ETV Bharat / international

UAEలో అతిపెద్ద హిందూ ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ - అబుదాబి హిందూ టెంపుల్ మోదీ

UAE Hindu Temple Inauguration : యూఏఈలో నిర్మితమైన అతిపెద్ద హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాప్స్ ఆలయాల్లో జరిగిన గ్లోబల్ హారతిలో పాల్గొన్నారు.

UAE Hindu Temple Inauguration
UAE Hindu Temple Inauguration
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 14, 2024, 7:00 PM IST

Updated : Feb 14, 2024, 10:28 PM IST

UAE Hindu Temple Inauguration : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్​లో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. బాప్స్ ఆధ్యాత్మిక గురువు మహంత్ స్వామిమహారాజ్​తో అబుదాబిలో మొదటి హిందూ రాతి ఆలయ ప్రారంభోత్సవం చేశారు. అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాప్స్ ఆలయాల్లో జరిగిన గ్లోబల్ హారతిలో ప్రధాని పాల్గొన్నారు. అనంతరం గర్భాలయంలో మోకరిల్లి భగవంతుడికి మోదీ నమస్కరించారు. మహంత్ స్వామి మహరాజ్ మోదీని ప్రత్యేక పూలమాలతో సత్కరించారు. ఆలయమంతా కలియతిరిగి పరిశీలించిన మోదీ, ఉపాలయాల్లోని దేవుళ్లను పూజించారు.

అంతకుముందు, దేవాలయ ప్రాంగణానికి విచ్చేసిన ప్రధాని మోదీకి సాధువులు స్వాగతం పలికారు. అక్కడికి పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు చేరుకున్నారు. వారిందరికీ మోదీ అభివాదం చేస్తూ మందిర ప్రాంగణానికి చేరుకున్నారు. మోదీ మెడలో పూలదండ వేసి ఈశ్వరచరందాస్ స్వామి ఆశీర్వదించారు. అనంతరం ఆలయ విశేషాలను వివరించారు. స్వామినారాయణ పాదాల వద్ద పూల రేకులను సమర్పించారు ప్రధాని మోదీ. మహంత్ స్వామిమహారాజ్ పాదాలకు నమస్కరించారు

"ప్రతి ఒక్కరి కోసం ఆలయాన్ని నిర్మించాం. దేవుడి దయ, అందరి సహకారం, అబుదాబి పాలకుల ఔదార్యం, సాధువుల ఆశీర్వాదం, ప్రధాని మోదీ సహకారంతో నిర్మాణం చేపట్టాం. ఆలయ ప్రారంభోత్సవం అందరికీ ఓ వేడుక లాంటిది" అని బాప్స్ స్వామినారాయణ్ మందిర్ సాధువు బ్రహ్మ విహారిదాస్ తెలిపారు. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా హాజరయ్యారు.

ఎన్నో ప్రత్యేకతలు!
అబుదాబిలో బోచసన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ నిర్మించిన ఈ హిందూ దేవాలయం అర‌బ్‌దేశాల్లో అతిపెద్ద ఆల‌యంగా పేరు సంపాదించుకుంది. దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ హిందూ దేవాలయానికి ఏడు గోపురాలు ఉంటాయి. అరబ్‌ ఎమిరేట్స్‌లో ఏడు ఎమిరేట్‌లకు ప్రతీకగా ఈ గోపురాల్ని నిర్మించారు. రాజస్థాన్‌ నుంచి దిగుమతి చేసుకున్న పాలరాయిని నిర్మాణంలో వినియోగించారు. వేలాది మంది శిల్పులు, కార్మికులు దాదాపు మూడేళ్లుగా శ్రమించి ఈ అద్భుత కట్టడంలో భాగస్వాములయ్యారు. 402 తెల్ల పాలరాతి స్తంభాలను ఇందులో అమర్చారు. మరిన్ని విశేషాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అంతకుముందు మోదీ దుబాయ్​లో జరుగుతున్న ప్రపంచ ప్రభుత్వాల సదస్సులో పాల్గొన్నారు. ఆ సమయంలో మరోసారి భద్రతామండలి విస్తరణ అంశాన్ని ప్రస్తావించారు. మనం మన దేశాలను మారుస్తున్నప్పుడు, ప్రపంచంలోని పాలనా సంస్థల్లో సంస్కరణలు జరగకూడదా అని ప్రశ్నించారు. మనం అభివృద్ధి చెందుతున్న దేశాల ఆందోళనలను ప్రపంచ నిర్ణయాధికారాల్లో గ్లోబల్ సౌత్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాల్సి ఉందని, ప్రపంచ ప్రభుత్వాల సదస్సు వేదిక నుంచి ప్రధాని పిలుపునిచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అగ్రనేతలను ఒకే వేదికపై తెచ్చేందుకు ఈ సదస్సు పెద్ద మాధ్యమంగా మారిందని ప్రధాని మోదీ కొనియాడారు. ఇందులో షేక్‌ మహ్మద్‌ బిన్‌ రషీద్‌ దార్శనిక నాయకత్వానిది ప్రముఖపాత్ర ఉందని ప్రశంసించారు. కొవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఎక్స్‌పో-2020, కోప్‌-28 నిర్వహణ దుబాయ్‌ విజయగాధకు పెద్ద ఉదాహరణగా ప్రధాని మోదీ పేర్కొన్నారు.

భారత్‌- యూఏఈ దోస్తీ జిందాబాద్‌!
రెండురోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం యూఏఈకి చేరుకున్నారు. గౌరవవందనంతో ఆయనకు ఘన స్వాగతం లభించింది. తమ దేశానికి వచ్చిన మోదీని యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌ ఆత్మీయంగా స్వాగతించారు. అబుదాబిలో వారిద్దరు భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా ఇరువురు చర్చల్లో పాల్గొన్నారు. అనంతరం అబుదాబిలోని జాయెద్‌ స్పోర్ట్స్‌ సిటీ స్టేడియంలో అహ్‌లాన్‌ మోదీ కార్యక్రమంలో ప్రవాస భారతీయులనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు.

ఆ కార్యక్రమంలో భారత్‌- యూఏఈ దోస్తీ జిందాబాద్‌! అని నినదిస్తున్నట్లు మోదీ వ్యాఖ్యానించారు. ఇరుదేశాల సంబంధాలు కొత్త శిఖరాలకు చేరాయన్నారు. యూఏఈ ప్రభుత్వం తనను అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్‌ ఆఫ్‌ జాయెద్‌తో గౌరవించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఇక మోదీ అబుదాబి నుంచి ఖతార్‌కు వెళ్లనున్నారు. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన నౌకాదళ మాజీ అధికారులు ఇటీవల విడుదలైన నేపథ్యంలో అక్కడికి వెళ్లనున్నారు.

Last Updated : Feb 14, 2024, 10:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.