ముఖాన్ని ఐస్​తో రుద్దుకోకూడదు. అలాగే మరికొంతమందికి ఐస్‌ రాశాక దద్దుర్లు, ఎరుపెక్కడం వంటి ఇబ్బందులు కనిపిస్తాయి. ఇలాంటి ఇబ్బందులూ, సెన్సిటివ్‌ స్కిన్‌ ఉన్నవారు డాక్టర్ల సలహాతోనే ఈ చిట్కా పాటించాలి. అలాగే కెమికల్‌ పీల్స్, లేజర్‌ ట్రీట్మెంట్​ చేయించుకున్నవారూ కొన్నాళ్లు దీనికి దూరంగా ఉండాలి. "- డాక్టర్​ శైలజ సూరపనేని (సౌందర్య నిపుణురాలు)

ఐస్​ ట్రీట్మెంట్​ స్కిన్​కి తొందరగా ఫలితాలిస్తుంది అన్నమాట వాస్తవమే! కానీ, ఈ చిట్కా శాశ్వత పరిష్కారం మాత్రం కాదు. హెల్దీ స్కిన్​ కోసం మంచి ఫుడ్​, నిద్రకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే డైలీ ఒక్కసారికి మించి ఐస్‌ రుద్దకూడదని డాక్టర్​ శైలజ సూరపనేని చెబుతున్నారు.

NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

జుట్టు ఒత్తుగా పెరగడానికి "ఉల్లి నూనె" - మార్పు తప్పక చూస్తారంటున్న నిపుణులు!

చలికాలం జుట్టు విపరీతంగా ఊడుతోందా? - ఈ హెయిర్ ప్యాక్స్ ట్రై చేస్తే ఆ సమస్యే ఉండదట!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.