ETV Bharat / international

బైడెన్​ VS ట్రంప్​ రీమ్యాచ్ ఫిక్స్- అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో రెండోసారి

US Election 2024 Rematch : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఖరారయ్యారు. రిపబ్లికన్ల తరఫున డొనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ పార్టీ నుంచి జో బైడెన్ బరిలోకి దిగనున్నారు. అయితే ఇప్పటి వరకు అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో ఇలా ఒకే అభ్యర్థులు వరుసగా రెండు సార్లు బరిలో దిగడం(రీమ్యాచ్​) రెండో సారి.

US Election 2024 Rematch
US Election 2024 Rematch
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 13, 2024, 11:07 AM IST

Updated : Mar 13, 2024, 11:35 AM IST

US Election 2024 Rematch : త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ మధ్య పోరు ఖాయమైంది. తాజాగా జరిగిన జార్జియా ప్రైమరీలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విజయం సాధించారు. దీంతో డెమొక్రటిక్​ పార్టీ నుంచి అభ్యర్థిత్వానికి నామినేట్‌ కావడానికి అవసరమైన 1,968 మంది ప్రతినిధులను సంపాదించుకున్నారు. ఆగస్టులో షికాగోలో జరగనున్న డెమొక్రటిక్‌ పార్టీ నేషనల్‌ కన్వెన్షన్‌లో బైడెన్‌ నామినేషన్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. అలాగే రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అభ్యర్థిత్వం సైతం ఖరారైంది. తాజాగా వాషింగ్టన్‌ ప్రైమరీలో విజయం సాధించారు. దీంతో నామినేషన్‌కు కావాల్సిన 1215 ప్రతినిధుల ఓట్లను కైవసం చేసుకున్నారు డొనాల్డ్ ట్రంప్​. జులైలో మిలావాకీలో జరగనున్న రిపబ్లికన్ పార్టీ నేషనల్ కన్వెన్షన్‌లో ట్రంప్‌ అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటిస్తారు.

US Election 2024 Rematch
ఎన్నికల ప్రచారంలో అధ్యక్షుడు జో బైడెన్

Trump Vs Biden 2024 Polls : జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ తమ పార్టీల తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండో సారి తలపడనుండడం ఆసక్తికరంగా మారింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలో రీమ్యాచ్​ జరగడం (వరుసగా రెండు సార్లు ఒకే అభ్యర్థులు పోటీ చేయడం) రెండోసారి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్​ ట్రంప్​, డెమొక్రాట్ల తరఫున జో బైడెన్ పోటీ పడ్డారు. 2024 నవంబరులో జరిగే పోరుకు కూడా వీరిద్దరి అభ్యర్థిత్వమే ఖరారైంది.

US Election 2024 Rematch
ఎన్నికల ప్రచారంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

అంతకుముందు 1952 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున డ్వైట్​ డీజిన్​హవర్​, డెమొక్రాట్ల తరఫున అడ్లై స్టీవెన్​సన్​-2 పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో డీజిన్​హవర్ భారీ విజయం సాధించారు. మళ్లీ 1956లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వీరిద్దరే ప్రత్యర్థులగా బరిలోకి దిగారు. ఆ ఎన్నికల్లో కూడా రిపబ్లికన్ అభ్యర్థి డీజిన్​హవర్ గెలుపొందారు. మరి 2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​, బైడెన్ ఇద్దరిలో ఎవరిని విజయం వరిస్తుందో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.

US Election 2024 Rematch
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు

ఎన్నికల బరిలో నుంచి నిక్కీ హేలీ ఔట్​
Nikki Haley Drop Out US Presidential Race : అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు నిక్కీ హేలీ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా డొనాల్డ్​ ట్రంప్​నకు అభినందనలు తెలిపిన హేలీ, అందరి ఓట్లు సంపాదించేలా చూసుకోవాలని ఆయనకు సలహా ఇచ్చారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Vivek Ramaswamy Polls : నేను అధ్యక్షుడినైతే ట్రంప్‌ను క్షమిస్తా.. అలాంటి అమెరికా​ నాకు ఇష్టం లేదు : వివేక్ రామస్వామి

15 రాష్ట్రాల ప్రైమరీల్లో బైడెన్, ట్రంప్ హవా - అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ 'ఢీ'!

Last Updated : Mar 13, 2024, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.